Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సినీ ఘనుల నిష్క్రమణ | సంపాదకీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2023

సినీ ఘనుల నిష్క్రమణ

          గత కొద్ది కాలంగా సినిమారంగ ప్రముఖులు అనేకమంది సెలవంటూ వెళ్లిపోతున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ మరణించిన కొద్ది రోజులకే కైకాల సత్యనారాయణ నిష్క్రమించారు. మొన్న సినీ సత్యభామ జమున, నిన్న కళాదర్శకుడు కె. విశ్వనాథ్‌ మృతి చెందగా, ఇప్పుడు అకస్మాత్తుగా మధురస్వరగాన వాణీ జయరాం వెళ్ళిపోయారన్న వార్త సినీరంగాన్ని ప్రేక్షకులనూ బాధకు గురిచేసింది. వీరంతా దాదాపు యాభైయేండ్లుగా అంతకుపైగా సినిమారంగంలో కళాత్మక సృజనతో కొనసాగినవారే. జేమ్స్‌ బాండ్‌ హీరోగా, మాస్‌ కథానాయకుడుగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కృష్ణ అల్లూరి సీతారామరాజుగా చెరగని ముద్రవేసిన నటుడు ఆయన. ఇక నవరసాలను పలికించగలిగి యముడంటే ఇలానే ఉంటాడనిపించిన సత్యనారాయణ విలన్‌గా, హాస్య నటుడుగా మెప్పించిన నటసార్వభౌముడు. సత్యభామ పాత్రలో తన సహజగుణ నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించి పేరు తెచ్చుకున్న జమున, ప్రజా కళాకారుడు గరికపాటిరాజారావు శిష్యరికంలో, అతను నిర్మించిన 'పుట్టిల్లు' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి అనేక చిరస్మరణీయ పాత్రలలో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. వీళ్లంతా పాతతరం వాళ్లే. సినిమా రంగంలోనే కాదు, సమాజంలోనూ అనేక మార్పులు, ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎంతో పెరిగింది. ఇప్పటి సినిమాతో పోల్చకపోయినా ఆనాటి చిత్రాల ప్రత్యేకత ఏమీ తక్కువ చేయలేము.
          సినిమా అనేది మన సామాజిక నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూనే ఉంటుంది. దీంతో సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. రాజకీయ ఆర్థిక ప్రభావాలూ వాటిపై ఉంటాయి. జనం నాడిని పట్టుకోగలిగిన రచయితలు, దర్శకులు జనం ఆదరించే చిత్రాలను నిర్మించ గలుగుతారు. ఇంకొందరు సాధారణ ప్రజల హృదయాలను కదిలించే పనికి తమ కళను ఉపయోగించి చిత్రాలు తీస్తారు. ఇవి అనుభూతి ప్రధానంగా సాగుతాయి. ఇక జీవన వాస్తవికతలను చిత్రిస్తూనే ఉన్నత విలువలను, కర్తవ్యాలను కళాత్మకం చేస్తారు. ఇవి సామాజిక మార్పుల కోసం చైతన్యాన్ని అందిస్తూ ఉంటాయి. ఎన్ని రకాలుగా సినిమాలొస్తున్నా వాటిని ఏ విభాగానికి చెందిందో తేల్చేది కళా విమర్శకులు. కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం కళాసృజనకు ప్రియులుగానే ఉంటారు. అభిమానించే కథానాయకులు, నాయికలూ వారికుంటారు. ఆ చిత్రాలను రచించిన, దర్శకత్వం వహించిన వారిని గుర్తించడమనేది చాలా కాలం తర్వాతే జరిగింది. నటీనటులు ఎవరు అని గతంలో సినిమాలు చూసేవారు. ఇప్పుడు దర్శకులు ఎవరు అని తెలుసుకుని చూడటమూ జరుగుతోంది. ఇదొక పరిణామం.
కె. విశ్వనాథ్‌ సినిమాలు ఒక తరహా సినిమాలుగా ప్రసిద్ధి చెందినవి. కళాత్మక విలువలతో సినిమా తీస్తాడనే పేరువల్ల ఆయనను కళాతపస్వీ అని కూడా అంటారు. 'శంకరాభరణం' సినిమాతో తెలుగునేలపైనే కాదు, దేశం మొత్తంలోనే ఒక గొప్ప పేరును పొందారు. సంగీత ప్రాధాన్యాన్ని చిత్రీకరించిన సినిమా అది. మన సంప్రదాయ సాహిత్యమూ సంగీతమూ రెండూ కూడా ఆధ్యాత్మిక ధార్మిక సంబంధమైనవిగానే భావిస్తారు. ఆ రకమైన భావాన్నే ఆయన మరింత కళాత్మకంగా చిత్రీకరించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు సినిమాలు కూడా సంగీత నృత్య ప్రధానమైనవే. ఇక సప్తపది, శుభసంకల్పం, శుభలేఖ, స్వయం కృషి, సూత్రదారులు మొదలైన చిత్రాలలో సామాజిక సమస్యలను కొంత చర్చించారు. ఇప్పుడున్న వ్యవస్థలోనే సంస్కరణ తేవాలన్న కోరిక తపన ఉన్న దర్శకుడుగా మనం విశ్వనాథ్‌ను చూడవచ్చు. వినసొంపైన సంగీతాన్ని, సాహిత్యాన్ని తిరిగి సినీరంగంలోకి తెచ్చినవాడు, సంప్రదాయ, సంస్కరణ కళా దర్శకుడు విశ్వనాథ్‌.
ఇక యాభైయేండ్ల పాటు వేయిసినిమాలలో పదివేల పాటలు పాడిన వాణీజయరాం (కలైవాణి) ఆకస్మిక మరణం సినీసంగీత రంగానికి లోటుగానే భావించాలి. విశ్వనాథ్‌ సినిమాలలో అనేక పాటలు పాడారీమె. 'దొరుకునా ఇటువంటి సేవా', 'ఆనతి నీయవా హరా!', 'మానస సంచరరే..', అందెల రవళిది పదమునదా', 'ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ...' 'ఒక బృందావనం - సోయగం' మొదలైన ఎన్నోపాటలతో శ్రోతల అభిమానాన్ని పొందింది వాణీజయరాం. తమిళనాడులో జన్మించిన వాణి, ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఖాన్‌ దగ్గర హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు. కర్నాటక సంగీతాన్ని అవపోసన పట్టారు. ముత్తుస్వామి దీక్షితార్‌ కీర్తనలను బాగాపాడగలిగిన ఆమె పద్దెనిమిది భాషలలో పాటలు పాడారు. ఆమె మొదటి సినిమా పాట హృషీకేష్‌ ముఖర్జీ సంగీత సారథ్యంలో 'గుడ్డి' సినిమాలోని 'బోల్‌రే పప్పీ హరా!' అనే పాటకు తాన్‌సేన్‌ సమ్మాన్‌ అవార్డు అందుకున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు జాతీయ అవార్డులందుకున్న ఆమెను పద్మభూషణ్‌ పురస్కారానికి ఇటీవలనే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమెది ఒక విభిన్నమైన కంఠస్వరం. పాటలున్నంత వరకూ ఆమెను తలచుకుంటూనే ఉంటాం. రెండు నెలల కాలంలోనే ఇందరు సినీ కళాకారులు మన నుండి దూరమయ్యారు. వారందరికీ కళాంజలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చీకటిని చెరిపేద్దాం
బట్టకాల్చి మీదేస్తే చెల్లదు!
చైనా శాంతి మంత్రం - నాటో యుద్ధోన్మాదం!
ఒక ట్వీట్‌... అరెస్ట్‌...
అ'న్యాయం'!
కరెంటు డామిట్‌ కథ అడ్డం తిరిగింది!
తెలుగు పాటకు జేజేలు
మోడీ ఈడీ
తప్పెవరిది..? శిక్షెవరికి...?
సముద్రగర్భ పోరుకు తెరతీసిన అమెరికా!
గురివింద సూక్తి ముక్తావళి!
ఉలికిపాటెందుకు?
అపాయం..ఊబకాయం!
అబద్దాల 'కోర'లు
సవాళ్లు అధిగమిస్తూ... కొత్త అడుగులేస్తూ...
గర్భ 'సంస్కారం'
టెన్నిస్‌కు సానియా గుడ్‌బై
ప్రజలపై 'గ్యాస్‌' భారం
పదునుతేరాలి
'నమోక్రసీ'పై సుప్రిమెసీ..!
చైనాపై అమెరికా 'ప్రచార దాడి'
ఈ గుండెకోతకు బాధ్యులెవరు?
ప్రశ్నిస్తే దేశద్రోహమా..?
ఎండలు మండే కాలం...
''ఇస్‌ దేశ్‌ మే కాబా?''
చైనా పురోగమనాన్ని అడ్డుకోగలరా?
వ్యధ ఒకటే! కథా ఒకటే!
ఈ ఘోరానికి బాధ్యత ఎవరిది..?
ఈ పనికి ముగింపు ఎన్నడు?
'ఉపాధి'కి కేంద్రం సమాధి!

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.