Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ నిబంధనలు దుర్వినియోగం! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2021

ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ నిబంధనలు దుర్వినియోగం!

- భారీ ఆర్థిక నష్టాన్ని సైతం కలిగిస్తున్నాయి
- అంతర్జాల షట్‌డౌన్‌ల వివరాలే కేంద్రం వద్దలేవు
- అధిక జనాభాకు వ్యతిరేకంగా ఉపయోగపడరాదు
- విస్త్రృతంగా అధికార దుర్వినియోగం
- ఐటీ పార్లమెంట్‌ ప్యానెల్‌ నివేదిక
న్యూఢిల్లీ : భారతదేశంలో ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లను నియంత్రించే నియమాలు ''తీవ్రంగా దుర్వినియోగం'' అవుతున్నాయి. ఇది భారీ ఆర్థిక నష్టానికి దారితీసింది. వినియోగదారులతో పాటు ప్రజానీకానికి సైతం వర్ణించలేని విధంగా బాధలను మిగిల్చింది. మరీ ముఖ్యంగా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. మొత్తంగా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ నియమాల విషయంలో అధికార దుర్వినియోగమవుతున్నతీరు.. దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పార్లమెంటరీ ప్యానెల్‌ నివేదిక పేర్కొంది. టెలికామ్‌ లేదా ఇంటర్నెట్‌ షట్‌ డౌన్‌ల యోగ్యత లేదా సముచితత్వంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ ప్యానెల్‌ సిఫారసు చేసింది.
   తాజగా కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఐటీపై స్టాండింగ్‌ కమిటీ టెలికామ్‌ సర్వీసెస్‌ (పబ్లిక్‌ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్‌ సర్వీస్‌) రూల్స్‌-2017 తాత్కాలిక సస్పెన్షన్‌ పై ఓ నివేదికను సమర్పించింది. పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదిక వివరాలు ఇలావున్నాయి.. 'టెలికాం సర్వీసెస్‌/ఇంటర్నెట్‌ సస్పెన్షన్‌ దాని ప్రభావం' అనే శీర్షికతో పార్లమెంటరీ కమిటీ ఈ నివేదికను సమర్పించింది. డిజిటలైజేషన్‌, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్నెట్‌ లేదా టెలికామ్‌ సేవలను షట్‌డౌన్‌ చేయవద్దని నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపైనా, ప్రజలపైనా ప్రభావం పడుతున్నదని తెలిపింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్‌.. సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాను ఉటంకిస్తూ, టెలికామ్‌ ఆపరేటర్లు షట్‌ డౌన్‌ లేదా థ్రోట్లింగ్‌ ఉన్న ప్రతి సర్కిల్‌ ప్రాంతంలో గంటకు 2.45 కోట్లు నష్టపోతున్నారని తెలిపారు. ''ఇంటర్నెట్‌పై ఆధారపడే ఇతర వ్యాపారాలు పైన పేర్కొన్న మొత్తంలో 50 శాతం వరకు కోల్పోతాయి'' అని నివేదిక పేర్కొంది.ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లను పర్యవేక్షించాల్సి న అవసరం ఉన్నదనీ, తద్వారా ఈ చర్యలు అధిక జనాభాకు ప్రతికూలంగా ఉపయోగించబడకుండా చూడాలని ప్యానెల్‌ తన నివేదికలో పేర్కొంది.ఇక 2020-జనవరిలో జమ్మూకాశ్మీర్‌లో టెలికామ్‌ కమ్యూనికేషన్‌ల నిలిపివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఏదైనా నిరవధిక సస్పెన్షన్‌ సాధారణ న్యాయ పరిశీలనకు లోబడి ఉంటుందని ఆదేశాలు ఉన్నాయి, అలాగే, టెలికామ్‌ కమ్యూనికేషన్‌ల సస్పెన్షన్‌కు సంబంది óంచిన వివరణాత్మక కారణాలను ప్రభుత్వం అందించాల్సి వుంటుంది. తద్వారా బాధిత వ్యక్తులు కోర్టులో వారిని సవాలు చేయవచ్చు. దీనిని అనుసరించి, జారీ చేయబడిన ఏదైనా సస్పెన్షన్‌ ఆర్డర్‌ 15 రోజుల కంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని ఆదేశిస్తూ 2020-నవంబర్‌లో సవరించ బడ్డాయి. మొత్తంగా టెలికామ్‌ కమ్యూనికేషన్‌ల సస్పెన్షన్‌ ఆర్డర్లు దామాషా సూత్రానికి కట్టుబడి ఉండాలని నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. అయితే, టెలికామ్‌ కమ్యూనికేషన్‌ ల షట్‌డౌన్‌లకు సంబంధించి వివరాలు, జాతీయ భద్రతకు సంబంధించిన రికార్డులు లేవు. పలు నిబంధనలు సైతం అస్పష్టంగా ఉన్నాయి.బీహార్‌, జమ్మూకాశ్మీర్‌ సహా అనేక రాష్ట్రాలు 2019-20లో పలుమార్లు ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ను కొనసాగించాయని పార్లమెంటరీ ప్యానెల్‌ పేర్కొంది. దీనికి సంబంధించి కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ గానీ, హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్దగాని ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ ఆర్డర్‌ల రికార్డులు లేవు. వాటిని ఇవి నిర్వహించలేదు. రాష్ట్రాలు ఎన్ని ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు విధించాయో తమకు తెలియదని సంబంధిత అధికారులు ప్యానెల్‌కు తెలిపారు. ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ విధించేందుకు నిర్దిష్ట పరిమితులు కూడా నిర్ధేశించబడలేదు. దీని వల్ల కార్యనిర్వాహక నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. దీని వల్ల అధికార దుర్వినియోగం అధికమవుతోంది అని పార్లమెంటరీ ప్యానెల్‌ పేర్కొంది. అలాగే, జమ్మూ కాశ్మీర్‌లో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఇంటర్నెట్‌ షట్‌డౌన్లపై ప్యానెల్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వృద్ధులకేది భరోసా!
సమ్మెకు సై
40 శాతం మందికే పని
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జై జవాన్‌... జై కిసాన్‌
ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌
అభిప్రాయాలను ప్రచురించొచ్చు ప్రసారం చేయొచ్చు
నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక ద్విముఖ పోటీ
భార్యలకు బదులు సర్పంచ్‌లుగా
కేవలం 0.37 శాతమే
ఆధార్‌-ఓటరు ఐడీ అనుసంధానం తొందరపాటు చర్య
డేటా ప్రొటెక్షన్‌ బిల్లుపై కేంద్రం వెనక్కి!
పట్టణాల్లో నిరుద్యోగం పైపైకి
అహేతుకమైన ఉచిత పథకాలపై నిపుణుల సంఘం
కేంద్ర సాయుధ బలగాల్లో మహిళా ఉద్యోగులు 34 వేల మంది
నేషనల్‌ హెరాల్డ్‌ ఆఫీస్‌కు సీల్‌..!
డోపింగ్‌ నిరోధక బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం
ప్రతిపక్ష పార్టీలే కేంద్ర ఏజెన్సీల టార్గెట్‌
బ్రాండిక్స్‌లో మళ్లీ గ్యాస్‌ లీక్‌
సుప్రీంకోర్టుకు పెగాసస్‌ నివేదిక
సామాన్యులకు భారాలు.. సంపన్నులకు రాయితీలా..?
విద్యుత్‌ సంస్కరణలు తెస్తే ఊరుకోం...
5జి వేలం అట్టర్‌ ఫ్లాప్‌..!
మధ్యప్రదేశ్‌లో ఘోరం
మంకీపాక్స్‌పై కేంద్రం టాస్క్‌ఫోర్స్‌
జులైలో రూ.1.49 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
జాతీయ ఆస్తులు లూటీ
ఉపాధి హామీ నిధులను విడుదల చేయాలి
పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా..
ఇచ్చిన హామీల అమలేది?
ఈడీ అదుపులో సంజయ్ రౌత్‌

తాజా వార్తలు

12:10 PM

బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కలియతిరిగిన గవర్నర్

12:06 PM

అమెరికాలో మరోసారి కాల్పుల మోత...

11:56 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

11:50 AM

ప్రశాంతంగా కొనసాగుతున్న ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ పరీక్ష

11:41 AM

దేశంలో కొత్తగా 18,738 కరోనా కేసులు

11:40 AM

కాబూల్‌లో మరోసారి పేలుళ్లు.. 8 మంది మృతి

11:33 AM

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

11:29 AM

కామన్వెల్త్ క్రీడల్లో భవీనా పటేల్ సరికొత్త చరిత్ర

11:27 AM

షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం

11:21 AM

తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలకు రూ. 1,479 కోట్లు విడుదల

06:44 AM

వెస్టిండీస్‌తో నాలుగో టీ 20లో భారత్ విజయం

06:35 AM

కేంద్ర విద్యుత్తు చట్టసవరణపై నేడు నిరసన

08:57 PM

ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తొలి విమానం

08:30 PM

ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌కఢ్ గెలుపు

07:37 PM

వీర మహిళలను సత్కరించిన పవన్ కల్యాణ్

07:11 PM

రాష్ట్ర ఏర్పాటులో సుష్మ స్వరాజ్ పాత్ర కీలకం..వడ్డీ మోహన్ రెడ్డి

07:03 PM

సూర్యాపేటలో ముగ్గురు సీఐల బదిలీ

06:35 PM

ముగిసిన ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌

06:06 PM

ఇంగ్లండ్ విజయ లక్ష్యం 164 పరుగులు

05:57 PM

కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన...

05:14 PM

దేశంలో ద్వేషం, అసహనం పెరిగాయి: కేసీఆర్

05:02 PM

మరో నాలుగేళ్లలో రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్

04:53 PM

కరోనా కేసులపై 7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

04:44 PM

దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ను వీడటం బాధాకరం...జీవన్ రెడ్డి

04:40 PM

రామగుండం ఎన్టీపీసీలో ప్రమాదం

04:35 PM

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా : సీఎం కేసీఆర్‌

04:17 PM

బీబీకా ఆలంలో వైఎస్ ష‌ర్మిల మొహ‌ర్రం పూజ‌లు

04:08 PM

కంకిపాడు పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తం

04:04 PM

సూసైడ్‌ లెటర్‌ రాసి నారాయణ కళాశాల లెక్చరర్‌ ఆత్మహత్య

04:01 PM

వైరల్ అవుతున్న బాసర ఆర్జీయూకేటీ భోజనశాల సిబ్బంది నిర్వాకం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.