Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి! | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2023

తైవాన్‌ పేరుతో చైనాపై అమెరికా దాడి!

తిట్టే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండవు. ఎప్పుడూ ఏదో ఒకటి కల్పించుకోకపోతే వాటికి తోచదు. ఉన్మాదులు అది మతం లేదా యుద్ధోన్మాదులు ఎవరైనా సరే వారంతే. ప్రపంచం మీద పెత్తనం తద్వారా తమ కార్పొరేట్లకు లాభాలను తేవటం సామ్రాజ్యవాదుల నిరంతరపని. తమ సరకులకు మార్కెట్‌ కోసం భారత్‌కు సముద్ర మార్గం కనుగొనాలంటూ నాటి కొలంబస్‌ను సముద్ర యాత్రకు పంపిన స్పెయిన్‌ పాలకుల మొదలు నేటి అమెరికా ఏలికల వరకు చేస్తున్నది అదే. ఇప్పుడు కొలంబస్‌లతో పని లేదు. దేశాలను ఆక్రమించుకొనేం దుకు అవకాశం అంతకన్నా లేదు. సామ్రాజ్యవాదులు గతంలో ప్రపంచాన్ని ఆక్రమించుకొనే క్రమంలో సృష్టించిన అనేక సమస్యలు, వివాదాలతో కొన్ని దేశాలు ఇప్పుడు సతమతమవుతున్నాయి. వాటిని సాకుగా తీసుకుని తమ అజెండాను అమలు జరిపేందుకు పూనుకున్న సామ్రాజ్యవాదులు అందుకోసం గిల్లికజ్జాలను పెట్టుకుంటున్నారు. అందుకు గాను ముందుగా తొత్తులను ప్రయోగిస్తారు.
చైనాలో విలీనం కావాల్సిన తైవాన్‌ గురించి రెచ్చగొట్టేందుకు ఇటీవల అమెరికా వేగంగా పావులు కదుపుతోంది. దానిలో భాగంగానే ఈ ఏడాది తొలిసారిగా తూర్పు ఐరోపా దేశమైన చెక్‌ రిపబ్లిక్‌ను పురికొల్పింది. అది హైదరా బాద్‌ మహా నగ రానికి సమానమైన కోటి మంది జనాభా కలిగిన చిన్న దేశం. చైనాతో పోల్చు కుంటే దేనిలోనూ సరితూగలేదు. కానీ అమెరికా, ఐరోపా ధనిక దేశాల అండ చూసుకొని చైనాను గిల్లేందుకు పూనుకుంది. అక్కడ తాజాగా ఎన్ని కైన అధ్యక్షుడు పీటర్‌ పావెల్‌ సోమవారం నాడు తైవాన్‌ పాలకురాలు శాయి లింగ్‌ వెన్‌తో ఫోన్లో మాట్లాడి తైవాన్‌ వేర్పాటు వాదానికి మద్దతు ప్రకటించాడు. గతంలో ఐరోపాలోని ఏ దేశ అధినేత కూడా ఇలా మాట్లాడలేదు. త్వరలో తాను స్వయంగా ఆమెను కలుసుకుంటానని చెప్పాడు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆ మాట చెప్పినప్పటికీ ఎన్నిక తర్వాత అధికారికంగా మాట్లాడినదానికి తేడా ఉంటుంది.
తాము గీచిన గీతను కాలుతో చెరిపేందుకు చెక్‌ అధ్యక్షుడు పూనుకున్నాడని, చైనా పౌరుల మనోభావాలను గాయపరిచినట్లు చైనా ప్రతినిధి మావో నింగ్‌ ప్రతిస్పందించింది. చేసిన తప్పును సరిచేసుకొనేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చైనా డిమాండ్‌ చేసింది. పీటర్‌ పావెల్‌ ఫోన్‌ సంభాషణ తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని చైనా విదేశాంగ శాఖలో ఐరోపా విభాగ అధిపతి వాంగ్‌ లుటోంగ్‌ ట్వీట్‌ చేశాడు. తైవాన్‌లో జోక్యం చేసుకొని సంబంధాలు నెలకొల్పేందుకు పూనుకున్న లిధువేనియాపై ఇటీవల చైనా ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారంలో విలేకర్లు అదే అంశాన్ని పావెల్‌తో ప్రస్తావించగా అయినా సరే ముందుకు పోతానని చెప్పాడంటే వెనుక పశ్చిమదేశాల అండ ఉండబట్టే అన్నది స్పష్టం. తైవాన్‌ పాలకురాలితో తాను మాట్లాడటం చైనాకు అంగీ కారం కాదని తెలిసినప్పటికీ ఒక స్వతంత్ర దేశంగా తమకు ఎవరితో మాట్లాడేందుకైనా హక్కు ఉందని, తానేమీ విచారపడటం లేదని పావెల్‌ సమర్ధించుకున్నాడు. పావెల్‌ తైవాన్‌కు వెళ్లే ముందు చైనా స్పందనను పరీక్షించేందుకు మార్చి నెలలో చెక్‌ పార్లమెంటు స్పీకర్‌ తైపే వెళ్లనున్నట్లు వార్తలు.
ఇక అసలు సూత్రధారి అమెరికాను చూస్తే 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు తైవాన్‌లో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. అందువలన ఆ తరుణంలో చైనా ముందుకు పోవచ్చని, 2025లో తైవాన్‌ పేరుతో చైనాపై డాడికి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జనరల్‌ మినిహాన్‌ చెప్పినట్లు జనవరి చివరి వారంలో వెల్లడైంది. ఈ అంశాన్ని అనధికారిక లీకుల ద్వారా వెల్లడించారు. రెండు సంవత్సరాల్లో తైవాన్‌ అంశంపై చైనాతో జరిగే యుద్ధానికి సిద్ధం కావాలని తన ఆధీనంలో నడిచే ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ సిబ్బందితో చెప్పాడు. పోరు జరుగుతున్నపుడు యుద్ధ విమానాలకు ఇంథనం నింపే ప్రక్రియ గురించి జారీ చేసిన ఒక పత్రంలో దీని గురించి పేర్కొనట్లు ఒక టీవీ ఛానల్‌ పేర్కొన్నది. నిజానికిది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.2021లోనే అమెరికా పార్లమెంటుకు అమెరికా నౌకాదళ అడ్మిరల్‌ ఫిల్‌ డేవిడ్సన్‌ చైనా గురించి ఆందోళన వెల్లడిస్తూ 2027కు ముందే తైవాన్‌ స్వాధీనం జరుగు తుందని అందువలన దాన్ని అడ్డుకొనేందుకు అమెరికా వేగంగా కదలాలని పేర్కొన్నాడు. అనుకుంటున్నదాని కంటే ముందే ఎంతో వేగంగా తైవాన్‌ విలీన ప్రక్రియకు చైనా పూనుకొనే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ 2022లో చెప్పాడు.జనరల్‌ మినిహాన్‌ ఆసియా పసిఫిక్‌ కమాండ్‌ ఉప అధిపతిగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన తరువాత వైమానిక విభాగ అధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. అతనితో పాటు అనేక మంది మిలిటరీ అధికారులు కూడా సన్నాహాలు జరగాలని చెబుతున్నారు.
ఒక వైపు యుద్ధోన్మాదం మరోవైపు చైనాతో తలపడితే భారీ ప్రాణ నష్టం జరుగుతుందనే భయం కూడా అమెరికాలో ఉంది. వేల కిలోమీటర్ల దూరం వెళ్లి చైనా మీద టాంకులతో పోరుకు దిగటం సరికాదని, క్షిపణి, వైమానిక దాడుల మీద కేంద్రీకరించాలని సూచించేవారు కూడా ఉన్నారు. చైనాను దారికి తెచ్చేందుకు అవసరమైన నౌకలు, ఆయుధ నిల్వలకు పెట్టు బడులు పెట్టటం లేదని మాజీ నౌకా అధికారి సేత్‌ క్రాప్‌సే వంటి వారు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి గుంజాటనలు ఉండగా పౌరుల స్పందన గురించి భయం కూడా ఉంది. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా ఒకే చైనాను అధికారికంగా గుర్తించి సంబంధాలు పెట్టుకున్న తరువాత ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో రక్తాన్ని చిందించటాన్ని అమెరికా సమాజం అంగీకరించే అవకాశాలు తక్కువ. అందువల్లనే జనంలో కూడా అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు అమెరికా నానా తంటాలు పడుతున్నది. అభూత కల్పనలతో ప్రచారదాడి జరుపుతున్నది. అనవసరంగా తమతో పెట్టుకుంటే తగిన శాస్తి చేస్తామని గతంలో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే !

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.