Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హీన వచనాలు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

హీన వచనాలు

గత రెండు దశాబ్దాలుగా మన టీవీ ఛానళ్లలో ప్రవచనకారుల బోధలు విపరీతంగా పెరిగాయి. నీతులు, సూక్తులు వల్లించడం, పురాణాల ఉదాహరణలతో నేటి సమాజాన్ని విశ్లేషించడం, ధర్మసూత్రాలు, ప్రవర్తనా నియమాలను నిర్దేశించే ప్రసంగాలు ఏ ఛానల్‌ వెతికినా వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఆధునిక జీవనంలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను గతంలోకి వెళ్లి, విశ్వాసాల ఆధారంగా ఉన్న వాటితో పరిష్కరించుకోవాలని సెలవిస్తుంటారు. వ్యవస్థ విధానాల ఫలితంగా ఎదురయ్యే ఇక్కట్లు, బాధలు, వేదనలు, దోపిడీలు, అరాచకాలు, అన్యాయాలు, నేరాలు మొదలయినవన్నీ మనుషుల వైయుక్తిక ప్రవర్తనల వల్లనే తలెత్తుతున్నాయని కంచుకంఠాలతో వచిస్తుంటారు. అసలు కారణాలను వెతకనీయకుండా దారిమళ్లిస్తుంటారు. ప్రపంచీకరణ తెచ్చిన అనేక దుష్ప్రభావాలకు పురాణసూక్తిని పరిష్కారం చేస్తారు. అమాయకులైన శ్రోతలు వారి వాగ్ధాటిలో ఓలలాడుతారు. అయితే ఈ ప్రవచనకారుల అసలు స్వరూప స్వభావాలు అప్పుడప్పుడు బయటపడి జనాన్ని గాయపరచి అసహ్యతను వెళ్లగక్కుతాయి.
అందుకు తాజా ఉదాహరణ ఓ ఘనాపాటి ప్రవచన పంకిలం. ప్రవచనమంటే ప్రసిద్ధమైన, గొప్పమాట. సూక్తి, హితోక్తి అని అర్థం. ఈయన వ్యంగ్యాత్మక ప్రవచనం. ఆధునికమైనదిగా అందంగా చెప్పుకునే అత్యంత మనువాదీకరించబడిన ప్రవచనం. మొన్నొకసారి మాట్లాడుతూ ఆడవాళ్ల వస్త్రధారణపై అవాకులు చెవాకులు పేలాడు. ''టీషర్టులు, పాయింట్లూ వేసుకుని కుర్రాళ్లను రెచ్చగొండుతున్నారని, నాలాంటి వాడికే మనసు మరలుతోందని, ఇక యువకులు ఊరకుంటారా!'' అని ప్రవచించారు. చక్కగా చీరకట్టుకున్న వాళ్ల జోలికి ఎవరూ రారని వక్కాణించాడు. స్త్రీలపైన ఘోరాలు, అఘాయిత్యాలు జరగటానికి వారి వస్త్రాలు కారణమని సెలవిచ్చాడు. ఇది మహిళలను, వారి స్వేచ్ఛను కించపరచే వ్యాఖ్యానం. ఆధునిక సమాజంలో మహిళలు పోలీసులుగా, సైనికులుగా, పైలెట్‌లుగా పరిశ్రమల్లో అనేక చోట్ల శ్రమచేస్తున్నారు. బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారందరికీ డ్రెస్‌ కోడ్‌ను ఈయన నిర్దేశిస్తాడా? ఏమిటీ మోరల్‌ పోలీసింగ్‌! ఆడవాళ్లనగానే మగవాళ్ల సుఖం కోసం, పిల్లల్ని కని వారికి సేవ చేయడం కోసమేననే ఛాందస భావాల ఆలోచనలలోంచి స్త్రీని చూస్తున్న దృష్టిలోప ఫలితమిది. చిన్న పిల్లల, పసికందులపైన జరుగుతున్న అఘాయిత్యాలకు కారణమేమని చెబుతారో వీళ్లు. ప్రవచనం అనే పేరుతో మూఢ విశ్వాసాలను, ఛాందస, మనువాద భావాలను ప్రచారం చేసేవాళ్లు ఆధునిక ప్రజాస్వామిక, సమతా భావనలను ధ్వంసం చేస్తున్నారు. ఇక ఆరోగ్య సూత్రాలు బోధించి, వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న మరో బాబా ప్రవచనం మరింత నీచానికి దిగజారింది. మొన్న మహారాష్ట్రలోని పూనేలో ఒక మహిళల యోగా శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ ''ఆడవాళ్లు చీరెలో, సల్వార్‌ సూట్‌లో అందంగా ఉంటారు. లేదా నాలాగా బట్టలేసుకోకున్నా బాగుంటారని'' తన చిల్లర బుద్ధిని బయట పెట్టుకున్నారు. స్త్రీలపట్ల ఇంత అవమానకరంగా బోధించేవారు బాబాలుగా గురువులుగా చలామణి కావడం కన్నా ఇంకా ఘోరమైన దేమున్నది!
ఇంకోకాయన ఉన్నారు. ఆయన మహిళలు చేయాల్సిన పనులగురించి గొంతెత్తి చెబుతారు. భర్తకు సేవ చేయటమే భార్య విధి, కర్తవ్యమని బోధిస్తారు. భర్త విడిచిన బట్టలుతకాలి, వంట వండాలి, వడ్డించాలి, భర్త తిన్న విస్తరిలోనే భార్య తినాలి. భర్తను దైవంగా పూజించాలి. ఇదీ ఆయన బోధ. ''మగడు వేల్పన పాత మాటది, ప్రాణమిత్రుడ నీకు'' అని వందేండ్ల క్రితమే అన్న గురజాడ ఎక్కడ... ఈ అడుగంటిన మూర్ఖాలోచనల ప్రవచన కారులెక్కడ! ఆయన తన కాలానికి వందేండ్లు ముందుంటే, వీళ్లు వేయ్యేండ్లు వెనుకుండి చెలామణికావటం ఒక విషాదం. స్త్రీల పట్ల ఒక సమానతా భావాన్ని ప్రకటించిన మహానుభావుడు, హేతువాది, అభ్యుదయ భావుకుడు గురజాడవారి పేరు మీద ఇచ్చే పురస్కారాన్ని ఈయనకు ఇవ్వాలని, విజయనగరంలోని గురజాడ సాంస్కృతిక సంస్థవారు పూనుకోవడం ఒక విడ్డూరమైన చర్య. ఈ మూడు విషయాలూ మన సమాజంలోకి ఎలాంటి ఆలోచనలు వచ్చి చేరుతున్నాయో తెలియజేసే సంఘటనలు. వీటిని అడ్డుకుని నిలువరించకపోతే మరింత మూఢత్వం ప్రజ్వరిల్లే ప్రమాదం ఉంది. నేడు స్త్రీలపై పెరుగుతున్న గృహహింసను అరికట్టాలని చేస్తున్న వారోత్సవాల సందర్భంగా ఈ ప్రవచనకారుల, బాబాల దుర్మార్గపు దాడిని ముందుగా అరికట్టవలసి ఉన్నది. నీతి బోధకుల మూతులు మూయించకపోతే మరింత మురికిపారే ప్రమాదముంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

08:14 AM

వనస్థలిపురంలో కారు బీభత్సం..తప్పిన ప్రమాదం...

08:04 AM

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.