Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
త్రిపురలో హింస | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

త్రిపురలో హింస

         త్రిపురలోని ఛరిలాంలో నవంబరు 30న సీపీఐ(ఎం) కార్యకర్తలు, నాయకులపై చెలరేగిన హింసాకాండ బీజేపీ బరితెగింపునకు, దాని క్రూరత్వానికి నిదర్శనం. నాలుగున్నరేండ్లగా తీవ్ర నిర్బంధం కొనసాగిస్తున్న ఆ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల కార్యాలయాలను బలవంతంగా మూసివేయించి రౌడీయిజం చలాయిస్తోంది. మహనీయడు లెనిన్‌ విగ్రహాల కూల్చివేతతో మొదలైన బీజేపీ హింసాత్మక పాలన ప్రజల ప్రాణాలను తోడేసేందుకు వెనుకాడటం లేదు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల ఎమ్మెల్యేలను, నేతలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి కృత్రిమ బలం సృష్టించుకొని ఆదివాసీ నేషనల్‌ పార్టీ ఆఫ్‌ త్రిపుర (ఐఎన్‌పిటి)తోనూ చేతులు కలిపి అత్యంత అప్రజాస్వామిక రీతుల్లో 2018లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సూది మొనంత అవినీతి మరక లేకుండా సుపరిపాలన అందిస్తున్న వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని అనైతిక పొత్తులతో దెబ్బతీసి నాటి నుంచి వినాశకర పాలన సాగిస్తోంది. ప్రతిపక్షాలను లక్ష్యంగా చివరకు దాని భాగస్వామ్య ఐఎన్‌పిటిని కూడా లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన అణిచివేత ధోరణలను కొనసాగిస్తూ వస్తోంది. రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించకుండా బెదిరింపులకు, దాడులకు తెగబడుతోంది. ప్రజాస్వామ్య నిరసనలకు, ప్రదర్శనలకు అనుమతించకుండా పోలీసు రాజ్యాన్ని సాగిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఛరిలాంలో బుధవారం చోటుచేసుకున్న దౌర్జన్యకాండ బీజేపీ దురాగతాలకు తాజా ఉదాహరణ.
నాలుగున్నరేండ్లలో దుర్మార్గ పాలన సాగిస్తున్న బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా విప్లవ్‌ దేవ్‌ను తొలగించి మానిక్‌ సాహాను గత మే నెలలో తీసుకొచ్చినా... కాషాయ పార్టీ పట్ల ప్రజాగ్రహం చల్లారడం లేదు. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ధరల పెరుగుదలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) ఇస్తున్న పిలుపులకు, ధరాఘాతం, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వామపక్షాల ప్రదర్శనలకు, సభలకు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. 2018 ఎన్నికల్లో తనకు పెద్ద మద్దతుదారుగా నిలిచిన ఐఎన్‌పిటి ప్రజల్లో ప్రాభవం కోల్పోయింది. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన నేతలు బీజేపీ అధినాయకత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తితో అక్కడ కొనసాగలేక ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో తమకు నూకలు చెల్లుతాయనే అంచనాతోనే బీజేపీ మారణకాండకు తెగబడుతోంది. ప్రజల్లో భయోత్పాతం సృష్టించి ప్రత్యర్థి పార్టీలను మానసికంగా దెబ్బతీస్తేనే తమ ఆగడాలు యథేచ్ఛగా సాగుతాయనే భ్రమలతో ఆ పార్టీ బరితెగింపులకు పాల్పడుతోంది. ఛరిలాంలో స్థానికంగా క్రియాశీలకంగా ఉండే షాహిద్‌ మియాను హత్య చేసిన తీరు, కార్యకర్తలపై మారణాయుధాలతో దాడులకు తెగబడిన వైనం, షాహిద్‌ మియా అంతిమ సంస్కారాలకు అనుమతి ఇవ్వకుండా పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించి, ఆయన కుటుంబ సభ్యులపైనా లాఠీఛార్జి చేయించి క్రౌర్యాన్ని ప్రదర్శించిన తీరు దారుణం.
కార్పొరేట్లకు ప్రజా సంపద దోచిపెడుతూ ప్రతిగా ఎన్నికల బాండ్ల రూపంలో అవి సమకూర్చుతున్న రూ.వేలాది కోట్లతో కొనుగోళ్లకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అధికారం కోసం మారణకాండకు కూడా వెనుకాడబోం అనే ఫాసిస్టు తరహా ప్రమాదకర సంకేతాలనిస్తోంది. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాలంటే ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులన్నీ ప్రతిఘటించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బీజేపీని అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని, శాంతిభద్రతలను పరిరక్షించుకోవడమే త్రిపుర ప్రజల ముందున్న ప్రథమ కర్తవ్యం. హింసోన్మాద బీజేపీని కట్టడి చేద్దాం రండి అంటూ వామపక్షాలు ఇస్తున్న పిలుపు సహేతుకమైనది. బీజేపీని ఒంటిరి పాటు చేసి ఓడిస్తేనే ప్రజలకు, దేశానికి రక్ష.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

10:52 AM

రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌..

10:25 AM

మరికొద్దిసేపట్లో తెలంగాణ బడ్జెట్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.