Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అణచివేతకు దిగిన అమెరికా పార్లమెంటు! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 02,2022

అణచివేతకు దిగిన అమెరికా పార్లమెంటు!

ఒక వివాదాన్ని పరిష్కరించటం చేతగాని అమెరికా ప్రభుత్వం... మూడు సంవత్సరాలుగా వేచి చూసిన కార్మికులు తలపెట్టిన సమ్మెను అణచివేసేందుకు ఏకంగా పార్లమెంటునే రంగంలోకి దించింది. దీనికి ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా వంతపాడారు. అధికార డెమోక్రటిక్‌ పార్టీ కార్మిక పక్షపాతి అని వర్ణిస్తున్నవారు ఈ తీరుతో విస్తుపోతున్నారు. ఈనెల తొమ్మిది నుంచి తలపెట్టిన రైల్వే సమ్మెను అడ్డుకొనేందుకు జో బైడెన్‌ సర్కార్‌ పార్లమెంటులో చట్టాన్ని చేసింది. ప్రభుత్వ మధ్యవర్తిత్వంలో సెప్టెంబరులో రైల్వే కంపెనీలు ప్రతిపాదించిన ఒప్పందాన్ని కొన్ని కార్మిక సంఘాలు తిరస్కరించాయి. దీంతో దాన్ని బలవంతంగా రుద్దేందుకు పార్లమెంటు దిగువ సభలో 290-137 మెజారిటీతో ఒక బిల్లును ఆమోదించారు. డెమోక్రాట్‌, రిపబ్లికన్‌ పార్టీలకు చెందిన ఇరు పక్షాలూ సమ్మెను భగం చేసేందుకే పూనుకున్నందున ఎగువ సభ సెనెట్‌ ఆమోదం కూడా లాంఛనమే.
ఐరోపాలోని బ్రిటన్‌తో సహా అనేక దేశాల్లోని రైల్వే కార్మికులు కూడా పోరుబాట పట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల సమ్మెలు జరపగా ఈ నెలలో మరికొన్ని జరిపేందుకు ముందుకు సాగుతున్నారు. కరోనా సాకుతో అనేక మంది సిబ్బంది తొలగింపు, సాధారణ స్థితి ఏర్పడిన తరువాత కూడా తొలగించిన మేరకు కొత్త వారిని తీసుకోకపోవటంతో పని భారం పెరిగింది. పాత ఒప్పందాల గడువుతీరిన తరువాత కూడా కొత్త వాటిపై సంప్రదింపుల పేరుతో సాగదీస్తున్నారు. దీనికి తోడు పులి మీద పుట్రలా పెరుగుతున్న దవ్య్రోల్బణం, ధరల పెరుగుదలతో నెల తిరక్కుండానే జేబులు ఖాళీ అవుతుండటంతో నిజవేతనాలు పడిపోయి విధిలేని స్థితిలో కార్మికులు వీధుల్లోకి వస్తున్నారు. జనానికి ఇబ్బంది కలగకుండా విరామం ఇస్తూ వారానికి ఒక రోజు లేదా రెండు మూడు రోజుల సమ్మెలతో జరుపు తున్న ఆందోళనను పాలకులు పెడచెవిన పెడుతు న్నారు. ఇదే వైఖరి కొనసాగితే నిరవధిక సమ్మెలకు దిగినా ఆశ్చర్యం లేదు.
ప్రతి దేశంలో పాలకులు పాడుతున్న పాచిపాటనే అమెరికా అధినేత జో బైడెన్‌ కూడా పాడాడు. రైల్వే కార్మికులు సమ్మె జరిపితే ఇతర కార్మికులు, వారి కుటుంబాలు ఇబ్బంది పడతాయంటూ గుండెలు బాదుకుంటూ రెచ్చగొట్టాడు. సమ్మెతో ఇంథనం, ఔషధాలు ఇతర నిత్యావసర వస్తు సరఫరాకు ఆటంకం కలుగుతుందని, రోజుకు రెండు బిలియన్‌ డాలర్ల మేరకు ఆర్థిక వ్యవస్థకు నష్టం అంటూ కొందరు అప్పుడే చిట్టాలు రూపొందించి జనాన్ని భయపెట్టేందుకు పూనుకున్నారు. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా 24శాతం వేతనం పెంపుదల అని చెబుతున్నప్పటికీ ఆరోగ్య బీమా ఖర్చు, ఇతర కోతలు పోను పదిహేనుశాతం కంటే ఉండదని కార్మికులు చెబుతున్నారు. దిగజారిన పని పరిస్థితుల కారణంగా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కూడా ఆందోళనకు సిద్దం అవుతున్నారు. కరోనాకు ముందు నుంచే కొత్త ఒప్పందం కోసం డిమాండ్‌ చేస్తుండగా పెడచెవిన పెట్టినందున గత నెలలో కొన్ని చోట్ల ధర్నాలు చేశారు. ఇంతవరకు ఎక్కడాలేని విధంగా ఒకే పైలట్‌తో విమానాలను నడిపేందుకు సిబ్బంది అంగీకరించాలని కంపెనీలు వత్తిడి తెస్తు న్నాయి. అమెరికాలో ఎనిమిది శాతం ద్రవ్యోల్బణం పెరిగితే ఆ పేరుతో విమాన ఛార్జీలను ఏకంగా 42.9శాతం పెంచి ప్రయాణీకులను కూడా దోపిడీ చేస్తున్నాయి. కరోనా పేరుతో సిబ్బందిని తొలగించకూడదంటూ ప్రభుత్వం ఇచ్చిన 54బిలియన్‌ డాలర్ల సబ్సిడీ పొందిన కంపెనీలు 80వేల మందికి ఉద్వాసన పలికాయి.
ఐరోపాలోని బెల్జియం రైల్వే కార్మికులు కూడా ఆందోళన బాటపట్టారు. మొత్తం సిబ్బంది ఒక రోజు సమ్మె జరపగా డ్రైవర్లు మూడు రోజులు సమ్మె చేశారు. పనివత్తిడి ఎంతగా ఉందంటే డ్రైవర్లు నడుపుతూనే భోజనం చేయాలి, బాత్‌రూమ్‌కు పోవాలంటే రెండు స్టేషన్ల మధ్య త్వరగా పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నారు. బ్రిటన్‌లో ఈ నెలలో ఎనిమిది రోజులు ఆందోళన చేపట్టేందుకు రైల్వే సిబ్బంది పూనుకున్నారు. దీంతో ఐరోపాలోని ఇతర దేశాలకు వెళ్లే రైళ్ల మీద కూడా ప్రభావం పడనుంది. ఆస్ట్రియాలో ఒక రోజు హెచ్చరిక సమ్మె చేశారు. ఫ్రెంచి రాజధాని పారిస్‌లో మెట్రో సిబ్బంది, ఇటలీలోని రైల్వే, మెట్రో సిబ్బంది కూడా ఆందోళనలు జరుపుతున్నారు. బ్రిటన్‌లో ఈ ఏడాది అతి పెద్ద పారిశ్రామిక ఆందోళనగా వర్ణిస్తున్న లక్షలాది మంది పోస్టల్‌, కాలేజీ, విశ్వవిద్యాలయాల సిబ్బంది ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు.
మినీ బడ్జెట్‌ పేరుతో నూతన ప్రధాని రిషి సునాక్‌ ప్రకటించిన పధకాలేవీ వారి డిమాండ్లను పరిష్కరించేవిగా లేకపోవటంతో రానున్న రోజుల్లో మరింతగా ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది. నిజవేతనాలు పడిపోవటం, ఇటీవలి ధరల పెరుగుదల కార్మికుల జీవన పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. కార్మికవర్గం కదులుతున్న తీరును చూసిన కార్పొరేట్‌ పత్రిక ది టైమ్స్‌ పాలకవర్గాలను హెచ్చరించింది. నిజంగా బ్రిటన్‌ చలికాలంలో నూతన అసమ్మతిని ఎదుర్కొంటున్నదని అనుకుంటే అది నిన్ననే ప్రారభమైంది. కార్మిక సంఘాలలో నూతన తరం మిలిటెంట్స్‌ వచ్చారని నమ్మితే ఇది ప్రారంభం మాత్రమే అని కూడా అది హెచ్చరించింది. ఇది ఒక్క బ్రిటన్‌కే అనుకుంటే పొరపాటు, అన్ని దేశాల పాలకవర్గ బాకాల సందేశాల సారం ఇదే!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.