Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నెత్తుటి చారికలు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2023

నెత్తుటి చారికలు

         దేశమంతటినీ తాను సృష్టించిన అబద్ధాల ఊబిలో ముంచాలని రాజ్యం ప్రయత్నిస్తున్నప్పుడు... ఒక్క సత్యవాక్కు చాలు దాన్ని ఉలికిపాటుకు గురిచేయడానికి. ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించిన కథనం, దానిపై భారత ప్రభుత్వ కదనం చూస్తుంటే ఇప్పుడు అలాంటి ఉలికిపాటే కనిపిస్తోంది. గుజరాత్‌లో జరిగిన 2002నాటి అల్లర్లపై బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసి) చేసిన ఓ ప్రసారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ''ఇండియా ది మోడీ క్వశ్చన్‌'' పేరుతో ఇది ప్రసారమైంది. దీనిపై భారత ప్రభుత్వం ఎనలేని ఆగ్రహం ప్రదర్శిస్తోంది. బ్రిటిష్‌ అంతర్గత విచారణ బృందం నివేదిక ఆధారంగా బీబీసీ ఓ డాక్యుమెంటరీ రూపొందిన ఈ డాక్యుమెంటరీ వలసవాద ధోరణికి తార్కాణమని దుయ్యబట్టింది. భారత ప్రధాని మోడీని అపఖ్యాతిపాలు చేయడానికే ఈ ప్రయత్నమని విరుచుకు పడుతోంది. కారణం... ఇది నాటి గుజరాత్‌ మత మారణహౌమానికి మోడీని దోషిగా చూపుతోంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆనాటి ఆయన ప్రభుత్వాన్ని బోనులో నిలుపుతోంది.
నిజానికి దేశ విభజన తరువాత జరిగిన అతిపెద్ద మారణహౌమం ఇది. అత్యంత అమానవీయమైన, భయానకమైన ఈ హింసాకాండకు దేశమే కాదు, ప్రపంచమే విలపించింది. వెయ్యిమందికి పైగా చనిపోయారని గుజరాత్‌ ప్రభుత్వ అధికారిక నివేదికే చెప్పిందంటే వెలుగు చూడని మరణాలు ఇంకెన్నో..! ఈ ఊచకోతకు కారణాలేమిటో కారకులెవరో అంతా బహిరంగ రహస్యమే. కానీ ఆరని ఆ నెత్తుటి చారికలు నేటికీ తడిగానే కనిపిస్తున్నా ఘనమైన మన దర్యాప్తు సంస్థలకు, న్యాయస్థానాలకు ఆధారలే లభించకపోవడం వైచిత్రి! ఈ ఘోరం జరిగిన దశాబ్దకాలం తరువాత మన ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) సాక్షాధారాలు లేవని మోడీ సహా నిందితులందరికీ క్లీన్‌ చిట్‌ ఇచ్చి చేతులు దులుపుకోగా అత్యున్నత న్యాయస్థాం సైతం దానిని ఆమోదించింది.
తిరిగి ఇన్నాళ్ళకు, రెండు దశాబ్దాల తరువాత, నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి మోడీయే నేటి దేశ ప్రధానిగా కొలువుదీరి ఉన్న సమయాన ఇప్పుడీ బ్రిటిష్‌ విచారణ బృందం నివేదిక, దాని ఆధారంగా రూపొందిన బీబీసీ డాక్యుమెంటరీ ఆ ఉదంతాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. మరి మన ఏలినవారి ఉలికిపాటులో మండిపాటులో ఆశ్చర్యమేముంటుంది?! అసలే ఆ ''గుజరాత్‌ నమూనా''ను నేడు దేశమంతటికీ విస్తరింపజేసే విపరీత పోకడలు ఒకవైపు సాగుతున్నాయి. మరోవైపు వీరి పాలనా నిర్వాకాల మూలంగా ప్రజల వ్యక్తిగత జీవితం అభద్రంగా, సామాజిక జీవితం కల్లోలంగా మారిపోతోంది. ఇలాంటి ఒకానొక రాజకీయ సందర్భంలో ఇది మళ్ళీ చర్చకు రావడం ఏ ఏలికలెవరికైనా ఎలా సహిస్తుందీ?! పైగా ఆ ఘోరకలికి ఆనాటి ముఖ్యమంత్రీ నేటి ప్రధానమంత్రీ మోడీగారే ప్రధాన బాధ్యులని ఈ నివేదిక తేల్చి చెపుతోందాయే. ఇది పక్కా రాజకీయ ప్రేరేపితమనీ, ఆ అరాచక మూకలకు ప్రభుత్వమే అన్ని విధాలా సహకరించిందనీ, ఏంచేసినా పోలీసులు అడ్డుకోరనే ప్రభుత్వ సంకేతాల వల్లే ఈ ఘోర దారుణాలంటూ బ్రిటిష్‌ విచారణ బృందం నిర్దారించిందని ఈ డాక్యుమెంటరీ ప్రకటించింది.
ఈ డాక్యుమెంటరీలో బ్రిటిష్‌ మాజీ విదేశాంగ కార్యదర్శి జాక్‌ స్ట్రా మాట్లాడుతూ... ''ముఖ్యమంత్రి మోడీ ఒకవైపు ఉన్మాదులను ఉసిగొలిపి, మరోవైపు పోలీసుల చేతులు కట్టేశాడ''ని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దాడులకు వీహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌లే ప్రణాళికలేసాయని, పోలీసుల రక్షణతోనే అల్లరి మూకలు చెలరేగిపోయాయని నివేదిక స్పష్టం చేసిందని, ఈ నివేదిక బ్రిటిష్‌ ప్రభుత్వానికి చేరినప్పటికీ విషయాలేవీ బయటకు రాలేదని కూడా ఈ డాక్యుమెంటరీ పేర్కొంది. ఈ కారణాలతోనే కదా ఆనాడు బ్రిటిష్‌ ప్రభుత్వమే కాదు, అమెరికా సైతం మోడీకి వీసా నిరాకరించింది. అలాంటిది అవసరమో అవకాశవాదమో తెలియదుగానీ, నేడు అదే బ్రిటిష్‌ ప్రధాని ఈ సందర్భంలో మోడీకి మద్దతు తెలుపుతూ దేశమేదైనా ఏలికల నైజమొకటేనని నిరూపిస్తున్నారు! రాజకీయాల్లో నైతికతకూ నిజమైన తాత్వికతకూ స్థానంలేని విపరీతకాలం కదా ఇది! ఇలాంటి విపరీతాలు ఇంకెన్ని చూడాల్సివస్తుందో...!
రాజ్యం దృష్టిలో నిజాన్ని నిర్భయంగా రాసే కలాలన్నీ మారణాయుధాలే. వాటిని వినిపించే గళాలన్నీ రాజద్రోహాలే. అందుకే సత్యం కోసం నినదించేవారెప్పుడూ చీకటి గాలానికి వేలాతున్నట్టే, ఈ బీబీసీ కథనం కూడా తన వెబ్‌సైట్‌ నుండి తొలగించబడింది. ఇలాంటి అసమంజసతల పట్ల, అన్యాయాల పట్ల దేశం నిండా వ్యక్తమవుతున్న వేదన బోలెడుంది. దీనిని సంఘటితంగా నిలిపి దిశానిర్దేశం చేయగల ఉద్యమాలు బలపడనంత వరకూ ఈ చీకటి ఇలాగే కొనసాగుతుంది. ఇప్పుడీ చీకట్లను ఛేదించే వెలుతురు పిడికిళ్ళు కావాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.