Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజ్‌భవన్‌ రాజకీయాలు... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 17,2022

రాజ్‌భవన్‌ రాజకీయాలు...

ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాలనా విధులను నిర్వర్తించకుండా గవర్నర్ల ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నించడం కేంద్ర ప్రభుత్వానికి తగదు. ఇతర పార్టీల తరఫున ఎన్నికైన ఎంఎల్‌ఎలను బీజేపీకి అనుకూలంగా ఫిరాయింపజేసి, గవర్నర్ల ద్వారా కమలం పార్టీ ప్రభుత్వాలనేర్పాటు చేయించిన సందర్భాలను కూడా అనేకం చూస్తూనేవున్నాం. ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్డంకులు కల్పించి ఒకవైపు పాలన సాగనీయకుండా చేయడం, మరోవైపున రాజ్యాంగపరమైన ప్రతిష్టంభన ఏర్పడబోతోందన్న గందరగోళాన్ని సృష్టించడం తాజా చర్చనీయాంశంగా ఉంది. ప్రత్యేకించి దక్షిణాదిన కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు ఆయా ప్రభుత్వాలకు తలనొప్పులు తెప్పిస్తున్నారు. ప్రస్తుతం విద్యారంగానికి సంబంధించిన సమస్యల చుట్టూరా ఈ వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ గవర్నర్ల దుశ్చర్యలను ఆయా ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామికంగా ఎదుర్కొంటుండటం స్వాగతించదగినది.
విద్య విషయంలో కేరళ రాష్ట్రం దేశానికే ఆదర్శం. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్‌ ఆ రాష్ట్ర ఉన్నత విద్యారంగంలో గందరగోళం సృష్టించడానికి, సంఫ్‌ుపరివార్‌ అనుయాయులను వైస్‌ఛాన్సలర్లుగా నియమించడానికీ విఫలయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ స్థానంలో ఉన్నత అర్హతలున్న విద్యారంగ నిపుణులను ఛాన్సలర్లుగా నియమించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్‌ ఆమోదానికి పంపారు. రాజ్యాంగ బద్ధమైన బాధ్యతలు నిర్వహించే గవర్నర్‌ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్లుగా ఉండటం సబబుకాదని జస్టిస్‌ పూంచ్‌ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఛాన్సలర్ల బాధ్యతలను గవర్నర్ల నుండి తప్పించాలని కూడా అభిప్రాయపడింది. విద్యారంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం పూంచ్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం ఛాన్సలర్లగా విద్యారంగ నిపుణులను నియమించాలని నిర్ణయించడం సబబే. గవర్నర్‌ తన రాజ్యాంగ బాధ్యతలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌పై సంతకం చేస్తారని పలువురు ఆశిస్తారు. కానీ రాష్ట్ర మంత్రులపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర పదజాలంతో అవాకులు చవాకులు మాట్లాడిన వ్యక్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారా అన్నది ఇంకొందరి సందేహం. మరోవైపున విచారణ పూర్తయ్యే వరకూ వైస్‌ ఛాన్సలర్లకు జారీ చేసిన షోకాజ్‌ నోటీసుపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దంటూ గవర్నర్‌ను కేరళ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఆయన ఇప్పుడైనా రాజ్యాంగం ప్రకారం, హైకోర్టు ఆదేశాలకు తగినట్టుగా నడుచుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకబోర్డు విషయంలో తనకు సందేహాలున్నాయంటూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సరికొత్త వివాదం రేపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనలకు లోబడే ఆ బిల్లును రూపొందించినట్టు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. యూజీసీతోపాటు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఎఐసిటిఇ) వంటి సంస్థల మార్గదర్శకాలను పాటిస్తామని ఆ బిల్లులో పొందుపర్చారు. నిజానికి బీహార్‌, జార్ఖండ్‌లలో విశ్వవిద్యాలయాల నియామకాలకు బోర్డు ఎప్పటి నుంచో పనిచేస్తోంది. ఒడిశాలో వర్సిటీ సిబ్బందిని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు నియామక ప్రక్రియలున్నాయి. అయినా తమిళిసై బిల్లును అడ్డుకున్నారంటే ఏదో కిరికిరి పెట్టాలనే కదా!
ఇక తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 20 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్‌ రవి ఆమోదం తెలపకుండా అడ్డుకున్నారు. నీట్‌తో సంబంధం లేకుండా ఎంబిబిఎస్‌ ప్రవేశాలు కల్పించాలన్నది వాటిలో ఒకటి. ప్రజలెన్నుకున్న శాసనసభ ఆమోదించిన బిల్లులకు మోకాలొడ్డి, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పని చేయకుండా నిరోధిస్తున్న ఆయనను గవర్నర్‌గా తొలగించాలంటూ తమిళనాడు చట్టసభల సభ్యులు రాష్ట్రపతికి విన్నవించారు. ఇలా రాజ్‌భవన్‌ ద్వారా రాజకీయాలు నడిపే విధానాలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విడనాడాలి. వారందుకు సిద్ధపడకపోతే భారత రాజ్యాంగ ఫెడరల్‌ స్ఫూర్తిని కాపాడుకునేందుకు ప్రజలు, ప్రజాతంత్రవాదులూ ఒత్తిడి పెంచాలి, ఉద్యమించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.