Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అన్నమో రామచంద్రా | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 16,2022

అన్నమో రామచంద్రా

మనిషి ఆకలితో ఆలమటించే పరిస్థితి రూపుమాపాలనే లక్ష్యాన్ని అందుకోవడం కష్టాసాధ్యమేనని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చిచెప్పింది. 2030 నాటికి ఆకలి సమస్యను అధిగమించడానికి ఐరాస నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడానికి మరో ఎనిమిదేండ్లే ఉంది. కానీ, వాస్తవంలో అందుకు విరుద్ధంగా ప్రపంచమంతా ఆకలితో 'అన్నమో రామచంద్రా' అంటూ అల్లాడుతోంది. అత్యంత ఆధునిక సమాజమని చెప్పుకుంటున్న ఈ కాలం కూడా అన్నార్తుల ఆక్రందనలను జయించలేకపోతోంది. నేటి ప్రజాస్వామ్య యుగంలో ఏ ఒక్క పేగూ ఆకలితో కాలిపోకుండా కాపాడుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కానీ ''ఘనమైన'' ప్రభుత్వాలు అది విస్మరించిన ఫలితమే, నేడు సగానికిపైగా ప్రపంచం ఆర్థాకలితో అలమటిస్తోంది. ఆహార సంక్షోభంపై తాజాగా వెలువడిన ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నివేదిక ఈ అవనిపై ఆకలికేకలకు అద్దం పడుతోంది.
మితిమీరిన సంపద కేంద్రీకరణ, ఆయా దేశాల్లో నెలకొన్న ఘర్షణలు, ప్రకృతి ఉత్పాతాలే ఇందుకు ప్రధాన కారణాలు కాగా, ఆకలి మంటకు కోవిడ్‌ ఆజ్యం తోడవడంతో కష్టాలు మరింత తీవ్రం అయ్యాయి. పులిమీద పుట్రలా రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయి. ఫలితంగా ఈ క్షుద్బాధలు ఇంకా ఉధృతమవనున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేస్తోంది. 138 దేశాల్లో కనీసం 52 దేశాల జనాభాలో సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేదని స్పష్టం చేసింది. ప్రపంచ జనాభాలో అత్యధికులు పేదరికం, అర్థాకలితో అలమటిస్తున్నారు. 53 దేశాల్లో 19.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ఈ అన్నార్తుల సంఖ్య అదనంగా మరో నాలుగు కోట్లు పెరిగింది.
ఈ ఆకలి మహమ్మారి మన దేశంలోనూ కోరలు చాస్తుండటం విస్మరించలేని నిజం. ప్రపంచానికే ఆహారం అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ఇటీవల ప్రధాని ప్రకటించారు. ప్రకటనయితే ఆహ్వానించదగ్గదే కానీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రపంచ ఆకలి సూచీలో మన స్థానం 116లో 101వదని ఆయన మరిచిపోవడమే విచారకరం. ప్రపంచంలో తీవ్రమైన 31 ఆకలి రాజ్యాలలో భారత్‌ కూడా ఉండటం కడు విషాదం. భగ్గున మండుతున్న నిత్యావసరాలు ధరల సెగలకు అసంఖ్యాకులైన సామాన్యులు విలవిలాడుతున్నారు. ఇలా పట్టెడన్నం కోసం పరితపించే అభాగ్యుల సంఖ్య ప్రపంచమంతా పెరిగిపోతుండటం నేటి మహావిషాదం. ఇందుకు ఎవరిని నిందించాలి?
ఒక మనిషి రోజువారీ శక్తి అవసరాలను తీర్చగలిగేదే ఆరోగ్యకరమైన ఆహారమని ఎఫ్‌ఏఓ నిర్వచిస్తోంది. అలాంటి ఆహారం తినే అవకాశాలు కానీ, వనరులు కానీ ఎంతమందికున్నాయి? నేటికీ పిడికెడు మెతుకులకు నోచని బతుకులు కోకొల్లలు..! నిజానికి ప్రపంచంలో ఇప్పటికే ఉత్పత్తి అయి చలామణిలో ఉన్న సంపద కొన్ని వేల ట్రిలియన్‌ డాలర్లు ఉంటుంది. అది ప్రపంచ జనాభా అంతా కాలుమీదకాలేసుకుని తిన్నా కొన్ని వందల ఏండ్లకు సరిపోతుంది. ఈ సంపద రోజు రోజుకూ పెరిగినంత వేగంగా జనాభా పెరగటం అసాధ్యం. అసలు ఉన్న సంపదను వాడుకోకుండానే అది ఏటా ఉత్పత్తి చేసే సంపదే ప్రపంచ జనాభాకు కడుపునిండా అన్నం పెడుతుంది. మరి ఇంత సంపద ఉంది కదా..! ఇంకా ఆకలి ఎందుకుంది..? ఇప్పుడు ప్రపంచం ఆకలిని తీర్చగలిగేది ఈ ప్రశ్నకు సమాధానం మాత్రమే.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆకలి పరిస్థితిని మెరుగు పరుస్తుందన్న ప్రజల ఆశలు ఎప్పుడో అడియాశలు అయ్యాయి. ప్రపంచంతో పోటీపడే సామర్థ్యాలు పెంచామని ఊదర కొట్టే కేంద్ర పెద్దలు ఆకలిని అదుపు చేయటంలో విఫలమైనందుకు మాత్రం సిగ్గుపడటం లేదు. ప్రపంచ ఆకలి సూచికపై దృష్టి పెడితే భారత్‌ చాలా వేగంగా అభివద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అనే మాటకు వన్నె తగ్గిపోతుంది. అసమాన పంపిణీ, ఆహారం వధా వల్ల కూడా ఆకలి సమస్య పెరుగుతున్నది. నిజానికి ప్రపంచంలో ప్రతీ ఒకరికి తగినంత ఆహారం అందచేసేంత ఆహారం ఉన్నది. ప్రపంచ ఆహార సరుకులు సమానంగా పంపిణీ జరిగితే అందరికీ కావల్పినంత ఆహారం ఉంటుంది. సంపన్నులు వధా చేస్తున్న ఆహారం చాలామంది పేదలకు ఆకలి తీర్చగలదు. నిజానికి ఆహారం వృధా చేయటాన్ని అడ్డుకొని ఆహార భద్రతగా మార్చచ్చు. కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు
మోడీ ''ప్రతిభ''

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.