Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'చట్ట'బండలు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 04,2023

'చట్ట'బండలు

         'స్వేచ్ఛాఫలాలు సామాన్యులకూ అందాలి... అన్నింట్లో అందరికీ సమానావకాశాలు దక్కాలి... స్వతంత్ర భారతం సుసంపన్న, ప్రజాస్వామ్య, పురోగామి దేశం కావాలి!' తొలి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో తొలి ప్రధాని నెహ్రూ అభిలాష ఇది. అటువంటి భారతావని కోసం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రాజ్యాంగ ప్రవేశికలోనే ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలని కాంక్షించారు. రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్‌లో సామాజిక న్యాయ స్ఫూర్తి అంతర్లీనంగా ఉంటుంది. రాజ్యాంగంలోని 38(1)వ అధికరణం ప్రజలందరి సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకొని న్యాయబద్ధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను నెలకొల్పాలని చెబుతోంది. చట్టం అందరికీ సమానమే అని రాజ్యాంగం ఘోషిస్తోంది. సామాజికంగా అందరూ సమానం అని చెబుతూ..17వ అధికరణతో అంటరానితనాన్ని నిషేధించింది. ఆర్థిక న్యాయం అందాలనే 24వ అధికరణతో వెట్టి చాకిరిని నిషేధించింది. రాజకీయాల్లో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొంటేనే రాజకీయ న్యాయం సాధించినట్లు. అందుకే ఏ వ్యక్తీ రాజకీయ హక్కుల వినియోగంలో ఎలాంటి మత, జాతి, లింగ వివక్షకు గురికాకూడదని 325వ అధికరణాన్ని పొందుపరిచారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లల్లో.. చట్టాల అమలు మాత్రం చట్టబండలే అన్న విషయాన్ని ప్రపంచ చట్టబద్ధ పాలనా సూచీ (ఆర్‌ఓఎల్‌ఐ) -2022 కూడా ఇప్పుడు స్పష్టం చేస్తోంది.
నిరంకుశ అధికారాలకు తావివ్వని భారత రాజ్యాంగం 'పాలన చట్టబద్ధం'గా సాగాలని నిర్దేశిస్తోంది. కానీ, కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తున్న పెద్దలు 'చట్టబద్ధ పాలన'ను ఎండమావిగా మార్చేశారన్న చేదువాస్తవానికి ఈ సూచీ తాజా ఉదాహరణ. ప్రభుత్వాధికారాలకు పరిమితులు, ప్రాథమిక హక్కులు, అందిరికి న్యాయం, అవినీతి లేని పాలన వంటి ఎనిమిది ప్రధానాంశాల ప్రాతిపదికన 140 దేశాల్లో మన దేశానికి 77వ స్థానం దక్కింది. వివక్షకు అతీతంగా అందరూ సమానమే అన్న విషయంలో నైతే భారత్‌ది 117వ స్థానం. అంటే దేశంలో వివక్షత ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. కుల, మత, ప్రాంతీయ వివక్షత 'ఇందు కలదు అందు లేదు' అన్న చందంగా అన్ని రంగాల్లో కొనసాగుతోంది. అసలు దానిని పాలు పోసి మరీ సాదుతున్నది పాలకులే. ఆర్‌ఓఎల్‌ఐలో ఇండియాను మెరుగైన స్థానంలో నిలిపేందుకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటుచేసినట్టు కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. అదే నిజమైతే దానిని కచ్చితంగా స్వాగతించాల్సిందే. ఆ సంఘం పని చేసి ఉంటే ఫలితాలు ఇంత ఘోరంగా ఎందుకుంటాయన్న ప్రశ్నను కూడా తట్టుకునే స్థితిలో కేంద్రప్రభుత్వం లేదు. మరి చట్టబద్ధ పాలనా దీపాన్ని దేశవ్యాప్తంగా కొండెక్కిస్తోందెవరు? దేశవ్యాప్తంగా అధికారం చలాయించేందుకు పాకులాడుతున్నదెవరు?
కార్మిక చట్టాల అమలు విషయంలో ఈ దేశానిది 119 స్థానమంటే పాలకులకు కార్మికులపై ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశంలో బాల్యవివాహాల నిరోధం మొదలు లైంగిక దాడుల నియంత్రణ దాకా చట్టాలకేమీ కొదవలేదు. అమలులోనే అసలు పేచీ అంతా. తరాలు గడుస్తున్నా సామాజిక దురాచారాలు అలాగే కొనసాగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో దేశానికి తలవంపులు తెచ్చిపెడుతున్న జుగుప్సాకర నేరాలూ అంతకంతకూ పెరుగుతూ దేశం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. అదే సమయంలో పాలనలో పారదర్శకతకు ఊపిరైన సమాచారహక్కు చట్టం సైతం నీరుగారిపోతోంది. ప్రజలకు జవాబు దారీగా మెలగాల్సిన ప్రభుత్వాలు చీకటి విధానాలను అపరి మితంగా పెంచిపోషిస్తున్నాయి. అధికారపక్షాల సొంత సేనలుగా రాజ్యాంగ సంస్థలు మారి పౌరహక్కులను కబళిస్తున్నాయి.
సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలన్నిటిపైనా రాజకీయ క్రీనీడలు దట్టంగా అలుముకుంటున్నాయి. రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రత, నిష్పాక్షికతలు ప్రశ్నార్థకాలవుతున్న వాతావరణం నేడు దేశమంతటినీ ఆవహిస్తోంది. తత్‌ ఫలితంగా రాజ్యాంగ సంస్థలపై కూడా ప్రజల విశ్వాసం అడుగంటిపోతోంది. చట్టం, ధర్మం అన్న మాటలకు ఉద్దేశపూర్వకంగానే తిలోదాకాలిస్తున్న నాయకులు సర్వత్రా అధర్మానికే అగ్రతాంబూలమిస్తున్నారు. డబ్బూ, అధికారమే పరమావధిగా రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్న నేతలు ఎన్నికల వ్యవస్థలను కూడా అపహస్యం చేస్తున్నారు. అవినీతి అక్రమాలు వేయిపడగలతో బుసలుకొడుతుంటే చట్టబద్ధ పాలన సాధ్యమేనా? అన్న ప్రశ్న సర్వత్రా వేధిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.