Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రమాదకరంగా వాణిజ్యలోటు... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

ప్రమాదకరంగా వాణిజ్యలోటు...

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం ఎగుమతులను దెబ్బతీస్తుందన్న నిపుణుల హెచ్చరికలు నిజమని రుజువవుతున్నాయి. దేశ వాణిజ్యలోటు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌ నుండి ఎగుమతులు భారీగా పడిపోవడం, మరోవైపు దిగుమతులు పెరగడంతో లోటు ఎగిసి పడుతోంది. అక్టోబర్‌నెలలో సరుకుల ఎగుమతులు 16.65శాతం పతనమై 29.75బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వశాఖ ఇటీవలే వెల్లడించింది. దిగుమతులు 5.7శాతం పెరిగి 56.69 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఈ పరిణామాలతో ప్రస్తుతం భారత వాణిజ్య లోటు 26.91 బిలియన్‌ డాలర్లకు (రూ.2.17 లక్షల కోట్లు) ఎగిసింది. వజ్రాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, రెడీమేడ్‌ దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, తోలు ఉత్పత్తుల వంటివాటి ఎగుమతులు తగ్గిపోయాయి. అంతర్జాతీయ విపణిలో మనం చేసే ప్రధానమైన ఉత్పత్తుల ఎగుమతిలోనే అంత తరుగుదల రావడం ప్రమాదకర సంకేతం. మరోవైపున ఎప్పటికన్నా ఎక్కువగా చమురు దిగుమతి జరిగింది. అంతకుముందు నెలతో పోల్చితే ఏకంగా 29.1శాతం పెరిగిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ వాణిజ్యం కుదించుకుపోతుందనే ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో భారత్‌ ఎగుమతి దిగుమతుల విషయంలో మరింత జాగరూకత అవసరం.
గడచిన మూడు నాలుగు నెలలుగా రూపాయి విలువ పడిపోతూనే ఉంది. రూపాయి చరిత్రలోనే అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో అత్యంత కనిష్టంగా డాలర్‌తో రూపాయి మారకంలో 83.20కి క్షీణించింది. అయితే తరువాత బలపడుతుందని ఊరడింపులు చేస్తున్నా ఆ జాడలేం కనుచూపుమేరలో అగుపించడంలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ఉక్రెయిన్‌ యుద్ధం అనంతరం ఒపెక్‌ దేశాలు చమురు వెలికితీతకు కోతలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల్లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. మన దేశ అవసరాల్లో 80శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నాం. చమురు ధరలు అమాంతం పెరిగిపోతే ఇంధన వ్యయం, రవాణా ఖర్చు పెరిగి, అన్నిటి ధరలూ ఆకాశానికి ఎగబాకుతాయి. కోవిడ్‌ నేపథ్యంలో ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన ప్రజలకు కష్టాలు మరింత పెరుగుతాయి. ఇంకోవైపున ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న పేరుతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. అందువల్ల గృహ నిర్మాణానికో లేక ఇతర అవసరాలకో బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారికి పెను భారమవుతుంది. విదేశీ వాణిజ్యలోటు పెరగడంతోపాటు ఖజానాకు ద్రవ్యలోటు కూడా పెరుగుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతోందని, మరోవైపు అమెరికా, ఐరోపా బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ఈ దేశంలోని పెట్టుబడులు మరింతగా వెనక్కు తీసుకుపోతారు. సెప్టెంబర్‌ నెలలోనే విదేశీ సంస్థాగత పెట్టుబడులు 700కోట్ల డాలర్లకు పైగా ఇతర దేశాలకు వెళ్లిపోయాయి. ఆ వేగం ఇంకా పెరగవచ్చు. రూపాయి మరింతగా బలహీనపడు తుందన్నది విశ్లేషకుల మాట. ఏ దేశంలోనైనా కరెన్సీ విలువ తరగడం, ద్రవ్యోల్బణం పెరగడం జరిగితే అక్కడ విదేశీ పెట్టుబడులు నిలవవని ప్రపంచ అనుభవం చెబుతోంది. కాబట్టి ఇదో విష చక్రం. పర్యవసానంగా రూపాయి విలువ మరింత దిగజారడం, దేశంలో ధరలు పైపైకి పెరగడానికే దారి తీస్తుంది. ఈ దుస్థితి మారాలంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారాలి. దేశీయ ఉత్పత్తి పెరగడంతోపాటు ఆ సరుకుల్ని వినిమయం చేసేంతగా ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అంతర్గత ఆర్థికాభివృద్ధి కీలకం. అందుకు అనువైన ఆర్థిక విధానాలను ప్రభుత్వాలు అమలు చేయాలి. కాని, మోడీ ప్రభుత్వం తనంతట తాను అందుకు పూనుకోదు కనుక ప్రజా ఉద్యమాలతో ఒత్తిడి తీసుకురావాలి. అదే మన ముందున్న మార్గం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సినీ ఘనుల నిష్క్రమణ
నాలుగో స్తంభాన్ని కూలిపోనివ్వొద్దు...
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!
శుష్క వాగ్దానాలు.. శూన్య హస్తాలు...
దీపశిఖలు
నేరస్తులకు స్వేచ్ఛ!
ఓ మహాత్మా!
బీబీసీ వర్సెస్‌ బీజేపీ
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల యుద్ధటాంకులు!
దేవుడి పగేనా?!
ఈ సారైనా మొండి చేయి చూపరుగా..?
అసహన మేఘాల్లో..!
మల్ల యుద్ధ మహిళ
నెత్తుటి చారికలు
''విప్లవాల'' సీజన్‌లో
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!
'నేర' నేతలు
ఎంతో చేసుంటే ఇంతాయాసమెందుకు?
మేల్కొనే పండుగ
ప్రాయోజిత గవర్నర్లు
అమెరికా పావుగా జపాన్‌
కావాల్సింది అంకుశాలే...
వైజ్ఞానిక అద్భుతాలు సాకారమయ్యేనా?
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య
చీకటి తలపు
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?
అమెరికా స్పీకర్‌ ఎన్నిక - ఫాసిస్టు శక్తుల ముప్పు!
ఆ జారు ఎందుకు కదులుతున్నది..?
'చట్ట'బండలు
మోడీ ''ప్రతిభ''

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.