Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'ఉపాధి'కి మంగళమేనా..? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

'ఉపాధి'కి మంగళమేనా..?

కార్పొరేట్లకు రాయితీల వర్షం కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం పేదలకు మాత్రం ఊపిరి కూడా అందకుండా చేస్తోంది. వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉన్న ఉపాధి హామీ చట్టం ఉసురు తీసేందుకు ప్రయత్నించడం ఆందోళనకరం. నరేంద్ర మోడీ గద్దెనెక్కినప్పటి నుండి 'ఉపాధి' పట్ల చిన్నచూపే చూస్తున్నారు. వామపక్షాలు అప్పటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి తీసుకొచ్చిందే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. వ్యవసాయ కార్మికులు, పేద రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం రూపుదిద్దుకుంది. కనీసం వంద రోజులైనా పని కల్పించాలని, కోరుకున్న వారందరికీ పని ఇవ్వాలనేది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఈ చట్టం కాంగ్రెస్‌ వైఫల్యాలకు సజీవ స్మారక చిహ్నమని, చాలా ఏండ్లు అధికారంలో ఉన్న తర్వాత పేదవాడికి కొన్ని రోజులు గుంతలు తవ్వే పని అప్పగించడమే వారు చేయగలిగిందంటూ 2015లోనే ప్రధాని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. నాటి నుంచి ఈ చట్టానికి తూట్లు పొడిచేందుకు కాషాయ సర్కారు చేయని ప్రయత్నం లేదు. అందులో భాగమే తాజాగా గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి అమర్‌జిత్‌ సిన్హా నేతృత్వంలోని కమిటీ నియామకం. ఈ చట్టంలో తీసుకురావాల్సిన మార్పులు, కేటాయించే పనులు, వాటిలో తీసుకురావాల్సిన మార్పులు, ఖర్చులు, రాష్ట్రాల మధ్య తేడాలు లాంటి అంశాలను పరిశీలిస్తారని సర్కారు చెబుతోంది. కానీ, అసలు లక్ష్యాలు వేరుగా ఉన్నాయని పరిశీలకుల భావన.
తొలుత దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయగా, 2008-2009 నుంచి దేశమంతటికీ విస్తరించారు. నాటి నుంచి 2014 వరకూ గ్రామీణ ప్రాంత కుటుంబాల్లో 30శాతం మందికి ఉపాధి లభించగా, మోడీ సర్కారు వచ్చిన తరువాత 2014 నుంచి 2020 వరకూ చూస్తే 26శాతం మందికే ఉపాధి కల్పించింది. ఉపాధి హామీ పనుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 18శాతం మంది తిరస్కరణకు గురవుతున్నారని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకూ తొలి అర్ధ సంవత్సరంలోనే కోటిన్నర మందికి ఉపాధిని తిరస్కరించింది కేంద్రం. దరఖాస్తు చేసుకున్న అందరికీ ఉపాధి కల్పించాలన్న చట్టం లక్ష్యానికి మంగళం పాడింది. మరోవైపు ఏదో ఒక కొర్రీ పెడుతూ పథకం నిధుల చెల్లింపులో జాప్యం చేస్తూ ఉండటం షరామామూలుగా మారింది.
ఉపాధి హామీ చట్టం ప్రకారం కార్మికుల మస్తరు రోల్స్‌లో నమోదు చేసిన 15రోజుల్లో వేతనం చెల్లించాల్సి ఉంది. ఈ 'ఉపాధి' పీక నులమాలని చూస్తున్న కేంద్రం సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో, కూలీలకు నెలల తరబడి బకాయిలుంటున్నాయి.
కరోనా కాలంలో వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలకు ఈ చట్టం సంజీవనిగా మారింది. నగరాల్లో పనులు లేక, బతకలేక కాలినడకన బయల్దేరిన కష్టజీవికి స్వగ్రామంలో ఇంత కూడు పెట్టింది ఈ చట్టమే. కానీ, 2022-23 బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ.73వేల కోట్లే కేటాయించారు. ఇది 2021-22 సవరించిన అంచనాల కంటే 25 శాతం తక్కువ. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు త్రిపురలో పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి హామీ అమలు చేశారు. దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలని వామపక్షాలు, ప్రగతిశీలురు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా నియమించిన అమర్‌జిత్‌ సిన్హా నేతృత్వంలోని కమిటీకి ఇచ్చిన మార్గదర్శకాలను బట్టి చూస్తే ఈ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. ఈ కమిటీ జనవరి నాటికి నివేదిక ఇస్తే, బడ్జెట్‌లో ఈ చట్టానికి కేటాయిస్తున్న నిధులకు మరింతగా కోతపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్రం లెక్కల ప్రకారమే దేశంలో 23 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల సంఖ్య పెరుగుతూనే ఉందని గణాంకాలన్నీ ఘోషిస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం పేదల రక్తం పీల్చి పెద్దలకు పంచే కుట్రలకే పూనుకొంటోంది. ఈ కుట్రల్లో భాగమే ఉపాధిహామీపై అమర్‌జిత్‌ సిన్హా కమిటీ. కేంద్రం కుతంత్రాలను తిప్పికొట్టి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు వ్యవసాయ కార్మికులు, పేదలతోపాటు పట్టణ పేదలు కూడా ఉద్యమించాలి.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.