Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మల్ల యుద్ధ మహిళ | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2023

మల్ల యుద్ధ మహిళ

''ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, రక్తాశ్రువులు చిందిస్తూ''నే ఉన్నది ఈ దేశపు మహిళ. మానభంగ పర్వంలో మాతృహృదయం నిర్వేదమవుతూనే ఉన్నది. అన్యాయం జరిగిందని గొంతెత్తి అరుస్తున్నా స్పందించని నేలపైన న్యాయం ఊసెత్తటమే అన్యాయమైపోతుంది. దుష్ట సంస్కృతీ వారసత్వం నేటికీ సమాజాన కొనసాగుతూనే ఉన్నది. నాడు 'భారతా'న ఒక్క దుశ్వాసనుడే ఉన్నాడు. నేడు వీధికొక్కడూ కనపడుతున్నాడు. ఆధిపత్య పర్వంలో విహరిస్తున్నారు. 'బేటీ పడావ్‌ బేటీ బచావ్‌' నినాదం నేడు జంతర్‌ మంతర్‌ నడి వీధిలో అణచివేయబడి హాహాకారాలు చేస్తున్నది. వొదిలే మాటలకు, కదలని హృదయాలకు సాక్షిగా మూగరోదన చేస్తున్నది. స్త్రీలను శక్తులుగా కొలిచే దేశం మనదని గొప్పలు చెప్పుకునే సాంస్కృతిక ప్రచార పటాటోపంలో 'నస్త్రీ స్వాతంత్య్ర మర్వతి' అని నొక్కి వక్కాణిస్తున్న తీరుకు కించిత్‌ విచారమూ ప్రకటించము. మహిళకూ హృదయముందనీ, మెదడుందనీ, శరీరముందనీ, శక్తి వుందనీ, ఆకాశంలో సగమై ఈ లోకాన్ని ఏలుతుందనీ ఎందరెందరో చెబుతూ వచ్చినా సమానతా భావనకు విలువనిచ్చిందెప్పుడు? ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల పేరుతో స్త్రీని సొంత ఆస్తిగా, బానిసగా చూస్తూ చెరబట్టే దుష్టత్వానికి అంతమెప్పుడు!
'భారతదేశంలో మహిళలకు ఎక్కడా రక్షణ లేదనుకుంటాను. దేశంలో ఆడపిల్లలు జన్మించకూడదని నేను అనుకుంటాను' అని ప్రపంచ దేశాలలో మన దేశం తలెత్తుకునేలా దేశ పతాకాన్ని ఎగరేసిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగటి ఆవేదన చెందారు అంటే... ఇక సామాన్య మహిళల పరిస్థితి ఎలావుందో అర్థమవుతుంది. ఇంత దుఃఖానికి గురవుతున్న ఆ మల్లయోధురాండ్ల వేదనను ఆలకించటానికి నాయకునికి తీరికేలేకపోయింది. గత మూడు రోజులుగా రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో స్టార్‌ రెజ్లర్స్‌ న్యాయం జరగాలంటూ ధర్నా చేశారు. గత కొంత కాలంగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటు సభ్యుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని వారు ధర్నా నిర్వహిస్తున్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బంగారుపతకాన్ని సాధించి దేశం గర్వపడేలా చేసిన క్రీడాకారిణిపై ఇంకా అనేక మంది జూనియర్‌ రెజ్లర్‌లపై లైంగిక వేధింపులకు, ఆ క్రీడా సమాఖ్య నిర్వాహకులే పాల్పడటం దుర్మార్గమైన విషయం. ఇప్పుడు ఒక్క ఐదుగురు స్టార్‌ రెజ్లర్‌లే కాదు, జూనియర్‌ క్రీడాకారిణులు వీరికి తోడయ్యారు, మిగతా ఆటగాళ్లూ వీరి పోరాటానికి మద్దతు పలుకుతున్నారు. ''ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, లైంగిక వేధింపులులకు సంబంధించి మా దగ్గర ఆధారాలున్నాయి'' అని వారంతా చెబుతున్నారు. వెంటనే అధ్యక్షుడిని తొలగించి పాలకవర్గాన్ని రద్దు చేయాలని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.
భారత క్రీడా వ్యవస్థలో అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం మొదలైన అనేక రుగ్మతలు కొనసాగుతున్న విషయం ఎప్పటినుండో ఉంది. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణుల విషయంలో గతంలో ఇలాంటి ఆరోపణలు అనేకం వచ్చాయి. క్రీడాభిరుచి కలిగి వచ్చిన మహిళలు బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతుంటారు. ఇప్పుడు ధైర్యంగా కొందరు ముందుకు రావడంతో అనేక మంది గొంతు కలుపుతున్నారు. ఈ రకమైన వేధింపుల వల్లనే మహిళలు క్రీడలకు దూరమవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రెజ్లింగ్‌ పోటీ శిక్షణకు అసలు మహిళలే లేకుండా పోయారు. లైంగిక వేధింపులు, చెబితే చంపేస్తామనే బెదిరింపులు, నియంతృత్వ విధానాలు, ఆటగాళ్లకు అన్యాయం చేసే పద్ధతులు... ఇవన్నీ కలిపి మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సదరు కాషాయ ఎంపీ, ఫెడరేషన్‌ అధ్యక్షుడు మాత్రం తన పదవిని వదిలేదే లేదని చెబుతున్నాడు. అంతే కాదు, రెజ్లర్లు చేస్తున్న ధర్నాను, సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో చేసిన ఆందోళనతో పోల్చి హేళన చేస్తున్నాడు. వాస్తవంగా షహీన్‌బాగ్‌లో చేసింది ఎంత ప్రజాస్వామిక న్యాయపోరాటమో, ఇది కూడా న్యాయబద్ధ పోరాటమే.
కాషాయ దళాలకు మహిళల పట్ల ఎలాంటి చూపున్నదో ఈ సంఘటన తెలియజేస్తుంది. నీతులు, ధర్మాలు వల్లించేవారి నిజస్వరూపమేమిటో కూడా బయటపెడుతుంది. మాట్లాడే మాటలకు, చేతలకూ ఉన్న వ్యత్యాసం అవగతమవుతుంది. అందుకే వేధింపులకు వ్యతిరేకంగా న్యాయం కోసం రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మేమూ మీతో గొంతు కలుపుతామని సంఘీభావం తెలిపిన బృందాకారత్‌లాగా మన గొంతుకనూ జోడిద్దాము. మల్లయుద్ధ మహిళలకు అండగా నిలుద్దాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.