Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మెట్రో సరే... మరి ఎమ్‌ఎమ్‌టీఎస్‌..? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

మెట్రో సరే... మరి ఎమ్‌ఎమ్‌టీఎస్‌..?

మన విశ్వనగరం హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు రెండో దశలో శంషాబాద్‌ విమానాశ్రయం వరకూ లైన్లను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు షురూ చేసింది. అందుకనుగుణంగా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.8,453 కోట్ల మేర సాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రానికి లేఖ రాసిన సంగతి విదితమే. అయితే ఇప్పటికే అనేక విషయాల్లో తెలంగాణకు రిక్తహస్తం చూపిన నరేంద్ర మోడీ సర్కార్‌... మెట్రోపై ఎలా స్పందిస్తుందో చూడాలి. కేంద్రం స్పందించినా, స్పందించకపోయినా రెండో దశపై కచ్చితంగా ముందుకెళతామంటూ హైదరాబాద్‌ మెట్రో ఉన్నతాధి కారులు ధైర్యంగా చెప్పటం ముదావహం.
హైదరాబాద్‌ మహా నగరం లో ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరుస్తామనీ, అందులో భాగంగానే మెట్రో రెండో దశను ప్రారంభించబోతున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల చెప్పుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే... హైదరాబాద్‌ మెట్రో ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్‌ ప్రయివేటు పార్టనర్‌షిప్‌ (పీపీసీ) ప్రాజెక్టు. కోవిడ్‌ కంటే ముందు, ఆ తరువాత కూడా ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌కు ఎక్కువ మంది యువత తరలిరావటం, కరోనా తర్వాత వివిధ సంస్థలు, కార్యాలయాలు పూర్తిస్థాయిలో తమ కార్యకలాపాలను ప్రారంభించటం తో మెట్రోకు మరింత ఊపొచ్చింది. దీంతో ఇప్పుడు రెండో దశకు సర్కారు శ్రీకారం చుట్టబోతుండటం హర్షించదగిన విషయం.
ఇదంతా ఒక ఎత్తయితే... రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరుస్తామంటూ చెబుతున్న ప్రభుత్వ పెద్దలు పేదలు, చిన్న చితకా వ్యాపారులు, దినసరి కూలీలు, అడ్డా మీది కూలీలకు అత్యధికంగా ఉపయోగపడే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లను, వాటి లైన్ల విస్తరణను ఎందుకు పట్టించుకోవటం లేదో అర్థం కావటం లేదు. వాస్తవానికి మెట్రో రైళ్లతో పోలిస్తే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్ల ఛార్జీలు చాలా తక్కువ. ఎంతలా అంటే ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకూ మెట్రోలో వెళ్లాలంటే కనీసం రూ.80 నుంచి రూ.100 వరకూ పెట్టాల్సిందే. అంతే దూరంగల విద్యానగర్‌ నుంచి శేరిలింగంపల్లి వరకూ ఎమ్‌ఎమ్‌టీఎస్‌లో వెళ్లేందుకు రూ.10 మాత్రమే ఖర్చవుతుంది. నమ్మటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ప్రతీరోజూ ఉద్యోగాలకు వెళ్లే వేతన జీవులు, నగర శివార్లలో కొలువులు చేసే ఉపాధ్యాయులు, ఇతర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, కార్మికులు, గృహాల్లో పనులు చేసుకుని పొట్టపోసుకునే మహిళలు, విద్యార్థులు నెలవారీ పాసులు తీసుకుని... అతి తక్కువ ఖర్చుతో నెలంతా తిరుగుతున్నారు. అంటే ప్రజలకు అత్యంత చౌకగా, సౌకర్యవంతంగా సేవలందించటంలో మెట్రో కంటే, ఆర్టీసీ కంటే మెరుగైన రవాణా వ్యవస్థ ఎమ్‌ఎమ్‌టీఎస్సే అన్నమాట. అలా గత కొన్నేండ్లుగా (మెట్రో కంటే ఓ ఇరవై ఏండ్లు ముందుగానే) హైదరాబాద్‌ నగర వాసుల జీవితాల్లో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ భాగమైంది. భాగ్యనగరానికి మణిహారమైంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పాలకులు దాని విస్తరణ, విస్తృతిపై ఎంతమాత్రమూ శ్రద్ధ చూపకపోవటం ఎమ్‌ఎమ్‌టీఎస్‌ పట్ల వారికున్న నిర్లక్ష్య భావనను తెలియజేస్తున్నది.
హైదరాబాద్‌ అనేది మహానగరం స్థాయి నుంచి విశ్వనగరం స్థాయికి చేరిందని చెప్పుకుంటున్నాం. హైదరాబాద్‌ నగర పాలక సంస్థ (ఎమ్‌సీహెచ్‌) కూడా హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎమ్‌సీ)గా దశల వారీగా రూపాంతరం చెందింది. కోటిన్నర జనాభాతో దేశంలోనే అతి పెద్ద ఐదో నగరంగా అవతరించింది. ఇటు చౌటుప్పల్‌ నుంచి అటు రాయదుర్గం వరకూ, ఇబ్రహీంపట్నం నుంచి శామీర్‌పేట దాకా జీహెచ్‌ఎమ్‌సీ తన పరిధిని విస్తరించు కుంటూ పోయింది. ఈ క్రమంలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ను ఆయా ప్రాంతాల వరకూ విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన్నే ఉంది. తద్వారా నగరంలో ట్రాఫిక్‌ ఇక్కట్లను మరింతగా తగ్గించొచ్చు. వాహనాల కాలుష్యం నుంచి జనాలకు ఎంతో ఉపశమనం కలిగించొచ్చు. అన్నింటికీ మించి మెట్రోతో పోలిస్తే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ విస్తరణకు అయ్యే ఖర్చు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దాని విస్తరణ దిశగా సర్కారు వారు సమాలోచనలు చేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.