Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆయుధం అనివార్యమే! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 13,2022

ఆయుధం అనివార్యమే!

'న్యాయం గాయమై, సంవత్సరాల తరబడి సలుపుతున్న బాధే కోర్టు'... ఈ అలిశెట్టి ప్రభాకర్‌ కవితావాక్యం నిత్యం రుజువవుతున్న సత్యం. న్యాయమే అన్యాయంగా గాయాలు చేస్తే ఆయుధం అనివార్యమేనని తెలవటానికి ఎంతో సమయం పట్టదు కదా! అందుకే చట్టపరిధిలోనే ఉన్నత హౌదాలో పనిచేస్తున్న అధికారిణికి కూడా ఆయుధావసరం గుర్తుకొచ్చిందంటే, పరిస్థితులు ఎంత దిగజారిపోతున్నాయో అర్థమవుతుంది. ''దేశంలో న్యాయపరంగా ఇలాంటి నిరాశలే కొనసాగితే ఆయుధాలు కలిగివుండే హక్కును మహిళలకు కల్పించడానికి ఇది సరైన సమయం కావచ్చు. న్యాయం, చట్టం రెండూ వేర్వేరు అంశాలు కాకూడదు'' అని ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి తన అభిప్రాయం తెలియజేసే సందర్భం, న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న అన్యాయాల తీవ్రతను ప్రస్పుటం చేస్తుంది. దేశంలో మహిళలకు న్యాయం తిరస్కరించబడటం, దోషులు బలాదూర్‌గా విడుదల కావటం ఆ మహిళా అధికారిణి గుండెను చలింపచేసి ఆయుధ ఆలోచనకు పురికొల్పింది. చట్టం, న్యాయం, ధర్మం అన్నీ విఫలమయ్యేచోట, అన్యాయాన్ని ఎదిరించటానికి ఆయుధం వినామరోదారేముంటుంది. ఆమె ఏ హౌదాలో ఉన్నా ఒక బాధిత హృదయపు స్పందనగానే భావించాలి. దేశంలో స్త్రీలు పడుతున్న వేదనకు ఇదో ఉదాహరణ.
ఇప్పుడే కాదు, ఇంతక్రితం బిల్కిస్‌ బానో కేసులో నేరం రుజువయి శిక్షననుభవిస్తున్న దోషులను క్షమాభిక్షపేరుతో విడుదల చేసిన సందర్భంలోనూ ఆమె స్పందించారు. నేరస్తులు ఆనందోత్సవాలు జరుపుకోవటం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. దోషులూ అభినందనలు అందుకొంటున్న కాలంలో ఉన్నాం మనం. ఈ దారుణాలను చూస్తున్న అనేక గొంతులూ ఇంకా మూగబోయేవున్నాయి. ఇలాంటి వాతావరణంలోనూ గొంతువిప్పిన ఆమె ధీరత్వానికి అభినందనలు చెప్పాల్సిందే.
'ఇదొక గుడ్డి న్యాయవ్యవస్థ' అని బాధితురాలి తల్లిదండ్రులు వ్యాఖ్యానించడం ఎంతవాస్తవమైనది! చట్టమూ, న్యాయమూ అందరినీ సమానంగా చూస్తాయని అనుకోవడం ఎంత పిచ్చితనం! డేరాబాబాకూ సాయిబాబుకు వేరువేరు న్యాయాలే జరగటం మనం చూడటం లేదూ! ప్రభుత్వ అనుకూలురు నేరస్తులయినా నిర్దోషులుగా విడుదలవుతారు. అదే ప్రభుత్వ వ్యతిరేకులయితే నిర్దోషులూ నిర్బంధంలో మగ్గుతుంటారు. ఇదీ నేటి మన న్యాయవ్యవస్థ ప్రవర్తనాతీరు.
అది 2012. ఢిల్లీకి చెందిన 19ఏండ్ల యువతిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి లైంగికదాడికి పాల్పడి, అత్యంతకిరాతకంగా హింసించి చంపారు. ఆ కేసును 2014లో ఢిల్లీ ట్రయల్‌కోర్టు విచారణ జరిపి దోషులు ముగ్గురికీ మరణశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఆ శిక్షను ధృవీకరించింది. 'వేట కోసం వెతికే జంతువుల్లా వీరు వీధుల్లో పడి తిరుగుతుంటారని' స్వయానా కోర్టు వ్యాఖ్యానించింది కూడా. కానీ ఆ ముగ్గురు నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ శిక్షను తగ్గించాలని మొరపెట్టుకున్నారు. ఎంతో ''దయామయమైన'' సుప్రీంకోర్టు విచారణ జరిపి, ఆ ముగ్గురూ నిర్దోషులని ప్రకటించి విడుదల చేసింది. ఈ సంఘటన ఇటీవలే జరిగింది. దీనికంటే ముందే బిల్కీస్‌ బానో కేసులో నేరస్తులనూ క్షమాభిక్షపెట్టి విడుదల చేశారు. ఈ ఘటనలే ఐఏఎస్‌ ఆఫీసర్‌ని కలవరపెట్టాయి. హత్రాస్‌లో అత్యాచారం, హత్య సంఘటనలోనూ ఇంతవరకు న్యాయం జరగలేదు. దేశంలో నిర్భయకేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలను కాపాడేవారెవ్వరు? రక్షణ కల్పించేవారెవ్వరు? కాపాడలేకపోయినా, నేరస్తులకు సైతం శిక్షలు వేయించలేని వ్యవస్థపై విశ్వాసం ఎలావుంటుంది! పై కేసులో నేరము తామే చేశామన్న ఒప్పుకోలుతోనే, వాళ్లు శిక్షను తగ్గించమన్నారు. అంతేకాని నేరము చేయలేదని చెప్పలేదు. కానీ కోర్టు మాత్రం మొత్తం శిక్షనే రద్దుచేసింది. ఇలాంటి సంఘటనలు ఈ సమాజంలో సగంగావున్న స్త్రీలను తీవ్ర భయానికి, అభద్రతకు గురిచేస్తున్నాయి.
స్త్రీల పట్ల చులకన భావన, వివక్షత గూడుకట్టుకున్న సమాజపు ఆలోచనల ప్రతిఫలనమే ఈ అన్యాయాలు. ఛాందస భావాలు, సంప్రదాయాల పేరుతో కొనసాగే అసమానతలు సమంజసమేననే తిరోగమన వాదుల ఆధిపత్యం పెరుగుతున్న క్రమంలోనే స్త్రీలకు జరిగే అన్యాయాలు పెరిగిపోతున్నాయి. ఈ అన్యాయాలకు కార్చే దుఃఖాశ్రువులే రేపు తిరుగుబాటు కెరటాలై ఉప్పొంగుతాయి. బాధలు, కన్నీళ్లు ఎప్పుడూ బలహీనతలు కావు. అవి రేపటి యుద్ధానికి సంకేతాలు. అందుకే అధికారిణి చెప్పింది అక్షరాల నిజం. ఆడపిల్లలకు ఇది ఆయుధం అనివార్యమయ్యే సందర్భమే.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

08:04 AM

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.