Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొందరుంటారు! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

కొందరుంటారు!

             యేటికి ఎదురీదేవాళ్లు కొందరుంటారు. తామెంతగా నష్టపోయినా, మిక్కిలి ఇక్కట్లకు గురయినా, ఎన్ని సవాళ్లు ఎదురయినా విలువల అడుగులపైనే నిలబడి ఉంటారు. వారు అరుదుగా కనిపించవచ్చు. ఆశ్చర్యమూ కలుగవచ్చు. కానీ కొందరుంటారు అలా! కాపలాకాస్తున్నతీరుగా. పతనమవుతున్న విలువలు ఒకవైపు, వాటిని ప్రతిఘటిస్తూన్న ఘర్షణ మరోవైపు నిత్యం ఉంటూనే ఉంటుంది. వాటిని గమనిస్తున్నప్పుడే ఎటువైపు మనం నిలవాలో తెలుస్తుంది. విలువలు బేరీజు వేయడం ఒక పెద్ద సమస్య. ఈ సందర్భంలోనే దాదాపు నూటాయాభైయేండ్ల క్రితమే వివరించిన విషయం గుర్తురాక మానదు. ''ఇంతకు ముందు ప్రజలు భక్తిగౌరవాలతో, విశ్వాసంతో ఆదరించిన వృత్తులను అది నీచపరుస్తుంది. వైద్యుడినీ, న్యాయవాదినీ, పురోహితుడినీ, శాస్త్రవేత్తనీ అది తన జీతగాళ్లుగా మార్చుకొంటుంది'' అని పేర్కొన్న విషయం ఎంత వాస్తవిక దృశ్యం. ఇప్పుడు మన కండ్లముందు జరుగుతున్నదదే కదా! ఇలా చేస్తున్నదొక్కటే అది పెట్టుబడి. దీని మహత్యం అంతా ఇంతా కాదు. మనమేమీ తెలుసుకోలేనంతగా మనపై కొత్తవిలువల్ని, ఆలోచనల్ని రుద్దుతుంది. అవే అసలువని నమ్ముతాం కూడా.
అయితే బలహీనంగానైనా కొన్ని గొంతులు ఎదురునిలబడి నినదిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలా నిలబడినవాళ్లను చూస్తూనే ఉన్నాం. నేటి ఆధునిక సమాజంలో ప్రచార ప్రసార సాధనాల విస్తరణ పెరిగిన తరుణంలో వార్తా మీడియా ఛానెళ్లరూపంలో ప్రతివారి చేతుల్లోకి వచ్చేసింది. ఇది తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తున్నది. ప్రజల భావాలను, అభిప్రాయాలను, ఆలోచనలనూ మీడియానే తీర్చిదిద్దుతున్న వేళ, దీన్ని సంపూర్ణంగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నది పెట్టుబడి. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకకాదు. ప్రజాగొంతుక అసలేకాదు. ఆధిపత్య భావాలకు, ఆచరణకు సమ్మతిని సమకూర్చే ఉత్పత్తిసాధనమిది. ఇది కొత్తగా జరిగిందేమీ కాదు. కానీ కొత్తపుంతలు తొక్కుతున్నది. దేశంలో పత్రికలు, వార్తా ఛానళ్లు పెట్టుబడుల సమకూర్పుతోనే ప్రారంభమైనా కొంత స్వతంత్ర విధానంతో, నిజాయితీతో, నిష్పక్షపాతంగా నడిచేవి. అంతేకాదు, ఆయా రంగాలలో నైపుణ్యమూ, సామర్థ్యము ఉన్నవాళ్లతోనే నడుపబడేవి, కొనసాగేవి. ఇప్పుడవన్నీ బహుళజాతి సంస్థలూ, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడిక నిపుణులు, మేధావులు అందరూ కేవలం జీతగాళ్లు మాత్రమే. అలా మారిపోయిన సంఘటనే ఎన్‌డిటివి ఛానల్‌ను ఆదానీగ్రూప్‌ కంపెనీ స్వాధీనం చేసుకోవడం.
1984లో మొట్టమొదటిసారి స్వతంత్ర నెట్‌వర్క్‌తో ఎన్‌.డి.టి.వి. 24/7ను ఏర్పాటు చేసింది. అత్యంత ప్రసిద్ధ నెట్‌వర్క్‌గా పేరుతెచ్చుకున్నది. మూడున్నర కోట్లమంది అనుసరిస్తున్నారు. దీని సమాచారాన్ని విశ్వసిస్తున్నారు కూడా. అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ప్రశ్నించడం, వాస్తవిక విషయాలను అందించడంతో దీనికా విశ్వాసనీయత పెరిగింది. అలాంటి ఛానెల్‌ ఇప్పుడు ఆదానీ గ్రూపు వశమైంది. ఆ వెంటనే దాని వ్యవస్థాపకులు ప్రణరురారు, రాధికారారులు వారి పదవులకు రాజీనామా చేసి బయటికి వచ్చేశారు. ఆ మరునాడే అత్యంత ప్రతిభా వంతుడు, నిజాయితీపరుడు, నిబద్ధతగల పాత్రికేయుడు రవీష్‌కుమార్‌ కూడా ఛానెల్‌ నుండి నిష్క్రమించాడు. 'ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్నుడు కూడా నిన్ను కొనలేకపోయాడు చూడు... అదీ నీ నిజాయితీ' అని రవీష్‌కుమార్‌ని నేటిజన్లు ప్రశంసిస్తున్నారు. అవును నిజమే కదా! అమ్ముడుపోని అక్షరాలు ఇంకా ఉన్నాయి. దేశంలోని మీడియా సంస్థలు కుబేరుల వశం కావచ్చు. వార్తల వ్యాపారం మొదలవ్వొచ్చు. వ్యాపారమంటే మోసాలూ కొనసాగవచ్చు. కానీ నిజాయితీతో, విలువలతో, ప్రజలకు సత్యాన్ని తెలపాలనే తపనగల పాత్రికేయులు ఇంకా ఉన్నారు. ''నేను ఈ రంగంలోకి వచ్చినప్పుడు, జర్నలిజానికి అదొక స్వర్ణయుగం. ఇప్పుడు భస్మయుగం నడుస్తోంది. స్వతంత్ర సంస్థలన్నీ ధ్వంసమయ్యాయి'' అని ఆయన అన్నాడంటే... ఎంత మార్పులు వ్యవస్థలో వచ్చాయో అర్థం చేసుకోవాలి. ఈ రంగం స్వరూప స్వభావాలే మారిపోతున్నాయి. అధికార పక్షం ఆర్గాన్‌లు మారి, వారి ఎజెండా అడుగులకు మడుగులొత్తుతాయి. స్వతంత్ర గొంతుక మూయబడింది. ఇది వ్యక్తులకు జరిగే నష్టం కాదు. మొత్తం సమాజానికి కలిగేది.
ఇప్పుడిక ప్రజల గొంతులు ఛానెళ్లుకావాలి. పరి వ్యాప్తమయ్యే ఆధిపత్యాలపై ప్రశ్నలు ఎక్కుపెట్టాలి. ప్రశ్నించని వార్తకు పదునుండదు. నిజాయితీలేని మాటకు విలు వుండదు. సత్యం ధ్వనించని శబ్ధంలో శక్తి నిండదు. స్వేచ్ఛాక్షరాలు తమ దారిని తాము వెతుక్కుంటాయి. ముళ్లూ రాల్లూ ఎన్నున్నా ముందుకుపోయే అడుగులుంటాయి. కొనుగోళ్లకు లొంగని విలువలూ ఉంటాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

08:24 AM

పెరులో విరిగిపడి కొండచరియలు..15 మంది మృతి

08:14 AM

వనస్థలిపురంలో కారు బీభత్సం..తప్పిన ప్రమాదం...

08:04 AM

జ‌న‌గామలో ఘోర రోడ్డు పమ్రాదం..ముగ్గు‌రు మృతి

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.