Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్నికల సంఘమా? ఏలికల సంఘమా? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

ఎన్నికల సంఘమా? ఏలికల సంఘమా?

నేడు ''రాజ్యాంగ దినోత్సవం''. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సారథ్యంలో రూపొందించబడిన ''భారత రాజ్యాంగం'' ఈ దేశ సమస్త ప్రజల సర్వోన్నత శాసనంగా ఆమోదించబడిన రోజు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల సమన్వయంగా నేటికి 73ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భమిది. అదే సమయంలో ఆ సర్వోన్నత శాసనం అత్యంత ప్రమాద ఘంటికలను ఎదుర్కొంటున్న సందర్భం కూడా ఇదే..! ఏ ప్రభుత్వమైతే 2015లో ఈ ''నంబర్‌ 26''ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందో, ఆ ప్రభుత్వమే ఇప్పుడా ఘనమైన స్ఫూర్తికి గోతులు తవ్వుతోంది. ఫలితంగా రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థలన్నీ అధికారంలో ఉన్నవారి జేబు సంస్థలుగా మారిపోగా, ''ఎన్నికల సంఘం'' సైతం అందుకు మినహాయింపు కాకపోవడం మన ప్రజాస్వామ్య స్ఫూర్తినే వెక్కిరిస్తోంది! ప్రస్తుతం ఈ దేశ అత్యున్నత న్యాయ స్థానం ఈ ప్రభుత్వానికి సంధిస్తున్న ప్రశ్నలే ఇందుకు తార్కాణం.
''ఎన్నికలసంఘం కమిషనర్‌గా కేంద్రం అరుణ్‌గోయల్‌ను మెరుపు వేగంతో నియమించడం వెనుక మతలబేమిటి?''... ''ఒకవైపు ఈ నియామకాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే, మరోవైపు ఆగమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకోవడంలోని ఔచిత్యమేమటి?''... ''కేవలం 24గంటల్లోనే అసాధారణ రీతిలో ఈ నియామకం పూర్తిచేయడానికి మీరు అనుసరించిన విధానమేమిటి?''... ఈ ప్రశ్నలు న్యాయమూర్తుల ఆగ్రహానికే కాదు, అసంఖ్యాకులైన భారత ప్రజల అంతరంగానికీ ప్రతీకలు.
భారత రాజ్యాంగం ప్రకారం ''ఎన్నికల సంఘం'' ఓ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దేశంలో ప్రజాస్వామ్యానికి కీలకమైన ఎన్నికలు నిర్వహించే వ్యవస్థ. ఎలాంటి ప్రలోభాలకూ, అనైతిక ప్రభావాలకూ, అక్రమాలకూ అవకాశమివ్వకుండా... అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం ఈ సంస్థ బాధ్యత. కానీ అవాంఛనీయమైన రాజకీయ జోక్యాల వల్ల ఎన్నికల సంఘం డూడూ బసవన్నలతో నిండిపోతోంది. చివరికి ఎన్నికల్లో ఆ స్వేచ్ఛా, పారదర్శకతలే కొడిగట్టిన దీపాలవుతున్నాయి. ఈ ఎనిమిదేండ్ల మోడీ పాలనలో అది మరింత తీవ్రమై ఎన్నికల సంఘ మంటే ఏలినవారి వ్యూవహాలకు తలాడించే తోలుబొమ్మగా మారింది. ఎలక్షన్‌ కమిషనర్‌లుగా తమకు నచ్చినవారినే ఎంపిక చేసుకోవడం ఓ తంతుగా మారింది. ఇందుకు అరుణ్‌గోయల్‌ ఎంపిక ఓ తాజా ఉదాహరణ మాత్రమే. న్యాయశాఖ కొన్ని పేర్లు ఎంపిక చేసి ప్రధాని పరిశీలనకు పంపించడం, అంతిమంగా ప్రధాని ఆమోదం ద్వారా నియామకం జరిగే విధానమే ఇలాంటి అహేతుకమైన ఎంపికలకు వీలుకల్పిస్తోంది.
అందుకే ఈ విధానాన్ని సవాలు చేస్తూ, రాజకీయ జోక్యాలకూ, ప్రభుత్వాల అభీష్టాలకూ ఏ మాత్రం అవకాశమివ్వని, ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా ఈ నియామకాలు జరగాలని కోరుతూ కొన్ని పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై గతవారం రోజులుగా న్యాయస్థానం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగా... ఒక కొలీజియం తరహా వ్యవస్థలో, ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి భాగస్వామ్యంతో ఈ నియామకాలు జరగాలన్న ప్రతిపాదనలూ, ప్రధానమంత్రిని సైతం ప్రశ్నించే శక్తిగా ఎలక్షన్‌కమిషన్‌ ఉండాలన్న అభిప్రాయాలూ న్యాయస్థానం నుండి అత్యంత బలంగా వెలువడుతుండగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మోడీ సర్కారు బరితెగింపునకు నిదర్శనం.
ఓ కీలకమైన అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే దానిపై నిర్ణయం తీసుకోవడం నైతికత కాదన్న ఇంగితమే లేకుండా పోయిందీ ఏలికలకు. నైతికవిలువలు, నీతినియమాలకంటే తమ రాజకీయ అవసారాలే వారికి ముఖ్యమైపోయాయి. అందుకే న్యాయస్థానం వెల్లడిస్తున్న అభిప్రాయాలను ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా, గంటల వ్యవధిలోనే అరుణ్‌గోయల్‌ను ఎన్నికల సంఘం గద్దెపై ప్రతిష్టించారు. ''ఒక ప్రభుత్వ అధికారి వీఆర్‌ఎస్‌ అభ్యర్థనను ఆమోదించడానికే కనీసం మూడు నెలలు పడుతుంది కదా..!'' అంటూ జస్టిస్‌ జోసెఫ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఇక్కడ గమనార్హం. అంతేకాదు, ''కేవలం 24గంటల్లోనే ఈ మొత్తం నియామక ప్రక్రియను ఎలా పూర్తి చేశారంటూ'' సుప్రీం ధర్మాసనమే విస్తుపోయింది. ఏలినవారి నీతిమాలిన తనానికీ, భారత రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల వీరి గౌరవం ఏపాటిదో గ్రహించడానికీ ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలీ..?! కాబట్టి విలువల్ని గాలికొదిలి, అధికారమే పరమావధిగా సాగుతున్న ఏలికల వ్యూహాలు ఉధృతమవుతున్న ఈ సమయంలో ప్రజలు జాగరూకతతో ఉండాలి. ఇప్పుడు నిబద్దతగల రాజకీయ చైతన్యం, బలమైన ప్రజా ఉద్యమాలు మాత్రమే మన రాజ్యాంగాన్నీ, దేశాన్నీ రక్షించగలవు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

08:04 AM

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.