Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమానవీయం... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

అమానవీయం...

'తను పుండై... ఎందరికో పండై...' వేశ్యల జీవితాలను, వారి అందమైన కన్నుల వెనకున్న కన్నీటి పొరల యదార్థ జీవితగాథలను వివరిస్తూ అలిశెట్టి ప్రభాకర్‌ రాసిన కవితా వాక్కులివి. 'ఏ మహిళా కావాలని వ్యభిచారిగా మారదు.. ఏ ఒక్క అమ్మాయీ తనంతట తానుగా ఆ రొంపిలోకి దిగదు...' వేశ్యా వృత్తి గురించి రాసేటప్పుడు ఒక రచయిత పేర్కొన్న అంశాలివి. నిజమే మరి... మహిళ కూడా మనిషే, ఆమెకూ మనసుంటుంది. దానికీ మనస్సాక్షనేది ఒకటుంటుంది. కానీ కుటుంబ సమస్యలు, వాటిలోంచి వచ్చే ఆర్థికావసరాలు, భౌతిక పరిస్థితులు... వెరసి కొందరు మహిళలను 'ఆ కూపంలోకి' దించుతాయి. ఆయా బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొందరు మాఫియాగాళ్లు... వారిని వ్యభిచారంలోకి దింపి, ఆ స్త్రీల జీవితాలతో ఆటలాడుతూ... వారి శరీరాలతో వ్యాపారం చేస్తుంటారు. విశ్వనగరం హైదరాబాద్‌లో తాజాగా వెలుగు చూసిన అమానవీయ ఘటన ఆ కోవలోనిదే. ఒకరు కాదు, ఇద్దరు కాదు... పది మంది కాదు, వంద మంది కాదు, ఏకంగా 14,190 మందిని వ్యభిచారంలోకి లాగి వందల కోట్లు గడించారు కేటుగాళ్లు. ఉద్యోగం, ఉపాధి కోసం ఆశగా ఎదురు చూసే అభాగ్యురాళు... పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న అబలల బలహీనతలే ఈ దుర్మార్గులకు పెట్టుబడి. ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో ప్రతిదీ సరుకై పోయినట్టు ఆడవాళ్ల శరీరాన్ని కూడా వ్యాపారమయం చేసి పబ్బం గడుపుకుంటున్నారు ఈ నీచులు.
మన రాజధాని నగరంలో 17మందితో కూడిన ముఠా నిర్వహిస్తున్న భారీ సెక్స్‌రాకెట్‌ను యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో సైబరాబాద్‌ పోలీసులు ఛేదించిన దరిమిలా విస్తుగొలిపే వాస్తవాలు బయట కొచ్చాయి. ఈ రాకెట్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని రాష్ట్రం, దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి విస్తరించిందంటే ఆ ముఠా దందా ఎంత పెద్దదో విదితమవుతున్నది. ఇదే సమయంలో అమ్మాయిలతో ఆ గ్యాంగ్‌... డ్రగ్స్‌ను కూడా సరఫరా చేయించటం ద్వారా అది మరింత బరితెగిస్తూ తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగి స్తుండటం విస్తుగొలిపే అంశం. శరవేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని, దాన్ని వాడుకుని... ఈ ముఠా సాగిస్తున్న అరాచకం పరాకాష్ఠకు చేరింది.
ఇక్కడే మనం ఒక విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. అడుగడుగునా సీసీ కెమెరాలు, అత్యాధునిక నిఘా వ్యవస్థ, అంతర్జాతీయ స్థాయి కమాండెంట్‌ కంట్రోల్‌ రూమ్‌ అంటూ ఊదరగొట్టే మన ప్రభుత్వాధినేతలు... ఇప్పటిదాకా యథేచ్ఛగా సాగిన ఈ రాకెట్‌ గురించి ఏం చెబుతారు..? ఇన్నేండ్ల నుంచి ఈ వ్యవహారం కొనసాగు తున్నప్పటికీ అది బయటకు రాకుండా అడ్డుకున్నది ఎవరు..? రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి ఈ వ్యాపారం అంతర్జాతీయ స్థాయికి విస్తరించే దాకా మన సర్కారు ఏం చేస్తోంది..? ఇతర దేశాల యువతులను సైతం ఇక్కడకు రప్పించి... పడుపు వృత్తిలోకి దింపుతుంటే మన ఇంటిలిజెన్స్‌ విభాగం వారు కండ్లు మూసుకుని ఎందుక్కూర్చున్నారు..? ఇవన్నీ ఇప్పుడు శేష ప్రశ్నలుగా మిగిలాయి. ప్రభుత్వంలోని వారు, ఉన్నతాధికారులు వీటికి కచ్చితంగా సమాధానాలు చెప్పాలి.
ఏదేమైనా ఇంత పెద్ద రాకెట్‌కు సంబంధించిన గుట్టును రట్టు చేసి, వేలాది మంది యువతుల చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన పోలీసులకు అభినందనలు తెలుపుతూనే... ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సర్కారు చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్‌ చేయాలి. అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించాలి. అమ్మాయిల ద్వారా నిర్వహిస్తున్న డ్రగ్స్‌ అమ్మకాలను, వినియోగాన్ని నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలి. మహిళా, యువజన సంఘాలు ఇందుకోసం నడుం బిగించాలి. పౌర సమాజం స్పందించాలి. పాఠశాల స్థాయి నుంచే ఆయా అంశాలపై విద్యార్థులకు చైతన్యం కలిగించాలి. కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా ప్రజల్ని, యువతీ యువకుల్ని భాగస్వాములను చేయటం ద్వారా అలాంటి దందాలకు అడ్డుకట్ట వేయాలి. మత్తు పదార్థాల నుంచి యువతను దూరం చేసేందుకు వీలుగా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేరళ ప్రభుత్వాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. లేదంటే షరా మామూలుగా పేపర్లలో నాలుగు రోజులపాటు వార్తలు, ఛానళ్లలో ఓ వారంపాటు బ్రేకింగ్‌ న్యూస్‌లు, స్పెషల్‌ స్టోరీలు వస్తాయి తప్ప మనం ఆశించిన ప్రయోజనం ఒనగూరదు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. అందుకే పౌర సమాజమా... బహుపరాక్‌.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సారాయే కాదు.. సీసా కూడా పాతదే...
సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు

తాజా వార్తలు

07:49 AM

జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

07:35 AM

మార్చి 30న భద్రాద్రి సీతారాముల కల్యాణం

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.