Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దీపశిఖలు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

దీపశిఖలు

దక్షిణాఫ్రికాలో మహిళల తొలి అండర్‌-19 టీ20 వరల్డ్‌ కప్‌లో ఆదివారం సాయంత్రం భారతీయ బాలికలు ఇంగ్లండ్‌ జట్టును మట్టికరిపించి, ప్రపంచ విజేతగా నిలిచిన క్షణాలు. మహిళా క్రికెట్లో భారత్‌కిది మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ. ఈ ప్రతిభాపాటవాలు భారత మహిళా క్రికెట్‌ భవిష్యత్తుకు బలమైన పునాది. తెలుగమ్మాయిలు త్రిష, షబ్నమ్‌లూ మువ్వన్నెల పతాకను రెపరెపలాడించడంలో కీలక భూమిక పోషించారు. నిజానికి, అర్ధశతాబ్ద కాలంలో మన మహిళా క్రికెట్‌ అనేక శంఖలాలు తెంచుకొంది. పంజరాలను దాటింది. సామాన్య స్థాయి నుంచి అసామాన్యతకు ఎదిగింది. గడచిన రెండు సీనియర్ల టీ20 వరల్డ్‌ కప్‌లలో మన మహిళా జట్టు సెమీ ఫైనలిస్టుగా, ఫైనలిస్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో తాజా టీ20 కప్‌లో బాలికలు ఏకంగా విజేతలయ్యారు. ఇది వారి జీవితాల్లోనే కాదు.యావత్‌ భారత మహిళా క్రికెట్‌ చరిత్రలోనే కీలక మలుపు.
నిరుడు ఫిబ్రవరిలో 19 ఏండ్లలోపు అబ్బాయిలు జయకేతనం ఎగరవేస్తే.. నేడు షెఫాలీ వర్మ సేన అదే ఇంగ్లాడ్‌ను చిత్తుగా ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీ ఆసాంతం శ్వేత, షెఫాలీ, త్రిషలు పరుగుల వరద పారిస్తే, పార్శవి చోప్రా, మన్నత్‌ కశ్యప్‌, అర్చనాదేవి ప్రభృతులు వికెట్లు కూల్చి భారత్‌ను విజయపథాన నిలబెట్టారు. పురుషులతో పాటు సమాన పారితోషికం లేకున్నా, ఇంటా బయటా ఎన్ని అవమానాలు ఎదురైనా, ఆర్థిక, సామాజిక అవరోధాలున్నా అవన్నీ దాటుకొని వచ్చిన అమ్మాయిలు కాబట్టి తాజా విజయం మరింత గొప్పది. ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు కుటుంబానికే కాదు... దేశానికీ ఎంతటి పేరు తెస్తారో చెప్పడానికి ఇదొక తాజా దర్పణం. బ్యాడ్మింటన్‌ తర్వాత భారత మహిళా క్రీడాంగణంలో ఇక క్రికెట్‌ కొత్త దీపశిఖ.
వాస్తవానికి దేశం నలుమూలలా క్రీడా పాఠశాలల్లో రకరకాల సమస్యలు తిష్టవేయడం నిర్ఘాంతపరుస్తోంది. విజేతల సృజనలో తలమునకలు కావాల్సిన ప్రాంగణాలు శిక్షకుల కొరతతో, నిధుల లేమితో కిందమీదలవుతున్నాయి. ఒకప్పుడు దేశమంతటా మోతెక్కిపోయిన 'ఖేలో ఇండియా' స్ఫూర్తి నిలువునా నీరోడుతోంది! ఆ మాటకొస్తే, దక్షిణ భారతదేశంలోని మూడోవంతు పాఠశాలలకు ఆటస్థలాలు లేవు. బిహార్‌, ఒడిశా, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో మైదానాలు కలిగిన బడులు 40శాతం లోపే. దేశీయంగా అత్యంత నిరాదరణకు గురవుతున్న క్రీడల దౌర్భాగ్య పరిస్థితికి అధికారిక గణాంకాలే నిలువుటద్దం.
'కంప్యూటర్‌ ప్లే స్టేషన్‌లో కాదు... నిజమైన క్రీడామైదానాల్లో యువత స్వేదం చిందించాలి' అని 'మన్‌ కీ బాత్‌'లో ప్రధాని మోడీ పిలుపిచ్చారు. కానీ, అందుకు తగిన కార్యచరణ గురించి ఎప్పుడూ ప్రధాని ఉలకరూ,పలకరు. గత కొంత కాలంగా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలకు ప్రధాని మనసు అంగీకరించడం లేదు. ప్రతి పాఠశాలలోనూ ఆటస్థలం, క్రీడాసామగ్రి ఉండి తీరాలన్న విద్యాహక్కు చట్టం దశాబ్దాలుగా చట్టుబండలవుతోంది! పాఠశాల దశనుంచీ ఆటలకు ప్రోత్సాహం, అంశాలవారీగా ప్రత్యేక శిక్షణా సంస్థల అవతరణ, విస్తృత మౌలిక వసతుల పరికల్పనలకు విశేష ప్రాధాన్యమిస్తున్న చైనా, థారులాండ్‌, జపాన్‌, యూకే ప్రభత దేశాలు ప్రతిష్టాత్మక వేదికలపై పతకాల పంట పండిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటివి క్రీడను పరిశ్రమగా సమాదరిస్తూ అద్భుత ఫలితాలను ఒడిసిపడుతున్నాయి. అదే ఇక్కడీ ఉన్నత స్థాయి క్రీడా సదుపాయాలు, మేలిమి శిక్షణ ఏర్పాట్ల విషయంలో మాటలకు, చేతలకు మధ్య ఉన్న యోజనాల దూరం తరగడంలేదు.
ఇప్పుడు కండ్లు తెరిస్తే కనిపించే నిజం ఒక్కటే 'ఆడవాళ్ళకు ఆటలేమిటి' అన్న సమాజానికి ఇప్పుడు ఆ ఆడవాళ్లే విజయాలను అందిస్తున్నారు. పాఠశాలల్లో ఆడుకోవడానికి ఖాళీ స్థలం మొదలు కనీస సౌకర్యాలు కూడా కష్టమైన దేశంలో, మార్కులు తప్ప ఆటలెందుకని ఆలోచించే పెంపకంలో, 'వంటింట్లో తప్ప మైదానంలో ఆడవాళ్ళకేం పని' అనే పాలకనేతల మానసిక స్థితి మారనంత కాలం ఇంతే. ఎంత ప్రతిభ ఉన్నా ఆర్థిక, హార్దిక ప్రోత్సాహం కరమైన పరిస్థితుల్లో, ఆటల్లోనూ అధికార, కులమత రాజకీయ రొచ్చు క్రీడల్లో సైతం చొరబడటం శోచనీయం. ప్రభుత్వాలు మెండి చేయి చూపినా పట్టుదలతో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిసారీ దేశ ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకొంటున్న మగువలను అభినందించాలి. ఇకనైనా, తరతరాలుగా సమాజంలో అణచివేతకు గురైన స్త్రీమూర్తులకు ఇంటా బయటా తగినంత ప్రోత్సాహం, శిక్షణ అందించడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. అతివలంటే అబలలు కాదని నిరూపించిన వీర వనితలకు జేజేలు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.