Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓ మహాత్మా! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

ఓ మహాత్మా!

''ఏది చీకటి ఏది వెలుతురు! ఏది జీవితమేది మృత్యువు! ఏది పుణ్యం, ఏది పాపం! ఏది సత్యం ఏదసత్యం! ఏది కారణమేది కార్యం! ఏది నీతి ఏదనీతి! ఓ మహాత్మా! ఓ మహర్షి!...'' ఇప్పటికీ ఈ శ్రీశ్రీ పాటలోని ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కుంటూనే ఉన్నాము. అసత్యాలన్నీ సత్యాలుగా చలామణి అవుతున్నాయి. మన కెదురవుతున్న సవాళ్ళకు సమస్యలకు కారణం తెలుసుకోలేకపోతున్నాం. మనం చేయాల్సిన కార్యమేమిటో కూడా స్పష్టంగా నిర్ణయించుకోలేకపోతున్నాం. మహాత్ముని పేర పాడుకున్న ప్రశ్నాపాదాలు నేటికీ పదునెక్కిన పదాలుగానే మనకెదురవుతున్నాయి. సత్యం, అహింస గురించి బోధించిన మహాత్మాగాంధీ అత్యంత హింసాత్మకంగా హత్యగావించబడిన డెబ్భయి ఐదేండ్ల తర్వాత హింస, అసత్యం ధర్మాలుగా ప్రవచించబడుతున్నాయి. ఇది సరికాదన్న చోట హింస చెలరేగుతోంది.
'ఈశ్వర్‌ అల్లా తేరానామ్‌, సబ్‌కో సమ్మతి దేభగవాన్‌' అని పాడుకున్న నాయకుని గుండెలపై తుపాకీ గుండు పేలిన విషాద సంఘటనకూ, ఇరువైయేండ్ల క్రితం గుజరాత్‌లో జరిగిన మారణకాండకు అవినాభావ సంబంధం ఉంది. రెండూ హత్యాకాండలే, ఇప్పుడు హత్యల గురించే మాట్లాడు కుంటున్నాం. మహాత్ముడి సత్యాహింసలు, సత్య్రాగ్రహా సూత్రాలు ప్రపంచ ప్రాచూర్యం పొందినట్లుగానే ఆ మహాత్మునికి జన్మనిచ్చిన నేలలో జరిగిన హింసోన్మాదం గురించీ ప్రపంచ మీడియా చర్చిస్తూన్నది. కానీ అధర్మం, అసత్యం రాజ్యమై సత్యాలోచనలను అణచివేస్తున్నది. విశేషమేమంటే సత్యమూ, అహింస గురించి ప్రబోధించిన గాంధీ జన్మభూమిలో నుండే హింస, అసత్య ప్రబోధకులూ నాయకులై ఎదిగి రాజ్యం చేస్తున్నారు. ఇదొక వైచిత్రి. ఆనాడు మహాత్ముణ్ణి జాతిపితగా పిలుచుకుని నేటికీ పూజనీయునిగా భావిస్తున్న ప్రజలే మరో వైపు అందుకు పూర్తి భిన్న ఆలోచనలు గల వారిని నేతలుగా కొలవటం అంటే... ఇంకా ఏది సత్యం, ఏదసత్యం? ఓ మహాత్మా! అనే మీమాంసలోనే ప్రజలు ఉన్నట్టు కదా! ఇంకా ముఖ్యమైన విషయమే మంటే, ఎవరైతే మహాత్ముని అంత మొందించారో, ఆ హంతకున్ని దేశభక్తుడుగా పేర్కొంటూ, అతని ఆలోచనతో కొనసాగే వారు నేడు మన పాలకులుగా కొనసాగడం బాధాకరమైన యధార్థం. అందుకనే గాంధీ వర్థంతి రోజు కానీ జయంతిరోజు కానీ గాంధీని గురించి మాట్లాడుతారు తప్ప అతన్ని హతమార్చిన హంతకుని గురించి చర్చే చేయరు.
అందుకే మనమిప్పుడు హంతకుల గురించి మాట్లాడుకోవాలి. అతని ఆలోచనలూ రాజకీయాల గురించీ చర్చించాలి. అప్పుడే సత్యా సత్యాల విషయం బోధపడుతుంది. మహాత్ముని ఎందుకు చంపాడు గాడ్సే. మత సామరస్యాన్ని బోధించినందుకు. హిందువులు, ముస్లింలు అన్ని మతాల ప్రజలు అన్నదమ్ములుగా సహనంతో జీవించాలని ఘోషించినందుకు మతోన్మాదికి ఆగ్రహం తెవచ్చింది. చెప్పేదానికి, చేసేదానికి భేదం ఉండరాదనీ సత్యాన్నే పలకాలనీ చెప్పాడు గాంధీ. ఇది కూడా వాళ్లకు నచ్చే విషయం కాదు. స్వేచ్ఛ, సమానత్వాలను కోరుకున్నాడు. ఇవేవీ గాడ్సే భావానుచరులకు మింగుడుపడని విషయాలు. అందుకే వాళ్లిప్పుడు సత్యం, న్యాయం, సమానత్వం గురించి మాట్లాడే వారిని అణచివేసే హత మార్చే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే పన్సారేను హతమార్చారు. కల్బుర్గీని, గౌరీలంకేశ్‌లను అంతమొందించారు. ఎవరు గొంతు విప్పినా నిర్భంధకాండకు పూనుకుంటున్నారు. ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మరోవైపు వాళ్ళు మాట్లాడుతున్న దానికీ ఆచరణకూ పూర్తి వైరుధ్యము కొనసాగుతున్నది. మత సామరస్యత పోయి, మత విద్వేషం, మానవతా విధ్వంసం పెల్లుబుకుతున్న సందర్భాన శాంతి, అహింసల గాంధీతత్వాన్ని చర్చించటం ఒక అవసరమే అనుకుంటా.
ఒక మతాన్ని అవలంభించినా పరమత సహనాన్ని బోధించి, ఆచరించిన వాడిగా, మన దేశ సామాజిక సాంస్కృతిక బహుళత్వాన్ని అర్థం చేసుకుని, ఐక్యతను సాధించాలని తపన పడిన నాయకుడిగా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర, ప్రజలను ఏకం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయే ఒక అధ్యాయం. కానీ నేడు గాంధీ చరిత్రనూ కనుమరుగు చేసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. గాంధీ ఆలోచనలపై ఆచరణపై భిన్నమైన అభిప్రాయాలెన్ని ఉన్నప్పటికీ నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకూ, భారతీయ జీవన గమనానికి ముంచుకొస్తున్న ముప్పుకూ ఆనాటి గాంధీని హతమార్చిన విద్వేష హింసాలోచనల పరంపరనే కారణమన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన హత్య ఒక ఉన్మాద సంఘటనయితే, ఇప్పుడదే ఉన్మాదం సామూహిక విపత్తుగా పరిణమించింది. దీన్ని అందరూ కలిసి ఎదుర్కోవాల్సి ఉంది. మహాత్ముని స్మరణకు సార్థకమదే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

06:57 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్ విడుద‌ల‌..

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.