Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'నేర' నేతలు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 18,2023

'నేర' నేతలు

''నేరాల కోసం రాజకీయాలు.'' ''రాజకీయాల కోసం నేరాలు..'' అన్నట్టుగా మారిపోయాయి దేశ రాజకీయాలు. హత్యాయత్నం కేసులో పదేండ్లు శిక్ష పడటంతో లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ఫైజల్‌పై తాజాగా అనర్హత వేటుపడింది. ఎన్సీపీకి చెందిన సదరు ఎంపీపై 2009లో కేసు నమోదైతే, పుష్కరకాలం తరువాత శిక్ష పడింది. ముజఫర్‌నగర్‌ అల్లర్ల కేసులో యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్‌ సింగ్‌ సైనీ శాసనసభ్యత్వం కూడా ఇటీవలే రద్దయ్యింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు గాను అదే రాష్ట్రానికి చెందిన ఎస్పీ ఎమ్మెల్యే ఆజంఖాన్‌, మరో ఇద్దరు బీహార్‌ ఆర్జేడీ శాసనసభ్యులు కొద్ది నెలల క్రితమే బహిష్కృతులయ్యారు. ఆరేండ్ల కిందటి కేసులో ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ నేత మమతాదేవి గత నెలలోనే తన ఎమ్మెల్యే గిరీని వదులుకోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా నాయకులుగా చలామణీ అవుతున్న ఇలాంటి నేరగాళ్ళు ఇంకెందరో..!
ప్రస్తుత లోక్‌సభలో46శాతం మందిపై క్రిమినల్‌ కేసులుంటే, కేంద్రమంత్రుల్లో 42శాతం మంది నేరగాళ్లే అని ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం స్పష్టం చేసింది. ఇందులో 'తిలా పాపం తలా పిడికెడు' అన్నట్టు అన్ని పార్టీల వారున్నా సింహభాగం మాత్రం పాలక బీజేపీదే. హత్య, హత్యాయత్నం, లైంగికదాడులు, అపహరణలు, బలవంతపు వసూళ్ళు, దోపిడీ తదితర తీవ్ర కేసులు ఉన్నవారు కోకొల్లలు. నేరమయ రాజకీయాలే పరమావధిగా మారిన చోట ఆ పార్టీల నుంచి నేరరహిత నేతలను ఆశించడం అత్యాశే అవుతుంది. పైపెచ్చు ఆ చరిత్ర తమకే కాదు ప్రజలకూ ఉండాలని భావిస్తున్నారు! లేదంటే అధికార పార్టీ ఎంపీనే స్వయంగా కత్తులతో దాడులు చేయండని ప్రజలకు పిలుపు నివ్వడమేమిటీ?
నిరుడు సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సీన్‌ తమ పార్లమెంటులో 'చట్టసభల పవిత్రత - ప్రజాస్వామ్య వ్యవస్థ' అనే అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఆ సందర్భంలో ఆయన భారత ఎంపీల నేరచరితల గురించి ప్రస్తావించారు. దానిపై మన నేతాశ్రీలు ఆనాడే భుజాలు తడుముకొన్నారు. ప్రభుత్వ వర్గాలైతే 'లీ' వ్యాఖ్యలపై అధికారికంగానే అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఎవరు అవునన్నా కాదన్నా నేర రాజకీయాల కబంధ హస్తాల్లో భారత ప్రజాస్వామ్యం విలవిల్లాడు తోందన్నది వాస్తవం. ఇలాంటి నేపథ్యంలో నేరస్తులు చట్టసభలలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో చేతులెత్తేసిన ఈసీ చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దీనిపై 2018 సెప్టెంబర్‌లోనే బలమైన చట్టం చేయాలని పార్లమెంటును న్యాయస్థానం ఆదేశించింది. అయినా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూనేవుంది. 'నేరాలు రుజువు కాకుండా ఒక వ్యక్తిని చట్టసభలలోకి రానీయకుండా తాము ఆపలేమని దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటే'నని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో నిర్ణయాధికారం పార్లమెంటు చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇంకేముంది మినుకుమినుకుమనే ఆశ కూడా అడుగంటి పోయే పరిస్థితి దాపురించింది. అధికారానికి నేరాన్ని ఒక మెట్టుగా భావించే బూర్జువా పార్టీలు నేర, అవినీతి రహితులను ఎందుకు ఎంచుకుంటాయి? తమ ప్రత్యర్థి పార్టీలకి మించిన నేరగాళ్లను బరిలోకి దింపాలనుకుంటాయి తప్ప సచ్ఛీలుర్ని అక్కున చేర్చుకుంటాయనుకుంటే పొరపాటే అవుతుంది. ఒకరికొకరు కూడబలుక్కున్నట్టు, ఒకరితో ఒకరు కుమ్మక్కు అయినట్టు బూర్జువా పార్టీలన్నీ కలిసి నేరరహితుల్ని ఎన్నికల బరిలోకే రాకుండా నియంత్రించేందుకు యత్నిస్తున్నాయి. ఈ స్థితిలో బూర్జువా పార్టీల నుంచి మనం రాజకీయాల్లో నేరప్రక్షాళన చట్టాలను ఊహించగలమా? తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తూ ప్రజల తరపున పోరాడే వారిపై, ముఖ్యంగా కమ్యూనిస్టులపై పాలకులు అత్యంత తీవ్రమైన నిర్బంధాలకు పాల్పడుతున్న వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి, నేరచరితుల విషయంలో సుప్రీంకోర్టే గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆశించడం తప్ప పార్లమెంటుపై ఆశలు పెట్టుకునే అవకాశం ఆవగింజంతయినా లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు సైతం చేతులెత్తేస్తే భారత ప్రజాస్వామ్యానికి దిక్కెవరు? ప్రజాస్వామ్యాన్ని నేతస్వామ్యంగా మార్చి మేడిపండు చందంగా చేస్తున్న భ్రష్ట రాజకీయాలకు చరమగీతం పాడాలి. చట్టాలు చేసే వారే చట్టానికి అతీతులుగా మారితే, వారిని దారికి తెచ్చే శక్తి ఒక్క ప్రజలకు మాత్రమే ఉంది. కనుక ప్రజలే ఆ దిశగా ఆలోచించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.