Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విబేధాల ప్రతిబింబం జి20 ప్రకటన | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 18,2022

విబేధాల ప్రతిబింబం జి20 ప్రకటన

కొంచెం కారం, కొంచెం తీపి, కొంచెం చేదు అన్నట్లుగా నవంబరు 15-16 తేదీల్లో ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జి20 శిఖరాగ్ర సమావేశ ప్రకటన ఉంది. వర్తమాన ప్రపంచ విబేధాలను ప్రతిబింబించే ఈ పదిహేడు పేజీల పత్రం తమ ఎత్తుగడలు, వ్యూహం, రాజకీయాలకు అనుగుణ్యంగా ఎవరికి వారు భాష్యం చెప్పుకొనేందుకు వీలుగా ఉందని చెప్పవచ్చు. పందొమ్మిది దేశాలూ, ఐరోపా సమాఖ్యలతో ఉన్న ఈ బృందం అంతర ప్రభుత్వాల వేదిక. ప్రపంచ ఆర్థిక రంగానికి సంబంధించి ద్రవ్య స్థిరత్వం, వాతావరణ మార్పులను పరిమితంగావించటం, నిరంతర అభివృద్ధి, సంబంధింత అంశాల మీద పని చేస్తున్నది. ప్రపంచ భద్రతా సమస్యల చర్చకు వేదిక కానప్పటికీ కొన్ని దేశాల వత్తిడి, రాజకీయాల మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్‌ సంక్షోభం మీద కూడా బాలి శిఖరాగ్ర ప్రకటనలో ప్రస్తావించారు. ప్రధాన నేతలలో వ్లదిమిర్‌ పుతిన్‌ ఈ సభకు రాలేదు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా - ఐరోపా సమాఖ్య ఒక వైపు, రష్యాను సమర్ధించే దేశాలు మరోవైపు, తటస్థ చైనా, భారత్‌లు ఈ కూటమిలో భాగస్వాములు. వీటి మధ్య తీవ్ర విబేధాల పూర్వరంగంలో అసలు ఒక ప్రకటన చేస్తారా అన్న సందేహాలు తొలుత వెలువడినప్పటికీ రష్యా నిరసన మధ్య ఎట్టకేలకు వెలువడింది.
సందిగ్ధానికి తావులేకుండా ఉండాలని కొన్ని దేశాలు డిమాండ్‌ చేసిన కారణంగా ఎక్కువ మంది సభ్యులు ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఖండించినట్లు బాలి ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన వారు ఆ వైఖరికి దూరంగా ఉన్నట్లు ఈ పదజాలం స్పష్టం చేసింది. మరోవైపు సెప్టెంబరులో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్న ఇది యుద్ధాల యుగం కాదన్న మాటలను కూడా ప్రకటనలో చేర్చారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి విరాళంగా ఇచ్చిన ఎరువులు, నల్లసముద్రంలో ఆహార ధాన్యాల నడవా ఏర్పాటు గురించి కూడా పేర్కొని రష్యాను సంతృప్తిపరచేందుకు చూశారు. సంఘర్షణలు మానవాళికి కలిగించే ముప్పు, ఇబ్బందుల వంటి అంశాలను పేర్కొని సమావేశం ఆందోళన వెల్లడిం చింది. ప్రపంచ గోధుమ, ఎరువుల మార్కెట్లను స్థిరీకరించేందుకు తమకు తగినంత సామర్థ్యం ఉందని తమ మీద అక్రమంగా ఆంక్షలను విధించి ఆటంకాలను కలిగించినప్పటికీ ఇప్పటికే 105 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేశామని, వాటిలో 60శాతం ఆసియా, 40శాతం ఆఫ్రికా ఖండానికి పంపినట్లు ఈ సమావేశాల్లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ చెబుతూ పశ్చిమ దేశాల ప్రచారాన్ని ఖండించాడు.
ఈ సమావేశాలలో పాల్గొన్న నేతలు ఎడముఖం - పెడముఖంగా ఉండటం కూడా ప్రపంచం గమనించింది. చైనా తమ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారిందన్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఈ సమావేశాల్లో మాట్లాడుతూ ముప్పు బదులు సవాళ్లను విసురుతున్నదని సవరించు కోవాల్సి వచ్చింది. చైనా అధినేత షీ జింపింగ్‌-రిషి ఈ సమావేశాల సందర్భంగా విడిగా భేటీ అవుతారని భావించినప్పటికీ చివరిక్షణంలో వీలుగాక రద్దయినట్లు చెప్పారు. ప్రధాని పదవికి పోటీ పడినపుడు, ఇతర సందర్భాలలో చైనా వ్యతిరేక వైఖరి ప్రదర్శించిన రిషి ఏ ముఖం పెట్టుకొని జింపింగ్‌తో ఏమి చర్చించారని స్వదేశంలో విమర్శలు తలెత్తవచ్చనే కారణంగా రద్దు చేసుకొని ఉండవచ్చు. లడక్‌ సరిహద్దులో జరిగిన సంఘటనల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ సమావేశాల్లో కొందరు నేతలతో భేటీ జరిపినా షీ జింపింగ్‌తో విందు సందర్భంగా కరచాలనానికే పరిమితమయ్యారని, అది కూడా వచ్చే ఏడాది జి20 సారధిగా భారత్‌ ఉండటం, షాంఘై సహకార సంస్థ 2023 శిఖ రాగ్రసభ భారత్‌లో జరగనున్న పూర్వరంగంలో సంప్రదింపులకు అవసరం రీత్యా ఆమేరకైనా స్పందించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
1999లోనే జి20 బృందం ఏర్పడినా 2008 నుంచి మాత్రమే శిఖరాగ్ర సమావేశాలు జరుపుతున్నారు. బాలీలో 17వది జరగ్గా 18వ సమావేశం మన దేశంలో జరగనుంది. ఎక్కడ సమావేశం జరిగితే ఆ దేశం ఏడాది పాటు సారధిగా ఉంటుంది. జి20ని ఐదు బృందాలుగా చేశారు. రెండవ గ్రూపులోని రష్యా, టర్కీల్లో ఇప్పటికే సమావేశాలు జరగ్గా మన దేశంలో 2023లో, దక్షిణాఫ్రికాలో 2025లో జరపాలని గతంలోనే ఖరారైంది. వచ్చే ఏడాది జరిగే సమావేశాలను మరుసటి ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా నరేంద్రమోడీ ముందుకు తెస్తారని కాంగ్రెస్‌ పేర్కొన్నది. అలాంటి పనులను గతంలో ఆ పార్టీ కూడా చేసింది. ప్రతిదాన్ని తమ ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకుంటున్న తీరుతెన్నులను చూసిన తరువాత నరేంద్రమోడీ 2023ను ఎంచుకోవటంలో ఆ కోణం లేదని చెప్పలేము. సమావేశ లోగోలో బీజేపీ కమలం గుర్తును పెట్టటం కూడా దీనికి బలం చేకూర్చుతున్నది. నిజానికి వరుస క్రమంలో ఏ దేశం అంతర్జాతీయ వేదికలకు సారధ్యం వహించినప్పటికీ సదరు దేశానికి ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు
మోడీ ''ప్రతిభ''

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.