Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 18,2023

అసమానతల ప్రపంచం - దానిలో భాగమే భారత్‌!

             అందరూ సర్వే జనాః సుఖినోభవంతు, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పేవారే! కానీ అదేమిటో రోజు రోజుకూ అసమానత పెరుగుతూనే ఉంది. అసమానతను తగ్గించాలన్న చిత్తశుద్ది పాలకుల్లో ఉంటే, ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలన్న చైతన్యం జనంలో ఉంటే 2020 తరువాత సృష్టించిన సంపద 42లక్షల కోట్ల డాలర్లలో మూడింట రెండువంతులను ఒక శాతం ధనికులు జేబులో వేసుకొని ఉండగలిగేవారా? స్విడ్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ధనికుల ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా ఆక్స్‌ఫామ్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో అసమానతల గురించి వెల్లడించిన అంకెలను సామాన్యులు నమ్మరంటే అతిశయోక్తి కాదు. గతంలో జరిగిన వాటన్నింటినీ మార్చివేస్తానని, జనానికి అచ్చేదిన్‌ (మంచి రోజులు) అందిస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ ఏలుబడిల ఈ అసమానతలు తగ్గకపోగా మరింతగా పెరగటం ఏమిటని మోడీ అభిమానుల్లో కూడా ఆలోచన తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు కూడా అసమానతల గురించి మాట్లాడు తున్నారంటే నాటకం ఎంత రసవత్తరంగా నడిపిస్తున్నారో అరం చేసుకోవచ్చు. జనాభాలోని ఎగువన ఉన్న ఒకశాతం మంది దేశ రాబడిలో ఐదోవంతు పొందుతుండగా 50శాతం మందికి కేవలం 13శాతమే వస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌసబలే చెప్పటం జనాన్ని మాయ చేయడం తప్ప మరొకటి కాదు.
గతంలో నెహ్రూ, కాంగ్రెస్‌ పాలనా కాలంలో జరిగిన అక్రమాలంటూ ఏకరువు పెట్టిన వారు తమ ఏలుబడిలో ఏంచేస్తున్నారో జనానికి చెప్పాలి. తొమ్మిదేండ్లలో అసమానతలను ఎంత తగ్గించారు, ఏ దిశగా దేశాన్ని నడుపుతున్నారో వివరించాలి. కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబరు వరకు బిలియనీర్ల (వంద కోట్లు అంతకు మించి సంపద ఉన్నవారు) సంపద 121శాతం లేదా రోజుకు రూ.3,608 కోట్లు పెరిగింది. మరోవైపు గత రికార్డులను జీఎస్‌టీ వసూళ్లు అధిగమిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ఘనతగా చెప్పుకుంటున్నది. 2021-22లో వసూలైన మొత్తంలో జనాభాలోని దిగువ 50శాతం మంది పేదలు 64శాతం చెల్లిస్తే, ఎగువున ఉన్న పదిశాతం మంది ధనికుల నుంచి వచ్చింది కేవలం మూడుశాతమే. తాము చెల్లించిన మొత్తాల నుంచే శతకోటీశ్వరులకు సబ్సిడీలు ఇస్తున్నారని ఎందరు పేదలకు తెలుసు?
             ప్రపంచంలో గత దశాబ్ది కాలంలో బిలియనీర్లు రెట్టింపయ్యారు. దేశంలోనే ధనికుడైన వ్యక్తి సంపద 2022లో 46శాతం పెరగటం మన దేశం తీరు తెన్నులకు నిదర్శనం. ఇరవై ఒక్క మంది బిలియనీర్ల దగ్గర 70కోట్ల మంది వద్ద ఉన్నదానికంటే ఎక్కువ సంపద ఉంది. 2020లో 102 మందిగా ఉన్న మన శత కోటీశ్వరులు 2022 నాటికి 166కు పెరిగారంటే ప్రపంచం కంటే వేగం ఎక్కువగా ఉంది. దేశంలో వీరి సంఖ్య ఇంతగా పెరగటానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణం. మోడీ ఏలుబడిలో కార్పొరేట్‌ పన్ను 30 నుంచి 22శాతానికి తగ్గించారు. కొత్తగా పెట్టే సంస్థలకు 15శాతమే అని చెప్పటంతో అనేక మంది పాతవాటిని మూసివేసి కొత్త సంస్థల పేరుతో లబ్ది పొందుతున్నారు. పన్ను తగ్గింపు, ప్రోత్సాహకాల ద్వారా 2020-21లో ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా మూడువేల 285 కోట్లు. 2017-21 సంవత్సరాలలో బిలియనీర్ల నుంచి వసూలు చేయని 20శాతం పన్ను విలువ రూ.1.8లక్షల కోట్లు. ఇక బాంకుల్లో వసూలుగానీ బాకీల పేరుతో పక్కన పెట్టింది పన్నెండులక్షల కోట్లు కాగా, వాటిలో వసూలు చేసింది కేవలం 13శాతమే. అంటే జనం సొమ్ముతో కార్పొరేట్లకు ఎలా లబ్ది కలిగిస్తున్నారో చెప్పనవసరం లేదు.
             కొత్తగా సృష్టి అయిన సంపదలో ఒక డాలరు దిగువ 90శాతం మందికి దక్కితే సగటున ఒక్కో బిలియనీర్‌కు 17లక్షల డాలర్లు వెళ్లింది. అత్యంత ధనికుల సంపద రోజుకు 270కోట్ల డాలర్ల వంతున పెరిగింది. ఇలాంటి అంకెలను అసలు ఊహించలేం, బుర్ర తిరగటం ఖాయం. సంపదలు కొద్ది మంది చేతిలో ఇంతగా పోగుపడిన తరువాత వాటిని కాపాడు కొనేందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. గతంలో సీపీఐ(ఎం) నేత జ్యోతిబసును కొందరు ప్రధాని పదవికి ప్రతిపాదించినప్పుడు బోంబే క్లబ్‌ (కార్పొరేట్‌ పెద్దలు) ససేమిరా అంగీకరించేది లేదని పార్టీలను హెచ్చరించి వత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. తమకు అనుకూలురైన అవినీతి పరులకు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే నిరంకుశ శక్తులకు, జవాబుదారీ తనం లేని వారికి మద్దతుగా, రాజకీయ సమీకరణలు, కార్మిక సంఘాల విచ్చిన్నం వంటి ప్రమాదకర పోకడలకు తెరతీస్తారని అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ముందు సంపదలను సృష్టి కానివ్వండి తరువాత ఊట మాదిరి సమాజంలో అందరికీ సంపదలు దిగుతాయంటూ అరచేతిలో స్వర్గం వంటి భ్రమలను, పొదుపు మంత్రాన్ని పాటించాలన్న సుభాషితాలను తమ చెప్పుచేతల్లో ఉన్న మీడియా ద్వారా జనాలకు చేరవేస్తుంటారు. ప్రతిదానికి పేదలను, పేదరికాన్ని, పోరాటాలను నిందిస్తుంటారు. రానున్న ఐదు సంవత్సరాల్లో పొదుపు పేరుతో ప్రపంచవ్యాపితంగా 7.8లక్షల కోట్ల డాలర్ల మేర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ పెట్టుబడులకు కోత పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయని ఆక్స్‌ఫామ్‌ చేసిన హెచ్చరికను ప్రతివారూ గమనంలోకి తీసుకోవాలి. గ్రామాల్లో కనీస వేతనం పొందుతున్న కార్మికుడు ఒక దుస్తుల కంపెనీలోని ఉన్నతాధికారి పొందుతున్న వేతనాన్ని పొందాలంటే 941సంవత్సరాలు పడుతుందని వేసిన అంచనా మన దేశంలో అసమానతలకు పక్కా నిదర్శనం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.