Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సింధూరం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 20,2022

సింధూరం

''చరిత్రలో ఎన్నో కథలు కాగితాల మీద కనపడవు.
ఎందుకంటే, అవి స్త్రీల శరీరాల మీద, మనసు మీద రాయబడతాయి'' అంటారు పంజాబ్‌ తొలి మహిళా రచయిత్రి అమృతా ప్రీతం. ఆడపిల్లగా పుట్టినందుకు వివిధ దశలన్నీ కలిపి 100మార్కులు వేసే పురుషాధిక్య సమాజం మనది. తరతరాలుగా స్త్రీల శరీరాలు, మనసులు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ తెరలు కట్టి, హద్దులు గీసి, వారి స్వేచ్ఛకు, హక్కులకు కట్టుబాట్లనే శృంఖలాలు వేసిందీ సమాజం. మరోవైపు స్త్రీలను మార్కెట్‌లో వస్తువును చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వాణిజ్య ప్రకటనల్లో మహిళ శరీరాన్ని కార్పొరేట్లు వస్తువుగా మార్చారు. అదే సమయంలో స్త్రీ వ్యక్తిత్వాన్ని, సృజనాత్మకతను గుర్తించే మానవీయతకు పురుషాధిక్యత అడ్డుపడుతూనే ఉంటుంది. ''స్త్రీ శక్తిని, సృజనాత్మకతను ఒప్పుకోక పోవడమంటే, పురుషుడు తన అంతరాత్మని మోసం చేసుకోవడం తప్ప ఇంకేమీ కాదు. భారతీయ పురుషుడు ఇప్పటికీ సాంప్రదాయక స్త్రీలను చూడ్డానికి మాత్రమే అలవాటు పడి ఉన్నాడు. గొప్ప వ్యక్తిత్వమున్న స్రీలను గౌరవించడం అనే సౌజన్యం ఈ పురుషులకు రాదు'' అంటారు అమృతా ప్రీతం.
''ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుంది'' అంటాడు గురజాడ. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న మహిళకు మనువాద భావజాలం, కట్టుబాట్ల సంకెళ్లు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నాయి. తను ధరించే దుస్తుల నుంచి నుదుటి బొట్టు వరకూ అన్నిటినీ కొన్ని శక్తులు శాసిస్తున్నాయి. విజ్ఞాన నిలయాలైన విశ్వవిద్యా లయాల్లో సైతం మహిళా టీచర్లు, విద్యార్థినులు జీన్స్‌ ధరించకూడదంటూ ఆంక్షలు. మరో కాలేజీలో హిజాబ్‌లు ధరించరాదంటూ హుకుంలు. అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్న వారికి సైతం వాళ్ల డ్రెస్‌ కోడ్‌పై కించపరిచే వ్యాఖ్యలు తప్పడంలేదు. ఇటీవలి కాలంలో కట్టుబాట్ల చట్రంలో బంధించే ప్రయత్నం మరింత పెరిగింది. చివరకు ఒక మహిళ గర్భం ధరించే హక్కు కూడా తన చేతిలో లేకుండా పోయింది. తనకు ఇష్టం లేకుండా తల్లి కమ్మని నిర్బంధించే హక్కు, అధికారం ఎవరికీ లేవు. అది ఆ మహిళ నిర్ణయించుకోవాల్సిన విషయం. పూర్తిగా ఆమె హక్కు. అంతేకాదు మహిళల నుదురు చూసి అవమానించడం పరిపాటిగా మారింది. చదువుకుని, ఆధునిక ప్రపంచంలో తిరుగుతూ, ఉద్యోగాల్లో రాణిస్తున్న మహిళలకు సైతం ఇలాంటి చేదు అనుభవాలు, పరాభవాలు తప్పడంలేదు. తాజాగా... మహారాష్ట్ర బీజేపీ నేత శంభాజీ భిడే ఓ జర్నలిస్టు నుదుట బొట్టు లేదని ఆమెతో మాట్లాడానికి నిరాకరించాడు. ''నన్ను ప్రశ్నించే ముందు బొట్టు ధరించాలని తెలియదా..? నీతో మాట్లాడను. భారత స్త్రీలు బొట్టు లేకుండా విధవ రూపంలో కనిపించకూడద''ంటూ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. మహిళలు ఏ స్థాయిలో ఉన్నవారైనా, వారి ఆహార్యం పట్ల కించపరిచే వ్యాఖ్యలు చేయడం సంఫ్‌ు పరివారానికి నిత్యకృత్యమైంది.
ఒకప్పుడు సతీసహగమనం అమలులో ఉండేది. ఆ తర్వాత భర్త చనిపోతే ఆ మహిళ పూలు, బొట్టు, తాళి వంటివి తీసేయాలి. తెల్లచీర కట్టి, తలవెంట్రుకలు తొలగించి మూలన కూర్చోబెట్టేవారు. కానీ, భర్తతో వచ్చింది తాళి ఒక్కటే. చిన్ననాటి నుంచి అలంకరించునే పూలు, గాజులు, బొట్టు కాదు. వాటిని పెట్టుకోవాలా లేదా అనేది పూర్తిగా ఆమె ఇష్టం. 'ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోడం కంటే ప్రాణం పోవడం పెద్ద విషయం కాదు' అంటారు ఆఫ్రికన్‌ రచయిత్రి టోనీ మారిసన్‌. తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే హక్కు మహిళకు ఉంది.
''ఒక స్త్రీగా నాకు ఒక దేశం లేదు...
ఒక స్త్రీగా నేను ఉండే స్థలమే దేశం... ప్రపంచం'' అని ఆత్మ గౌరవంతో తన ఉనికిని, అస్తిత్వాన్ని ప్రకటిస్తుంది ఆంగ్ల రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌. స్త్రీలు ఇలాగే ఉండాలని చెప్పే పురుషాధిక్య కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకొని తమ ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవాలి. తమ ఇష్టాలకు బిగించిన కంచెలను, కంచుకోటలను తుత్తునియలు చేయాలి. ఆ దిశగా మహిళ అడుగులేయాలి. సమాజంలోని అభ్యుదయ శక్తులు అటువంటి వారితో భుజం భుజం కలపాలి. స్త్రీ, పురుష సమానత్వం అన్నింటా వెలుగొందాలి. అప్పుడే సమాజం పురోగమిస్తుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

08:14 AM

వనస్థలిపురంలో కారు బీభత్సం..తప్పిన ప్రమాదం...

08:04 AM

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.