Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చీకటి తలపు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 08,2023

చీకటి తలపు

         భిన్న అభిప్రాయాలు, భిన్నమైన నమ్మకాలు, విభిన్నమైన సంప్రదాయాల సమ్మేళన స్థలి భారతదేశం. ఎవరి అభిప్రాయాన్నయినా వ్యక్తపరచుకునేందుకు హక్కును కలిపిస్తున్న రాజ్యాంగమున్న దేశం మనది. అందుకే ఈ దేశ పౌరులంగా మన మంతా గర్వపడతాం. దేశాన్ని ప్రేమిస్తాం. భారతీయులందరినీ సహౌదరులుగా భావిస్తాం. కలిసి నడిచేందుకు ప్రతిజ్ఞ చేస్తాం. బహువిధమైన వారసత్వానికి ఆనందపడతాం. మరిప్పుడు ఏమైందీ ఆలోచనలకు? కారుమబ్బులేవో కమ్మేస్తున్నాయి క్రమంగా... చీకటి తలుపులేవో తెరుచుకుంటున్నాయి! భిన్న అభిప్రాయాలపై దౌర్జన్య కోరలేవో దాడులకు తెగబడుతున్నాయి. ఆలోచనల్లో అంధత్వం తాండవిస్తోంది. సహన పూరిత సహజీవన దృశ్యం అదృశ్యమవుతోంది. డెబ్బయి ఐదేండ్లుగా నిలుపుకున్న విలువలు నిలువునా ధ్వంసమవుతున్న చిత్రం ప్రత్యక్షమవుతోంది.
వాళ్లు వేటినీ వొదలటం లేదు. రాజ్యాంగపు విలువలనే కాలరాస్తున్నారు. విద్యను కాషాయీకరించటమే కాదు, విద్యార్థులనూ, అధ్యాపకులనూ మార్చేందుకు బలప్రయోగాలనూ ఉపయోగిస్తున్నారు. విద్యార్థులను శాస్త్రీయ ఆలోచనాపరులుగా తీర్చిదిద్దడం, వారిలో ప్రశ్నించే తత్వాన్ని పురికొల్పడం ఉపాధ్యాయుల విధి. అలాంటి వారితో ప్రశ్నించడం నేరమని క్షమాపణలు చెప్పించడం ఎంత ఘోరమైన సంఘటన. ఇది సాక్షాత్తు మన చైతన్య యుతమైన తెలంగాణ నేలపై జరగడం బాధాకరమైన విషయం. నిజామాబాద్‌జిల్లాలో గణపతి ఉత్సవాలకు చందా ఇవ్వలేదని, దేవుడిపైన నమ్మకం లేదన్న కసితో పాఠశాల ఉపాధ్యాయుడిపై కక్షగట్టింది అక్కడి మతతత్వం. బలవంతంగా ఆ గురువును గుడిలోకి తీసుకెళ్లి క్షమాపణలు చెప్పించటం గమనిస్తే, మన విద్యా వ్యవస్థలోకి మూఢత్వ విద్వేషం ఎలా దూసుకొస్తుందో తేటతెల్లమవుతోంది. ఇది కేవలం ఒక సంఘటనగానే అర్థం చేసుకోలేము. రాబోయే కాలంలో విజ్ఞానానికి, స్వేచ్ఛకు, విద్యార్థులకు, విద్యా వికాసానికి ఎన్ని అడ్డంకులు రానున్నాయో తెలిపే సూచిక ఇది. అంతే కాదు, ప్రశ్నించడం మీద దాడి జరుగుతున్నప్పుడు, తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకోలేనప్పుడు, లౌకిక విలువలను తుంగలో తొక్కుతున్నప్పుడు, మన రాజ్యాంగం నిర్వీర్యమైపోతున్నదన్న విషయం మనకర్థం కావాలి.
దేవుడిపై విశ్వాసము ఉండటానికి మనకెంత హక్కువుందో, విశ్వాసములేకుండా ఉండటానికీ అంతే హక్కువుంటుంది. ఈ విషయం అనేకమార్లు కోర్టులు కూడా పేర్కొన్నాయి. గత సంవత్సరంలో మద్రాస్‌ హైకోర్టు స్పష్టంగానే ప్రకటించింది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను ఎవరూ హరించలేరని తెలిపింది. తమిళనాడులో అనేక చోట్ల నెలకొల్పిన రామస్వామి విగ్రహాల కింద 'దేవుడులేడు' అని చెక్కి ఉండటం తమ మనోభావాల్ని దెబ్బతీస్తోందని, దేవుడు సర్వాతర్యామి అని భావించే వారంతా ఇబ్బంది పడుతున్నారని ఒక వ్యక్తి వేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టేసింది కూడా. 'దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్లే, దేవుడు లేడని చెప్పే హక్కూ ఉంటుంది. దీన్ని రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం భావప్రకటనకు అందరూ తమకు నచ్చినట్లు చేయవచ్చు' అని చెప్పిన విషయాన్ని ఈ మహాభక్త శిఖామణులు గ్రహించాలి. ఈ దేశంలో పూజలు, ఆరాధనలు చేస్తే వారు అనాదిగావున్నారు. వేరు వేరు సంప్రదాయాలలో వారి భక్తినీ కొనసాగిస్తూవున్నారు. కానీ ఇప్పుడు దేవుడి పేరిట, పూజల పేరిట, మతం పేరిట ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడం, ఉన్మాదంగా వ్యవహరించడం అనేది రాజకీయంగా లబ్దిపొందేందుకు నేడు రెచ్చగొట్టబడుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. బడి అంటే సమాజానికి సూక్ష్మరూపం. అన్ని మతాలు, కులాలు, ప్రాంతాల విభేదాలకతీతంగా విజ్ఞానం వెల్లివిరియాల్సిన ప్రదేశం. అందులో గురువు మార్గదర్శి. బోధన అభ్యసనాల పరిమళమే తప్ప మత భావనలకు తావుండరాదు. వాటిని కలుషితం చేయాలని పూనుకోవడాన్ని నిరోధించాలి. ఈ సందర్భంగా మన శాస్త్రవేత్త నోబుల్‌ బహుమతి గ్రహీత సి.వి.రామన్‌ చెప్పినమాటలు గుర్తుచేసుకోవాలి. ''నేడు భారతదేశం అజ్ఞానం, మత ఛాందసం, మతోన్మాదాల అగాధంలోనూ, అన్ని రకాల జడ పదార్థాల పూజల లోనూ మునిగిపోయి ఉంది. ఈ గందరగోళ పరిస్థితి నుంచి దేశాన్ని ఏ శక్తి బయటపడేయ గలదు? మన జీవితంలో ఇబ్బంది పెడుతున్న సమస్య లన్నింటినీ ఒక్క దెబ్బతో ఏ శక్తి పరిష్కరించగలదు? దీనికి ఒకే ఒక్క సమాధానం... అదే విజ్ఞాన శాస్త్రం'' అని ఆయన చెప్పిన సత్యవాక్కులు వీరి చెవికి ఎక్కుతాయా! విజ్ఞానం వికసించడానికి కావాల్సిన స్వేచ్ఛా వాతావరణాన్ని తీసివేసి, విశ్వాసాల ఆధారంగా ప్రగతిని సాధించలేమనే విషయం బోధపడేదెప్పుడు!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.