Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇదీ మన న్యాయం! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 24,2022

ఇదీ మన న్యాయం!

న్యాయం అందరికీ ఒకటే. చట్టం ముందు అందరూ సమానులే. వంటి మాటలు పదే పదే వింటూ ఉంటాం. కానీ, పరిశీలించి చూస్తే అవి అసత్యాలు అనిపించక మానదు. బీమా కోరేగావ్‌ కేసులో నాలుగేండ్లుగా నిర్బంధంలో ఉన్న మానవ హక్కుల కోసం పోరాడే వారికి, న్యాయవాదులకు, రచయితలకు, మేధావులకు, విద్యావేత్తలకు బెయిలు మంజూరు చేయడానికి మాత్రం ఎక్కడలేని చిక్కులు అడ్డు పడుతుంటాయి. ఈ కేసులోనే అరెస్టయిన స్టాన్‌స్వామి చివరకు నిర్బంధంలో ఉండగానే మరణించారు. అరెస్టయిన 16మందిలో ఒకరైన మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖాను తలోజా జైలులో కాకుండా గహ నిర్బంధంలో ఉంచడానికి సుప్రీంకోర్టు గత గురువారమే అంగీకరించడం ఆ వెంటనే 48గంటల్లో ఆయనను జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చాలని కూడా ఆదేశించింది. న్యాయం, చట్టం అందరికీ ఒకటే అన్నది వాస్తవమే అయితే నవలఖాను జైలుగోడలు దాటి ఐదారు రోజులు అయి ఉండేది. కానీ, ఆయన మరోసారి అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చింది.
       అదే లైంగిక దాడులు, హత్య ఆరోపణల కింద జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు సునాయాసంగా పెరోల్‌ వస్తుంది. బెయిలూ వస్తుంది. 2002 నాటి గుజరాత్‌ మారణకాండ సమయంలో బిల్కిస్‌ బానో, ఆమె తల్లిపై, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మూడేండ్ల కూతురిని బండకేసి బాది చంపిన 11మంది దోషులు ''అమతోత్సవాల'' వేళ జైలు నుంచి రాచమార్యదలతో విడుదలవుతారు. మహమ్మద్‌ ప్రవక్తను తూలనాడిన కేసులో అరెస్టయిన తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిలు మంజూరు అవుతుంది. విద్వేష ప్రసంగాలకు పేరుమోసిన యతి నరసింగానంద బెయిలు షరతులను ఎన్నిసార్లు ఉల్లంఘించినా పోలీసులు పట్టించుకోరు. ఆ విషయాన్ని న్యాయస్థానం దష్టికి తీసుకెళ్లరు. అలాంటప్పుడు నిర్దోషిగా తేల్చకుండా బెయిలు మంజూరు చేయడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టదు.
       నిజంగానే బెయిలు ఒక హక్కు. కానీ నాలుగేండ్లకుపైగా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో ఉన్నవారికి బెయిలు ఎందుకు మంజూరు కాదో అన్నది అంతు చిక్కని ప్రశ్న. ప్రసిద్ధ కవి వరవరరావు పరిస్థితీ అదే. ఎనిమిదిపదులు దాటిన వరవరరావుకు ఆరోగ్య కారణాలవల్ల బెయిలు కోసం ఎంత పోరాడవలసివచ్చిందో తెలియనిది కాదు. కాన్సర్‌ వ్యాధి బాధితుడైన 73ఏండ్ల గౌతం నవలఖాను, స్టాన్‌ స్వామికి పట్టిన గతే తనకూ పట్టగూడదనుకున్నారు. అందుకే తనను కనీసం గృహనిర్బంధంలో ఉంచండి అని మొరపెట్టుకుంటే గత బుధవారం సుప్రీంకోర్టు కరుణించింది. కానీ విధించిన షరతులు పరిశీలిస్తే అవి ఎంత కఠినమైనవో అర్థం అవుతుంది. జైలు ఉన్నప్పుడు ఆయన చదువుకోవడానికి హాస్యరచయిత ఉడ్‌హౌజ్‌ పుస్తకాన్ని ఆయన కుటుంబసభ్యులు పంపిస్తే జైలు అధికారులకు అది అత్యంత ప్రమాదకరంగా భావించి ఆయనకు అందజేయలేదు. ఇది హాస్యాస్పదంగా ఉంది అని స్వయంగా న్యాయమూర్తులే వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. దానివల్ల ఆయనకు కలిగిన ప్రయోజనం ఏమీలేదు. నవలఖాను తీవ్రమైన నొప్పితో బాధపడ్తున్నా కనీసం ఆయన కూర్చోవడానికి ఓ కుర్చీ అయినా ఏర్పాటు చేయలేదు. ఆయన కళ్లజోడు ఎవరో దొంగిలిస్తే, కుటుంబసభ్యులు మరో కళ్లజోడును అందించడానికి కూడా జైలు అధికారులు అంగీకరించలేదంటే మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అన్న సందేహం కలగక మానదు. నిందితులు జైలులో ఉన్నప్పుడు కనీస వసతులైనా ఉండేట్టు చేయడం ఈ కేసును కొనసాగిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ బాధ్యత అని న్యాయమూర్తి శుక్రే ఎన్‌ఐఏకు చురకలంటించారు. 48గంటలలోగా ఆయనను గహ నిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గత వారమే ఆదేశించారు. ఎన్‌ఐఏ దానిని అమలు చేయకపోవడానికి కుంటి సాకులే కారణమన్న వాస్తవాన్ని సర్వోన్నత న్యాయస్థానం గ్రహించింది. కనుకనే ఎన్‌ఐఏ పని తీరును తూర్పారపట్టింది. కేంద్ర హౌంమంత్రి కనుసన్నలలో ఉండే ఎన్‌ఐఏ న్యాయబద్దంగా కాకుండా రాజకీయ లబ్ధి కోసమే పని చేస్తుందనడానికి ఇంత కంటే వేరే రుజువులేమి అవసరం లేదు. సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను న్యాయమూర్తులు నిలదీసిన తీరు చూస్తే భవిష్యత్తుపై ఆశలు పూర్తిగా ఆవిరి కాలేదన్న నమ్మకాన్ని సుప్రీంకోర్టు కల్గిస్తోంది. తాజాగా 24 గంటల్లో తమ ఆదేశాలు అమలులోకి రావాలని సుప్రీంకోర్టు హుకుం జారీచేసింది. ఏం చేస్తారో చూడాలి. ఇదీ మన న్యాయం!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.