Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా? | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 07,2023

ప్రజల బుర్రలను మ్యూట్‌లో పెట్టగలరా?

            అదేమిటో..! మాట్లాడుకోవడానికి ఏ సమస్యలూ లేనట్టూ మనం మతాల గురించీ, మందిరాల గురించీ, దేవుళ్ల గురించీ, వారి పుట్టుకల గురించీ మాట్లాడుకుంటున్నాం... కాదు కాదు పోట్లాడుకుంటున్నాం. ప్రతిరోజూ, ప్రతిచోటా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే తంతు..! మైండ్‌ను మ్యూట్‌లో పెట్టి ట్రెండ్‌ను ఫాలో అవడమంటే ఇదేనేమో..!! ఇందుకు మన తెలంగాణమూ మినహాయింపు కాదని ఇటీవలి కొన్ని పరిణామాలు తెలియజేస్తున్నాయి.
త్రిపురలో కమ్యూనిస్టుల మీద, కాంగ్రెస్‌ మీద వీరంగమాడుతూ... ''2024 జనవరి 1 కల్లా అయోధ్యలో రామాలయం సిద్ధమవుతోంది జాగ్రత్త'' అంటూ ఓ హెచ్చరికలాంటి వ్యాఖ్య చేశారు అమిత్‌షా! అంతేనా... ఆలయ ప్రారంభం తరువాత అక్కడి నుండే తమ ప్రధాని ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని కూడా సెలవిచ్చా రాయన. ఓ ఎన్నికల ర్యాలీలో ప్రజల సమస్యల గురించో, ప్రభుత్వ విధానాల గురించో మాట్లాడకుండా ఆయన ఈ వ్యాఖ్యలకు పాల్పడటం దేనికి సూచిక బహుశా రాహుల్‌ గాంధీకీ ఆచార్య సత్యేంద్ర దాస్‌ అందించిన ఆశీస్సులు వారిని కలవరపరుస్తున్నట్లున్నాయి! ఎందుకంటే ఆచార్య సత్యేంద్ర దాస్‌ స్వయాన అయోధ్య రామమందిర ప్రధాన అర్చకులు మరి. ''భారత్‌ జోడో యాత్ర'' ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించిన సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకున్నది. ''ప్రజలందరి క్షేమం - ప్రజలందరి సౌఖ్యం కోసం మీరు తలపెట్టిన ఈ యాత్రకు రామచంద్రుని కృపాకటాక్షాలతో శుభం కాలుగాక'' అని ఆయన రాహుల్‌ను అభినందించి ఆశీర్వదించారు. సహజంగానే ఇది ''పరివారానికి'' మింగుడుపడని అంశం. స్వయంగా రామమందిర ప్రధాన పూజారి ఈ యాత్ర దేశం కోసం, ప్రజల కోసం అని ధృవీకరించడం, పైగా ఈ ''పరివారం'' తమ హక్కుగా భావిస్తున్న రాముడి కృపను రాహుల్‌కు ప్రసాదించడం సాధారణ విషయమేం కాదు. అందుకే ఈ నష్టనివారణ వ్యాఖ్యలు కాబోలు..!
ఎప్పుడైనా ఎక్కడైనా తమ ఎన్నికల ప్రచారానికి మందిరాలు, మత సమీకరణలే అజెండా తప్ప, ప్రజల జీవితాలు కాదని ఈ వ్యాఖ్యలు మరోసారి రుజువు చేస్తున్నాయి. ఎనిమిదిన్నరేండ్లుగా తమది తిరుగులేని పాలన అని విర్రవీగు తున్న వీరు, ఇంకా ఓట్ల కోసం రాముడి మీదే ఆధారపడకతప్పని బలహీనతను సైతం ఇది సూచిస్తున్నది. ప్రజల మనసులు గెలవడానికి వీరు ఇంకా రాముడి పైనే ఆధారపడటం వైచిత్రి! కాంగ్రెస్‌ సహా ఇతర బూర్జువా ప్రతిపక్ష పార్టీలేవీ వీరి విధానాలకు నికరమైన ప్రత్యామ్నాయాలు నిర్మించకపోగా, ఓ సైద్ధాంతిక భూమిక అంటూ లేకుండా తాము కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా ప్రజా సమస్యలేవీ అసలు అజెండాలోకే రాకుండాపోయి మత రాజకీయాలే దేశాన్ని ఆవహిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో కూడా కొందరి వ్యాఖ్యానాలు చర్చనీయాంశం కావడం గమనార్హం. సమకాలీన వాస్తవికతను గుర్తించకుండా చేసే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా అది మతోన్మాదులకే ప్రయోజనమన్న సంగతి విస్మరించకూడదు.
సమస్త ప్రజల జీవితాలు సమస్యలతో సంక్షోభంలో కొట్టుమిట్టాడు తుండగా, దేవుళ్లు, మతాల గురించిన వాదనలు ఎవరికి ఉపయోగపడతాయో తెలుసుకుని మెళుకువతో వ్యవహరించాలి. అందువల్ల కేవలం తెలిసింది మాత్రమే మాట్లాడితే సరిపోదు. తెలివితో మాట్లాడటం కూడా తెలియాలి. మనం ఏం కొనాలో ఎలా బతకాలో మార్కెట్‌ నిర్ణయిస్తున్నట్టే, ఏం మాట్లాడాలో ఏం మరిచిపోవాలో ఈ మత రాజకీయం నిర్దేశిస్తున్నది. నేడు మన ప్రతి కదలికా వెనుక నుండి ఎవరో తోస్తున్నదేనన్న ఎరుకలో ఉండాలి. ఇప్పుడు దేశంలో 65కోట్ల మంది భారతీయులు 25ఏండ్లలోపు వారు. వీరి చైతన్యం, కార్యాచరణలను నిర్వీర్యం చేయడమేకాదు, ఈ యువతరం విద్యా ఉపాధి అవకాశాల గురించి ఏమాత్రం పట్టించుకోని ఈ ప్రభుత్వం, లక్షల కోట్ల ప్రజాధనాన్ని తన సంపన్న మిత్రులకు అప్పనంగా వడ్డిస్తోంది. కేవలం ఈ నాలుగేండ్లలోనే ఈ కార్పొరేట్ల కోసం బ్యాంకులు వదిలేసుకున్న భారీ సొమ్ము అక్షరాల పది లక్షల కోట్లకు పై మాటే! మోడీ సర్కార్‌ తన స్నేహితులకు కానుకగా ఇచ్చిన ఈ సొమ్ముతో ఎన్ని పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మాణమయ్యేవో కదా..! దీని గురించి మాట్లాడాలి.
వైద్యం ఎందుకు ఖరీదయిందో, చదువులు ఎందుకు భారమవు తున్నాయో అడగాలి. అధికారంలోకొస్తే ప్రతి అకౌంట్‌లో పదిహేను లక్షలు వేస్తామన్న వాగ్దానం ఏమయిందో, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమయిందో నిగ్గదీయాలి. చాలీచాలని జీతాలతో రోజుకు 12గంటలకు పైగా ఏ హక్కులూ లేకుండా పనిచేస్తున్న అసంఖ్యాకమైన జీవితాల గురించి ప్రశ్నించాలి. మతమౌఢ్యం సమాజాన్ని చీకట్లోకి నెడుతున్న వేళ... వెలుతురులోకి లాగే ఉక్కు పిడికిళ్లు కావాలి ప్పుడు. దేశమంతా అబద్దాల ఊబిలో కూరుకుపోతున్న వేళ... అవసరమైన నిజాలను ప్రజలకు వినిపించే బలమైన గొంతులు కావాలిప్పుడు...

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

06:57 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్ విడుద‌ల‌..

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.