Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కావాల్సింది అంకుశాలే... | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 12,2023

కావాల్సింది అంకుశాలే...

ఇప్పుడు వాతావరణ రీత్యా శీతాకాలం నడుస్తోంది. దాంతోపాటు బడ్జెట్ల కాలం ముందుకొస్తున్నది. ఈ సీజన్‌ ఇటు రాజకీయ పరంగా.. అటు ఆర్థిక పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకం. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు ఎంత బలంగా ఉంటే కేంద్రం అంత బలంగా ఉంటుందంటూ మన పెద్దలు ఏనాటి నుంచో చెబుతూ వస్తున్నారు. కానీ నేటి మోడీ సర్కారు ఆ వాస్తవాన్ని విస్మరించి రాష్ట్రాలను బిచ్చగాళ్ల కంటే హీనంగా చూస్తూ అడుక్కు తినేలా చేస్తోంది. నిధుల విషయంలో అనేక కొర్రీలు వేస్తూ ఆర్థికంగా ఇబ్బందుల పాల్జేస్తున్నది. తెలంగాణ విషయంలోనూ ఇదే తంతు నడుస్తున్నది. గత ఎనిమిదిన్నరేండ్లుగా రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్‌, బడ్జెటేతర నిధులు, గ్రాంట్లు, వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలకు ప్యాకేజీలు, ఇతర ఆర్థిక సాయాల విషయంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదంటూ పలువురు మంత్రులు ఆవేదన వ్యక్తం చేయటం సత్యదూరమేమీ కాదు. నిధుల విషయంలో తెలంగాణ పట్ల మోడీ సర్కారు కొనసాగిస్తున్న వివక్ష ఇటీవల మరింత పరాకాష్టకు చేరిందని చెప్పొచ్చు. పంట పొలాల్లో ఉపాధి హామీ నిధుల ద్వారా కల్లాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఫలితంగా వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలకు పనులు దొరకగా.. రైతులకు ఈ కల్లాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. అయితే వాటి నిర్మాణం కోసం వెచ్చించిన రూ.150 కోట్ల నిధుల్ని తిరిగి తమకు ఇచ్చేయాలంటూ కేంద్రం హుకూం జారీ చేయటం అత్యంత దారుణం. దీంతోపాటు గతంలో ఉపాధి కింద చేసిన పనులకు గాను కూలీలకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి కోట్లను ఇప్పటిదాకా రాష్ట్రానికి విడుదల చేయకుండా తాత్సారం చేయటం ద్వారా మోడీ ప్రభుత్వం అత్యంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపే గాకుండా పేద కూలీల పొట్టగొట్టడం కూడా. ఇది రాష్ట్రాల పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
       ఇక రాష్ట్ర సర్కారు వైపు నుంచి చూస్తే... తెలంగాణలోని పరిశ్రమలు, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు, ఉపాధి కల్పన, ఐటీ, చేనేత, జౌళి, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర రంగాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వ పెద్దలు అనేకసార్లు కేంద్రానికి మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతీయేడాది సెంట్రల్‌ బడ్జెట్‌ సందర్భంగా ఆయా రంగాలపై శ్రద్ధ వహించాలంటూ కోరుతూ వస్తున్నా... మనకు అందింది సున్నా. ఆయా రంగాల కోసం కేంద్రం తెలంగాణకు అందించిన ప్రోత్సాహాలు, రాయితీలేవీ లేకపోవటం ఆందోళనకరమే. మంత్రి కేటీఆర్‌ ఇదే విషయమై ఇటీవల లేఖల మీద లేఖలు రాసిన సంగతి విదితమే. అయినా ఢిల్లీ పెద్దలకు చీమ కుట్టినట్టయినా లేకపోవటం అత్యంత శోచనీయం. వచ్చే ఏడాది (2024)లో లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి... మోడీ సర్కారు ఈ యేడాది మార్చిలో ప్రవేశపెట్టబోయేదే పూర్తి స్థాయి బడ్జెట్‌ అవుతుంది. ఆ తర్వాత 2024లో సమర్పించబోయేది ఓటాన్‌ అకౌంట్‌ మాత్రమే. అందువల్ల ఈ యేడాది నిర్మలమ్మ ప్రవేశపెట్టబోయే పద్దు... అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా దేశానికి, తెలంగాణకు అత్యంత కీలకమైన బడ్జెట్‌. అందులో ఏమైనా రాయితీలు, ప్రోత్సాహకాలు, అదనపు నిధులు, గ్రాంట్లు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇక్కడే మనం ఒక విషయాన్ని పరిశీలించాలి. గత ఎనిమిదిన్న రేండ్లుగా కేంద్రం రాష్ట్రం పట్ల తీవ్ర వివక్షను, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా బీఆర్‌ఎస్‌ గానీ, కేసీఆర్‌ సర్కారు గానీ అంతగా పట్టించుకున్న దాఖలాల్లేవు. మోడీ సర్కారు వైఖరిపై సీఎం నుంచి అమాత్యుల వరకూ ప్రకటనల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించటం, ప్రెస్‌మీట్లలో పరుష పదజాలంతో విరుచుకుపడటం తప్పితే ఇతమిద్ద్దంగా కార్యాచరణ ప్రకటించిందీ లేదు.. పోరాటం సల్పిందీ లేదు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేయటం, జాతీయ రహదారులను దిగ్బంధించటం మినహా కేంద్రం చర్యలపై పోరాడింది లేదు.. ఇదే విషయమై ఒక మంత్రినీ, మరో ఎంపీనీ ప్రశ్నించినప్పుడు... 'మమ్మల్ని ఏం చెయ్యమంటవ్‌.. కేంద్రం మీద బాంబులెయ్యమంటవా...' అంటూ ఛలోక్తి విసిరి తప్పించుకున్నారే తప్ప స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవటం విషాదకరమైన అంశం. కానీ ఆ అమాత్యుడు, లోక్‌సభ సభ్యుడే కాదు... సీఎం కేసీఆర్‌ సాబ్‌ కూడా గుర్తించాల్సింది ఏమంటే... 'రాష్ట్రాలను చిన్న చూపు చూస్తున్న మత్తగజం లాంటి కేంద్రం మెడలు వంచాలంటే చిన్న చిన్న సూదులు, దబ్బణాలు సరిపోవు. దాన్ని వంచి, మన నిధులను మనం దక్కించుకోవాలంటే పెద్ద పెద్ద అంకుశాలకు పని చెప్పాల్సిందే...' ప్రజలను సమీకరించి, ప్రతిపక్షాలను కలుపుకుని పెద్ద పెద్ద పోరాటాలు చేయటమే ఆ అంకుశాలు తప్ప వేరేమీ కాదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.