Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మళ్లీ విద్వేష కుట్ర | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 10,2022

మళ్లీ విద్వేష కుట్ర

సిఎఎ ఇంకా చట్టం కాలేదు. రూల్స్‌ రూపొందలేదు, అయినా 31జిల్లా కలెక్టర్లకు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నుండి వచ్చిన హిందువులు, బౌద్ధులు, కిష్ట్రియన్లు, పార్సీలు, జైన్లుకు మాత్రమే (ముస్లింలను మినహాయించడం గమనార్హం) 1955 పౌరసత్వ చట్టం కింద పౌరసత్వం ఇవ్వమని ఏలినవారు ఆదేశాలిచ్చారు. కానీ 1955 పౌరసత్వ చట్టం మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని సమ్మతించదు. వీరు ఇటీవల ఇందుకు వీలుగా చేసిన సవరణలకు ఆమోదం లేకపోగా దేశంలో నిరసన భగ్గుమంది. అయినా దొడ్డిదారిన అమలు చేయడానికే ఈ ప్రభుత్వం తెగించిందని ఈ ఉదంతం తెలియజేస్తోంది.
అందమైన మాటలతో, అందరూ నిజమేనేమో అనుకునేలా విద్వేషపు విషాన్ని కుమ్మరించి, సమాజాన్ని నిలువునా చీల్చడంలో అందె వేసిన చేయి మోడీ సర్కారుది. మతోన్మాద ఎజెండాను మరింతగా రుద్దేందుకు మరోసారి సిద్ధమవుతున్నట్టుంది. అందుకోసమే వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను మళ్లీ తెరపైకి తెస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పశ్చిమ బెంగాల్‌లో సిఎఎ అమలు చేస్తామని తాజాగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ప్రకటించారు. సిఎఎ ప్రక్రియ మళ్లీ మొదలైందని ఆ రాష్ట్రానికే చెందిన బీజేపీ నాయకుడు సువేందు అధికారి అంతకుముందే పేర్కొన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చింది. జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన ఈ నిర్ణయాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావిస్తూ, ప్రజలను చీల్చేందుకు కుట్ర చేస్తున్నారనే విమర్శలు వస్తుండగానే సిఎఎకు తొలిమెట్టుగా భావించే జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) అంశాన్ని కేంద్ర హౌం మంత్రిత్వశాఖ మళ్లీ ముందుకు తెచ్చింది. జనన మరణాలు, వలసల కారణంగా మార్పులను చేర్చడానికి మళ్లీ తాజా పర్చాలని 2021-22 వార్షిక నివేదికలో పేర్కొంది.
2015లో ఎన్‌పీఆర్‌ వివరాలను సవరించి నప్పటికీ అది చాలదని, మరిన్ని కొత్త విషయాలను చేర్చాలని పేర్కొంది. సిఎఎ నిబంధనలు ఇప్పటివరకూ తయారు చేయలేదని కేంద్రమే సుప్రీంకోర్టుకు తెలిపింది. ''పాలల్లో విషపు చుక్క... ప్రజాస్వామ్యంలో మత రాజకీయపు ముక్క...'' అన్నట్లు దేశవ్యాప్తంగా ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి భయాందోళనల మంటలు రేకెత్తించి, ఆ మారణహౌమాన్ని ఓట్ల రూపంలో మరోసారి మలచుకోవాలని పాలక బీజేపీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి చేసినప్పుడు పౌరుల రిజిస్టర్‌ నుంచి మినహాయించబడిన ముస్లిమేతరులు ప్రయో జనం పొందుతారని, మినహాయించబడిన ముస్లింలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందనే భయాలున్నాయి.
2019 డిసెంబర్‌ నుంచి 2020 మార్చి మధ్య దేశవ్యాప్తంగా సిఎఎపై వెల్లువెత్తిన నిరసనలు, అల్లర్లలో 83మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రంప్‌ భారత పర్యటన సమయంలోనే 2020 ఫిబ్రవరిలో ఢిల్లీ అల్లర్లలో మతోన్మాదుల దుశ్చర్యలు, విద్వేష పూరిత వీరంగాలు యావద్భారత దేశాన్ని కలవరపాటుకు గురిచేశాయి. 2021 ఏప్రిల్‌ - డిసెంబర్‌ మధ్య పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి ముస్లిమేతర మతాలకు చెందిన 1,414 మందికి పౌరసత్వ ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారని కేంద్ర నివేదిక పేర్కొంది. 2,439 మందికి లాంగ్‌ టర్మ్‌ వీసాలు కూడా మంజూరు చేశారు. మరోవైపు సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను వ్యతిరేకించిన వారిని ఉగ్రవాదులుగా, అర్బన్‌ నక్సలైట్లుగా ముద్రవేసి జైళ్లలో మగ్గేలా చేస్తున్నారు. ఇందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం యుఎపిఎను సాధనంగా చేసుకుంటున్నారు.
2015 నుంచి 2020 వరకూ ఈ చట్టం కింద అరెస్టు చేసిన వారిలో మూడు శాతం కంటే తక్కువమందిపైనే నేరారోపణలు రుజువయ్యాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో డేటా విశ్లేషించింది. మూడింట రెండొంతుల కేసులలో నిందితులకు ఎటువంటి ఉగ్రవాద చర్యతో సంబంధంలేదు. ఈ కఠిన చట్టం కింద 5,924 కేసులు నమోదు చేసి, 8,371 మందిని ఐదేళ్లలో అరెస్టు చేశారు. వారిలో 235 మందికే శిక్షలు పడ్డాయి. ఈ గణాంకాలను బట్టి ఈ కేసులలో డొల్లతనాన్ని, ప్రత్యర్థులను, తన చర్యలను వ్యతిరేకించే వారిని ఎంత దారుణంగా వేధిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వందమంది దోషులు తప్పించుకున్నా... ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న భారత న్యాయవ్యవస్థ స్ఫూర్తికి ఇది భిన్నంగా ఉంది. ఎన్‌ఆర్‌సి, సిఎఎను తిరిగి తీసుకొచ్చేందుకు మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ప్రజల మధ్య విద్వేష విషాన్ని చిమ్మడానికే! ఇటువంటి వాటిని దేశ ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలి. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విధానం అని చాటిచెప్పాలి. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అంటూ విద్వేష కుట్రల్ని వమ్ముచేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

10:52 AM

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌..

10:25 AM

మరికొద్దిసేపట్లో తెలంగాణ బడ్జెట్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.