Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 10,2023

విదేశీ గుప్పెట్లో ఉన్నత విద్య

నూతన విద్యా విధానం ఎంతటి ప్రమాదకరమైనదో విదేశీ విశ్వవిద్యాలయాలను భారత్‌లోకి ఆహ్వానిస్తూ మోడీ సర్కార్‌ ఇటీవల విడుదల చేసిన ముసాయిదా పత్రం మరోసారి తేటతెల్లం చేసింది. అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు ఫీజులు, అడ్మిషన్లపై నియంత్రణ ఎత్తివేస్తున్నాం రండహౌ అంటూ విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం (యుజిసి) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉన్నత విద్యను విదేశీ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు వాస్తవానికి 1990 నుంచే మొదలయ్యాయి. విదేశీ విశ్వవిద్యాలయాలను భారత్‌లోకి ఆహ్వానించేందుకు సంబంధించిన బిల్లు 1995లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన తొలిసారే విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కిపోయింది. 2005-06లోనూ ప్రయత్నాలు జరగ్గా కేబినెట్‌ దశలోనే ఉపసంహరించు కోవాల్సివచ్చింది. ఆ తర్వాత యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నమే జరిగితే వామపక్షాలు తిప్పికొట్టాయి. విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాన్ని అప్పట్లో బీజేపీకి కూడా వ్యతిరేకించింది. ఇప్పుడు అదే బీజేపీ విదేశీ విశ్వవిద్యాలయాలకు ఎర్ర తివాచి పరిచి స్వాగతిస్తుండటం దాని ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ మొదలుకొని ఫీజులు ప్రతిదీ మీ ఇష్టం మీరు ఎలా చెబితే అలా... అంటూ అపరిమిత స్వేచ్ఛ కల్పిస్తామంటోంది. అంతేకాదు ఇక్కడ ఆర్జించిన మొత్తాన్ని మొత్తం మీరు తీసుకెళ్లిపోవచ్చు అంటూ మోడీ సర్కార్‌ బంపర్‌ బోనాంజా ఆఫర్‌ ప్రకటించింది. ఇది దేశంలోని ఉన్నత విద్యను మొత్తం విదేశీ కార్పొరేట్‌ శక్తుల గుప్పెట్లో పెట్టడం తప్ప మరొకటి కాదు. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక సంస్థలనే ఆహ్వానిస్తున్నామని ఇప్పుడు చెబుతున్నా..వాస్తవంలో ఇక్కడి విద్యారంగాన్ని దండుకునేందుకు విదేశీ విద్యా సంస్థలు గద్దల్లా వాలిపోవడం ఖాయం.
శస్త్ర చికిత్సలకు, టెస్ట్‌ట్యూబ్‌ బేబీలకు, క్లోనింగ్‌ ఇలా ప్రతిదానికీ మనమే ఆద్యులమని, భారత్‌ విశ్వగురు అని ఇతిహాసాలను శాస్త్రీయ పరిణా మాలుగా పేర్కొంటూ మూఢత్వాన్ని ప్రజల్లోకి చొప్పించే మోడీ సర్కార్‌... ఇప్పుడు అదే 'విశ్వగురు'కు విదేశీ విశ్వవిద్యాలయాల అవసరమేమొచ్చిందో చెప్పాలి. ఒకే దేశం... ఒకే కార్డు, ఒకే దేశం ఒకే భాష, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థను ఏకీకృత నియంత్రత్వంపై లాక్కెళ్తున్న మోడీ సర్కార్‌కు మరో వైపు లార్డ్‌ మెకాలే తరహాలో విదేశీ విద్యపై మమకారం పుట్టుకురావడంలో ఆంతర్య మేమిటో!
దేశ నిర్మాణంలో విద్య ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ చదువు వరకూ మనదేశంలో పరిస్థితులకు అనుగుణంగా సాగాల్సిందే. భారత్‌ లాంటి దేశాల్లో సాంఘిక శాస్త్రాలే కాకుండా జీవశాస్త్రం, ఇంజనీరింగ్‌ వంటి సైన్స్‌ చదువులు సైతం స్థానిక జీవన పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, అప్పుడే ఫలితాలు దక్కుతాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త జెడి బెర్నాల్డ్‌ విద్యా ప్రపంచీకరణ తొలినాళ్లలోనే సెలవిచ్చారు. విదేశీ విశ్వవిద్యాలయాలు భారత పరిస్థితులకు పొసగవని విద్యారంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు.
అటువంటి వైవిధ్యమైన పరిస్థితులున్న భారతావనిలో విదేశీ విద్యాసంస్థలకు ఎర్ర తివాచి పరిచి ఎటువంటి నియంత్రణలు లేకుండా ప్రవేశాల ప్రక్రియ, ఫీజులు వాటి ఇష్టానికి వదిలేస్తే దేశంలో ఉన్నత విద్యారంగం విదేశీ శక్తుల పరం చేయడమే అవుతుంది. విద్యా కాషాయీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ మూడు లక్ష్యాలతో నూతన విద్యా విధానాన్ని మోడీ సర్కార్‌ బలవంతంగా రుద్దుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు తెరపైకి విదేశీ విశ్వవిద్యాలయాలను తీసుకొస్తోంది. ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి పరిశోధనలకు, అధ్యయనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు దులిపేసుకునేందుకే ఈ 'విదేశీ విశ్వవిద్యాలయాలు' పేరుతో పన్నాగానికి పాల్పడుతోంది. దేశంలోని చాలా సామాజిక తరగతులకు ఉన్నత విద్య ఇప్పటికీ ఎండమావిగానే ఉంటోంది. అణగారిన, ఆదివాసీ తరగతుల్లో ఇప్పుడిప్పుడే తొలి తరం విశ్వవిద్యాలయాల మెట్లు ఎక్కుతోంది. ఈ దశలో విద్యా కార్పొరేటీకరణతో విదేశీ శక్తుల గుప్పిట్లోకి విద్యా వ్యవస్థ వెళ్లిపోతే సామాన్యులకు ఉన్నత విద్య పగటికలగా మిగిలిపోతోంది. ఇప్పటికే విద్యారంగంలో ఉన్న అసమానతలను మరింత పెంచే ఈ విధానాన్ని, దీనికి మూలమైన నూతన విద్యా విధానాన్ని ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.