Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమెరికాలో మెజారిటీ దిశగా ప్రతిపక్షం! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 11,2022

అమెరికాలో మెజారిటీ దిశగా ప్రతిపక్షం!

మంగళవారంనాడు జరిగిన అమెరికా పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం నాటికి కూడా పూర్తి కాలేదు. ఆధిక్యతల తీరు తెన్నులు మాత్రమే మన ముందున్నాయి. వివిధ మీడియా సంస్థలు భిన్నమైన అంకెలను చూపుతున్నాయి. బిబిసి సమాచారం ప్రకారం 435స్థానాలున్న ప్రజా ప్రతినిధుల సభ (అమెరికన్‌ కాంగ్రెస్‌)లో ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ 210, అధికార డెమోక్రటిక్‌ పార్టీ 192 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎగువసభ సెనెట్‌లోని వంద స్థానాలకు గాను 35సీట్లకు, 50రాష్ట్రాల గవర్నర్‌ పదవులకూ ఎన్నికలు జరిగాయి. సెనెట్‌లో తాజా పరిస్థితి ప్రకారం ఒక స్థానానికి రెండదఫా ఎన్నిక జరగాల్సి ఉంది. డెమోక్రటిక్‌ పార్టీకి 46, రిపబ్లికన్‌ పార్టీకి 48, ఇతర పార్టీలకు రెండు స్థానాలు ఉన్నాయి. అంతిమంగా రెండు పార్టీ లకు సమాన బలం ఉంటుందని, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఓటుతో అధికారపక్షానికి 51తో మెజారిటీ ఉంటుందని, మెజారిటీ గవర్నర్‌ స్థానాలు, ప్రజాప్రతినిధుల సభలో స్వల్ప మెజారిటీ రిపబ్లికన్లకు వస్తుందని అంచనా.
ఓట్ల లెక్కింపు సరళిని చూసిన అధ్యక్షుడు జో బైడెన్‌ బుధవారంనాడు చేసిన వ్యాఖ్యల ద్వారా ఓటమిని పరోక్షంగా అంగీకరించటమేగాక రిపబ్లికన్లతో సఖ్యతకు సిద్దమే అనే సంకేతాలిచ్చాడు. అంచనాలకు మించి డెమోక్రటిక్‌ పార్టీ మెరుగ్గా ఉన్నందుకు ప్రజాస్వామ్యానికి శుభదినం, రిపబ్లికన్‌ అనుకూల గాలి వీస్తుందన్న మీడియా, ఎన్నికల పండితులు చెప్పిందేమీ జరగలేదు అని జో బైడెన్‌ చెప్పాడు. తిరుగులేదు అనుకున్న చోట్ల రిపబ్లికన్లు ఓడారు. ఎన్నికలకు ముందు దిగజారిన జో బైడెన్‌ పలుకుబడి కారణంగా డెమోక్రటిక్‌ పార్టీకి తగలనున్న ఎదురు దెబ్బల గురించి అందరూ విశ్లేషణలు చేశారు. నష్ట నివారణకు బైడెన్‌ ఎన్ని తిప్పలు పడినా ఫలం దక్కలేదని తీరుతెన్నులు వెల్లడించాయి. రద్దయిన దిగువ సభలో డెమోక్రటిక్‌ పార్టీకి 220, రిపబికన్‌ పార్టీకి 212, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కొత్త సభలో బలాబలాలు అటూ ఇటూ కావచ్చు. అమెరికా పార్లమెంటు ఎన్నికల చరిత్రను చూసినప్పుడు ఒక పార్టీ అధ్యక్ష స్థానాన్ని గెలుచుకొని అధికారానికి వస్తే రెండేండ్లకు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షం మెజారిటీ సాధించటం ఒక ధోరణిగా ఉంది. దాని కొనసాగింపుగానే ఈ సారీ అదే జరగనుంది. అందుకే ఎన్నికల ముందు గాండ్రింపులు, హూంకరింపులు, ఘీంకరిపులు, వీరశూర ప్రతిజ్ఞలు చేసినా, ప్రగల్భాలు పలికినా ఈసారి కూడా లెక్కింపు పూర్తిగాక ముందే జో బైడెన్‌ అవన్నీ మరిచిపోదాం అన్నట్లుగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అంతిమంగా ఎవరికెన్ని సీట్లు వచ్చినప్పటికీ రిపబ్లికన్లతో కలసిపనిచేసేందుకు సిద్దపడ్డానని, రిపబ్లికన్లు తనతో కలసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఓటర్లు స్పష్టం చేశారని కూడా చెప్పాడు. పార్లమెంటు మీద దాడిచేయించిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఉగ్రవాదాన్ని సమర్థించిన అనేక మంది రిపబ్లికన్లు ఈ ఎన్నికల్లో ఓడిపోవటం ఒక్కటే బైడెన్‌కు ఊరటనిచ్చినట్లు కనిపిస్తోంది. సెప్టెంబరు నెలలో ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీని డోనాల్డ్‌ ట్రంప్‌, అతని మద్దతుదార్లు, అమెరికాకు అగ్రస్థానం అనే శక్తులు నడుపుతున్నందున దేశానికి ఇది ముప్పని వర్ణించిన బైడెన్‌ ఇప్పుడు అదే పార్టీతో కలసి పని చేస్తానని, మద్దతు కావాలని కోరటం రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు.
డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీగా ఉన్న డెమాక్రాట్లు ప్రభుత్వానికి పెద్దగా అడ్డుపడింది లేదు. చైనా మీద వాణిజ్య పోరుతో సహా అన్నింటికీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిపబ్లికన్లు కూడా అంతకు మించి అడ్డుకొనేదేమీ ఉండదు. గత ఎన్నికల ఫలితాన్ని అంగీకరించని ట్రంప్‌ 2024లో తిరిగి తాను పోటీ చేస్తానని చెబుతున్నందున బైడెన్‌కు ఆటంకాలు ఎక్కువ కావచ్చు. తమ మద్దతు లేనిదే ఏదీ నడవదు అని నిరూపించుకొనేందుకు కొన్ని బడ్జెట్‌ ప్రతిపాదనలను గతంలో డెమాక్రాట్లు అడ్డుకున్నట్లే ఈసారీ రిపబిక్లను అదే చేస్తారు. చైనా అనుమతిలేని తైవాన్‌ పర్యటనకు రెండు పార్టీల నేతలు చెట్ట పట్టాలు వేసుకొని వెళ్లిన సంగతి తెలిసిందే.
పార్లమెంటులో ఎవరికి మెజారిటీ వచ్చినా ఈ ఎన్నికల ఫలితాలతో తన విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని బైడెన్‌ స్పష్టం చేసినందున యుద్ధం, కార్మికులకు హాని కలిగించే పొదుపు చర్యలు, జనం మీద భారాలు మోపే విధానాలను కొనసాగిస్తానని చెప్పటమే. అమెరికాలో అధికార ప్రతిపక్షాలు పెద్ద రాక్షసులు - చిన్న రాక్షసులు అన్న తేడా తప్ప జనాన్ని పీక్కుతినటంలో రెండూ ఒకటే. రాజకీయ వాస్తవాలను మరింతగా అర్థం చేసుకొని గతంలో మాదిరే ఇప్పుడూ తమ ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను కాపాడుకొనేందుకు పోరుబాట తప్ప అక్కడి కార్మికవర్గానికి మరో దగ్గరదారి లేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

10:52 AM

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌..

10:25 AM

మరికొద్దిసేపట్లో తెలంగాణ బడ్జెట్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.