Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అసహన మేఘాల్లో..! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

అసహన మేఘాల్లో..!

మన దేశ న్యాయవ్యవస్థ మీద ప్రజలకు అపారమైన నమ్మకం. తమను నేతలు దగా చేసినపుడో, ప్రభుత్వాధికారులు పీడించినపుడో, పోలీసుల వలనో, అసాంఘిక శక్తులనుంచో.. ఇలా సమస్త వ్యవస్థల నుంచీ తమకు అన్యాయం జరిగినపుడో న్యాయం కోసం సామాన్య జనం న్యాయ వ్యవస్థవైపు ఆశగా చూస్తారు. ఎంతో నమ్మికతో కోర్టు గడప తొక్కుతారు. కానీ, ఆ న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోయే ప్రమాదమిప్పుడు రోజురోజుకు పెరుగుతోంది. గోహత్యలను అడ్డుకుంటే ప్రపంచంలోని సమస్యలన్నీ పరిష్కారమవుతాయని గోవుల అక్రమ రవాణా కేసు విచారణ సందర్భంగా.. గుజరాత్‌లోని తాపీ జిల్లా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో జీవిత ఖైదుతో పాటు రూ.5లక్షల జరిమానా విధించింది. జడ్జి తన తీర్పును వెలువరిస్తూ ఆవు కేవలం జంతువు మాత్రమే కాదు, 68కోట్ల పవిత్ర స్థలాలకు, 33కోట్ల దేవత లకు నిలయమని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగలేదు ఆ న్యాయమూర్తి గోవధ చట్టాలను సమర్థించడం, ఆవుపేడతో రేడియేషన్‌ సమస్య రాదని సైన్స్‌ రుజువుచేసిందని, గోమూత్రం సర్వరోగ నివారిణి అని స్వయంగా 'శ్లోకాలు' పఠించారు. రాజ్యాంగాన్ని, చట్టాలను అనుసరించి చెప్పాల్సిన తీర్పులను పురాణాలు, కట్టుకథల ఆధారంగా చెప్పడం విస్తుగోల్పుతోంది. న్యాయ వ్యవస్థలోనూ తమ విభజన రాజకీయాలను జొప్పించి తాము వ్యతిరేకిస్తున్న సమూహాన్ని కాషా యానుకూల తీర్పులతో అకారణంగా, అన్యాయంగా బలిచేస్తున్నా రనడానికి ఇంతకంటే ఉదాహరణలేమి కావాలి?
దేశమంతటా అసహన మేఘాలు అలుముకుని ఉన్న కాలమిది. ఆ 'పరివారాని'కి నచ్చనిది తిన్నా, కట్టుకున్నా సహించలేని పరిస్థితులు మెడమీద కత్తిలా వేలాడుతున్న సమయమిది. కానీ, వాస్తవమేంటే గతం కంటే వీరికాలం లోనే 'గో' మాంసం ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయి. ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నదీ వీరి సహచరులే. ఈ ప్రభుత్వాలు చేసే చట్టాలు కేవలం ఒకే వర్గానికే తప్ప, వారికి వర్తించవు. అయినా తరతరాలుగా ఈ దేశంలోని ఆహారపు అలవాట్లను వ్యతరేకించి చిచ్చు రేపడమే సంఫ్‌ు పరివార్‌ రాజకీయ దురుద్దేశం. ఈ విధంగా కుల, మత దురహంకార మంటలు రేపుతుంటే... అక్కడి ప్రభుత్వాలు ఆ మంటలార్పకుండా చోద్యం చూస్తు న్నాయి. 'కసాయి'మూకలు వాటితో చలి కాచుకోవడం ఆందోళనకరం. సైద్ధాంతికంగా తమకు వ్యతిరేక నేపథ్యం ఉన్న న్యాయమూర్తులను ఆ న్యాయవ్యవస్థచేతే వెంటాడి, వేధించే పాలకుల దుస్సాహసాలు ఢిల్లీ మూకదాడులపై విచారణకు ఆదేశించిన న్యాయమూర్తి ఉదంతంలో మనం చూశాం.
మనుషుల్ని, వారి ఆహారపు అలవాట్లని, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించలేని సరికొత్త జాతీయవాదం మన ముందుకొచ్చింది. అసంఖ్యాకులైన భారతీయు లందరూ ఆంక్షలతో బతకాల్సిందే. దేశభక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చేసిన తరుణంలో ఏమి తింటే, ఏమి అంటే ఏమవుతుందోనన్న దిగులు సర్వత్రా నెలకొంది. దేశంలో ఎన్నికల వాతావరణం మొదలైన నేపథ్యంలో ఇంకెంత ఉన్మాదం చెలరేగుతుందో..! ఇంకెలాంటి ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందో? పౌర సమాజమంతా ఒక్కటిగా నిలబడి పోరాడితే తప్ప ఈ విష సంస్కృతిని అరికట్టలేం. 'న్యాయమో... రామచంద్రా' అని దేశం ఎదురుచూస్తున్నది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గోరక్షణ పేరుతో గ్రామాల్లో ముఠాలుగా ఏర్పడి ముస్లింలు, దళితులపై పాశవిక దాడులకు పాల్పడి కొట్టి చంపుతున్నారు. బీజేపీ ఏలుబడిలోని హర్యానా, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోనే మతోన్మాదుల దురాగతాలు అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన గోమూకల హింసా ఘటనల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంతో గోమూకలు మరింత విజృంభిస్తున్నాయి. ఇలాంటి తీర్పులు ఆ మూకలకు కొత్త శక్తిని అందిస్తాయి. మూకలు పాల్పడే వివిధ నేరాలకు విధించగలిగే శిక్షల గురించి భారతీయ శిక్షాస్మృతి చెబుతున్నది. కానీ, మూకదాడులకు ప్రత్యేకంగా ఉద్దేశించిన చట్టమేమీ లేకపోవడమే వారికి మరింత బలాన్ని ఇస్తోంది. ఇంతవరకు అలాంటి చట్టాలు లేకపోయినా ఇప్పుడు ఆ చట్టాల అవసరమూ చాలా ఉన్నదన్న విషయం ఈ తాజా తీర్పు స్పష్టం చేస్తోంది. దేశంలో మూకదాడులు ఒక కొత్త నియమంగా మారిపోయాయి. ఈ వాతావరణాన్ని ఎంతటి కఠినమైన చట్ట మైనా బద్దలు కొట్టగలదా అన్న అనుమానం కలగక తప్పదు. దాడులకు పాల్పడుతున్న వారిని ప్రశంసిస్తూ స్వయంగా కేంద్రమంత్రులే కార్యకర్తలను రెచ్చగొడు తుండటం, పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమైన నేపథ్యంలో చట్టాలు మాత్రమే సమస్యను పరిష్కరించగలవన్నది సందేహమే. సమాజంలో సర్వత్రా అలుముకున్న ఈ భయానక ధోరణిని నిర్మూలించడానికి ఇప్పుడు ప్రధానంగా కావల్సింది రాజకీయ చిత్తశుద్ధి మాత్రమే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

07:15 AM

నేడు కవిత పిటిషన్‌పై సుప్రీం విచారణ..

06:57 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్ విడుద‌ల‌..

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.