Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టెక్‌ కంపెనీల ఇష్టారాజ్యం | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 22,2022

టెక్‌ కంపెనీల ఇష్టారాజ్యం

సోషల్‌ మీడియా, ఇ-కామర్స్‌, ఇ-ఎడ్‌ తదితర ఇంటర్నెట్‌ ఆధారిత సంస్థల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు సాఫ్ట్‌వేర్‌ రంగంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. వేలాది కొలువులు ఊడుతున్నాయి. పని గంటలు పెరిగిపోతున్నాయి. అదనపు పని గంటలు పని చేస్తారా? ఇంటికి వెళ్లిపోతారా? అంటూ టెక్‌ కంపెనీల అధినేతలు ఉద్యోగులకు హుంకుం జారీ చేసే స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయి. అందాల ఐటి కలలు ఛిద్రమై బతుకులు కన్నీటి తెరలుగా మిగిలిపోతున్నాయి. ఐటి అనుబంధ రంగాలు, విమానయానం, ఆతిథ్య రంగం, స్థిరాస్తి తదితర రంగాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులను సాకుగా చేసుకొని టెక్‌ కంపెనీలన్నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పాలకులు చేష్టలుడిగి వాటికే సాగిలపడు తుండటం దారుణం.
కోవిడ్‌ మహా విపత్తు కంటే ముందు నుంచే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుస్త్తీ చేసిన సంగతి విదితమే. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చి ప్రజల కొనుగోలు శక్తి పెంచే ప్రణాళికలు రచించకుండా వేతనాలు తగ్గించడం, సిబ్బందిని కుదించుకోవడం వంటి 'పొదుపు చర్యల'కు పెట్టుబడిదారి వ్యవస్థ పరిమితం కావడంతో ఆర్థిక సంక్షోభం మరింతగా కోరలు చాచింది. కోవిడ్‌ తర్వాత పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది. విపత్తును ఎదుర్కొనే పేరిట ప్రభుత్వాలు ప్రకటించిన 'ఉద్దీపన' ప్యాకేజీల్లో కార్పొరేట్‌లకే అత్యధిక లబ్ధి చేకూరిన మాట వాస్తవం. కోట్లాది ప్రజల సంపదను అప్పనంగా కాజేసిన ఆ సంస్థలకు ప్రజల సంపద దోపిడీపై దాహం ఇప్పటికీ తీరడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో 'వర్క్‌ ఫ్రం హౌం' వంటి శ్రమ దోపిడీ ఎత్తుగడలు పన్నిన కంపెనీలు.. ఇప్పుడు పని గంటలు పెంచుతూ ఆ మేరకు సిబ్బందిని కుదించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ మొదలుపెట్టిన ఈ దురాగతాన్ని మెటా (ఫేస్‌బుక్‌, వాట్స్‌యాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూపు సంస్థ), గూగుల్‌, అమెజాన్‌, స్విగ్గీ, ఇతర సంస్థలు కొనసాగిస్తున్నాయి. ఆన్‌లైన్‌ స్టార్టప్‌గా పెను సంచలనం సృష్టించిన బైజూస్‌ సంస్థ ఇప్పుడు మసకబారుతోంది. వేలాది మంది ఉన్నత ఉద్యోగులను ఇంటికి పంపేసింది. బైజూస్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, నోయిడా కేంద్రాలుగా నడుస్తున్న ఓలా, బ్లింక్‌ఇట్‌, అన్‌అకాడమీ, వైట్‌హ్యాట్‌ జూనియర్‌ సైబర్‌ టెక్‌, ఎడ్యూటెక్‌, గిగ్‌ సంస్థలూ ఈ ఒక్క ఏడాదిలోనే 16,000 మందిని తొలగించాయి. అక్టోబరు నెలలోనే 5,000 మంది ఉద్యోగులను సాగనంపారు. తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ 60శాతం మంది ఉద్యోగులను బలవంతపు వేతన రహిత సెలవులకు పంపుతోంది. అంటే ఉద్యోగం పోదు కాని జీతం ఇవ్వరు.
అమెరికా, బ్రిటన్‌ వంటి పెట్టుబడిదారీ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభ సుడిగుండంలో చిక్కుకోవడంతో త్రైమాసిక ఫలితాల్లో వృద్ధి గ్రాఫులన్నీ తిరోగమనం పడుతుండటంతోనే ఐటి కంపెనీలు 'పొదుపు చర్యల'కు తెగిస్తున్నాయన్నది ఓ విశ్లేషణ. ఇది ప్రారంభం మాత్రమేనని అసలైన ముసళ్ల పండుగ ముందున్నదని హెచ్చరిస్తున్నారు. జారిపోతున్న ఆర్థికవృద్ధి రేటు అంచనాలు ఆ హెచ్చరికలకు బలం చేకూరుస్తున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 6.3శాతానికి మించలేదని రిజర్వుబ్యాంకు పేర్కొంది. ఒకేసారి వేలాది మంది కొలువులు కోల్పోతే ఆ ప్రభావం మిగిలిన రంగాలకూ శరవేగంగా విస్తరిస్తుంది. నిరుద్యోగుల మార్కెట్‌ అమాంతం పెరిగిపోయి శ్రమదోపిడీకి మార్గం సుగమం అవుతుంది. ఎక్కువ గంటలు పని చేస్తారా? నిష్క్రమిస్తారా? అంటూ టెస్లా, ట్విట్టర్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ చేసిన బరితెగింపు హెచ్చరికలే దీనికి నిదర్శనం. ఐటి రంగ కొలువుల పరిస్థితి అసంఘటిత రంగ కార్మికులను తలపిస్తుండటం దయనీయం. ఖర్చులు తగ్గించుకోవాలంటే వ్యాపార విస్తరణను తగ్గించుకోవచ్చు. కానీ ఉద్యోగులను ఉన్నఫలంగా ఇంటికి పంపేయడం కార్పొరేట్‌ కంపెనీల దారుణాలకు నిదర్శనం.
మెటా అధినేత జుకెర్‌బర్గ్‌ వంటి గుత్తాధిపత్య దిగ్గజాలతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటి పాలకులకు ఆ సంస్థ వేటుకు బలైపోతున్న సిబ్బందిని పట్టించుకునే తీరిక ఎక్కడిది? ఉపాధి భద్రతను నీరుగార్చి కార్మిక చట్టాలన్నిటినీ మూడే మూడు కోడ్‌లుగా కుదించిన పాలకుల కళ్లకు ఐటి కంపెనీల దారుణాలు కానరావు. ఈ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ఉపాధి భద్రత కోసం ఐటి నిపుణులు పిడికిలి బిగించాల్సిన తరుణం ఇది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.