Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇగిరిపోతున్న మనిషితనం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 19,2022

ఇగిరిపోతున్న మనిషితనం

వలచి వచ్చిన యువతిని ముప్పై అయిదు ముక్కలు చేసి, పద్దెనిమిది రోజుల పాటు రోజుకో ముక్క రోజుకో ప్రాంతంలో విసిరేసాడో కిరాతకుడు. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను కడతేర్చిందో కసాయి భార్య. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని కక్షతో చెరిచి చంపి కాలువొడ్డున పూడ్చిపెట్టాడు మరో ప్రబుద్ధుడు. ప్రియుడి ఇంట్లో మొగుణ్ణి సమాధిచేసి, ఏమీ ఎరుగనట్టు కేసుపెట్టి చేతులు దులుపుకుంది ఇంకో ఇల్లాలు... మంగళవారంనాడు పత్రికల నిండా పతాక శీర్షికల్లో చోటుచేసుకున్న ఈ ఘాతుకాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. నిన్నటి నిర్భయ నుండి నేటి శ్రద్ధావాకర్‌ దాకా నిత్యం ఏదో మూల ఇలాంటి దారుణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటన్నిటి మధ్య ''బేటీ బచావో బేటీ పడావో''లు కేవలం ఏలినవారి నినాదాలు గా మాత్రమే మిగిలి పోతుండగా, కనీస రక్షణ కరువైన మహిళ ఓ భౌతిక వాస్తవం..! సాక్షాత్తూ రాజధాని ఢిల్లీ నగరమే ఇలాంటి ఘోరాలకు ప్రధాన వేదిక కావడం గమనార్హం! మొత్తంగా పల్లె పట్నం అన్న తేడా లేకుండా గుండెల్ని ముక్కలు చేయని వార్తంటూ లేనిరోజులతో గడుపుతోందీ దేశం! ఎంతటి విషాదమిది?
అత్యంత వికారమైన అ అరాచకాలన్నీ ప్రేమ వ్యవహారాలుగా చెలామణీ అవుతుండటం వైచిత్రి..! నిజంగా ప్రేమ ఉన్న చోట క్రౌర్యానికి తావుంటుందా..? ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమ మానవాళి జీవాంశం. ప్రేమ మనిషిలో మమతానురాగాలతో పాటు, సంస్కారాన్నీ, సహనాన్నీ, పరస్పర గౌరవాన్నీ నింపుతుంది. సమాజంలో శాంతినీ, సచ్ఛీలతనూ నెలకొల్పుతుంది. అందువల్ల ప్రేమ ఉన్న చోట హింస ఉండదు. ఈ అత్యాచారాలూ అఘాయిత్యాలూ అంతకంటే ఉండవు. మరి ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ దారుణాల మాటామేటీ..? ఇవన్నీ కేవలం ప్రేమకూ ఆకర్షణకూ తేడా తెలియని ఓ వ్యామోహంలో చోటుచేసుకుంటున్న ఘోరమైన నేరాలు. ఇందులో మరో కోణమేమిటంటే, ఇవి ప్రేయసీ ప్రియులు, భార్యా భర్తల మధ్య మాత్రమే తలెత్తడంలేదు..! కన్న కూతురినే చెరిచిన తండ్రులనూ, సొంత చెల్లెలినే తార్చిన అన్నలనూ మనం చూస్తున్నాం..!! ఇలాంటి ఉదాంతాలు విన్నప్పుడు కడుపులో తిప్పుతుంది. వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది. మనం నివసిస్తున్నది నాగరిక సమాజంలోనేనా అని తలదించుకోవాల్సి వస్తున్నది. ఇందుకు ఎవరిని నిందించాలి?
నిజానికి మనుషుల్ని కలిపి ఉంచే బంధం ప్రేమ. మనిషిని పరిపూర్ణం చేయగలిగే ఆత్మీయ సాధనం ప్రేమ. జీవితాల్ని పండించే ఓ కమనీయమైన భావోద్వేగం ప్రేమ. అందుకే ''ఈ లోకంలో ఆహారం కంటే ప్రేమ కోసం ఆరాటపడేవారే ఎక్కువ'' అంటారు మదర్‌ థెరిసా. ఇది సత్యం. సత్యమే కాదు, సహజాతం కూడా. కానీ, మనుషుల్లోని ఈ సహజమైన ప్రేమ భావనల్ని ఛిద్రం చేసి, ప్రేమను కూడా ఓ సరుకుగా మారుస్తోంది నేటి మార్కెట్‌ కౌటిల్యం. ప్రేమలోని ఆత్మీయత, అనురాగాల స్థానంలో అవసరాలనూ, ఆకర్షణలను ముందుకు తెస్తోంది. ఫలితంగా బంధాలు బలహీనపడి వ్యామోహాలు బలపడుతున్నాయి. సినిమా, టీవీలను దాటి ముబైల్‌ఫోన్‌, సోషల్‌మీడియాలు, ఇంటర్నెట్‌లో రాజ్యమేలుతున్న కాలంలో మనం జీవిస్తున్నామిప్పుడు. ఈ సరికొత్త మార్కెట్‌ యుగంలో మనుషులు మనిషితనాన్ని కోల్పోవడం మొదలై చాలాకాలమే అయింది. ఇప్పుడు మనిషి మనిషిగా మనుగడ సాగించడమే ఓ సవాలు..! అటువంటప్పుడు ఇక మానవత్వానికీ, ప్రేమతత్వానికీ చోటెక్కడీ
అందుకే ప్రేమ కూడా ఇప్పుడు కేవలం ఓ సరుకు మాత్రమే. ప్రేమంటే క్యాండిలైట్‌ డిన్నర్‌లు, రొమాటింక్‌ ప్రమాణాలు, సినిమాలు, షికార్లు, క్లబ్‌లు, పబ్‌లు, భారీ బహుమతులు, పరిమితిలేని వ్యామోహాలు, విచ్ఛలవిడి ఆకర్షణలు, విలాసవంతమైన అవసరాలతో కూడిన ఖరీదైన వ్యవహారం మాత్రమే. ఈ అవసరాలు తీరనప్పుడు, ఆకర్షణలు తిరగబడినప్పుడు ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటాయి. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, విస్తరిస్తున్న ఇంటర్నెట్‌ సంస్కృతీ, ఏ నియంత్రణాలేని సామాజిక మాధ్యమాల పుణ్యమాని, ఒకప్పుడు పడకటింటికే పరిమితమైన విషయాలు ఇప్పుడు బాహ్య ప్రపంచానికి సైతం సర్వసాధారణంగా మారిపోయాయి. ఇది మరిన్ని విపరీతాలకు దారితీస్తోంది. ఇవన్నీ మహిళను మనిషిగా కాక, ఓ విలాస వస్తువుగా చూపిస్తోంటే, ఇంతటి ఆధునిక కాలంలో కూడా పితృస్వామ్య భావజాలం వేయిపడగల విషనాగై బుసకొడుతోంటే ఈ అఘాయిత్యాలను అరికట్టగలమా..? సమస్త మానవ సంబంధాలనూ, సామాజిక విలువలనూ కేవలం సరుకులుగా మారుస్తున్న ఈ మార్కెట్‌ బేహారుల వాణిజ్య వ్యూహాలను అడ్డుకోకుండా, ఈ అమానవీయతను నియంత్రించగలమా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇప్పుడీ సమస్యకు పరిష్కారాలు చూపగలవు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.