Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఘనతంత్రం.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 27,2022

ఘనతంత్రం..

- సాయుధ పోలీసుల పహరా మధ్య రిపబ్లిక్‌ డే వేడుకలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర దినోత్సవ సంబరాలు అట్టహా సంగా జరిగాయి. రాజ్‌పథ్‌ మార్గంలో నిర్వహించిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా పరేడ్‌ చివరిలో భారత వాయుసేన గగనతలంలో ప్రదర్శిం చిన విన్యాసాలు హైలైట్‌ గా నిలిచాయి. ఇక సరిహద్దు భద్రతా దళానికి చెందిన 'సీమా భవాని మోటార్‌ సైకిల్‌ బృందం' చేసిన విన్యాసాలు అదరహౌ అనిపించాయి. రాజ్‌ పథ్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర పతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్‌పథ్‌కు వచ్చాక రాష్ట్రపతి కోవింద్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోడీ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రధానం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూ కాశ్మీర్‌ ఏఎస్‌ఐ బాబురామ్‌కు అశోక్‌ చక్ర పురస్కా రాన్ని ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి అందజేశారు. గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సాయుధ పోలీసులను మోహ రించారు. సాయుధ పోలీసుల పహరా మధ్య రిపబ్లిక్‌ డే వేడుకలు జరిగాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలు గత ఏడాది మాదిరిగా కాకుండా ఎలాంటి సం ఘటనలు జరగకుండా ఢిల్లీలోని టిక్రీ, సింఘు, ఘాజీపూర్‌ తో సహా అన్నిప్రధాన సరిహద్దు ప్రాంతాలను మూసివేశారు. సరిహద్దు పాయింట్ల వద్ద అదనపు పికెట్‌లను మోహ రించి, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల ను ముమ్మరం చేసేందుకు ఢిల్లీలో రిపబ్లిక్‌ డే భద్రతా విధుల కు 27,000మంది పోలీసులను మోహరించినట్లు ఢిల్లీ పోలీ సు అధికారులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్‌ కమిషనర్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, సాయుధ పోలీసు బలగాలు కమాండోలు, సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ జవాన్లను మోహరించారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన సిసిటివిలను అమర్చారు. అన్ని ఎత్తైన భవనాలు రూఫ్‌టాప్‌ ఏర్పాట్లతో కప్పారు. ఢిల్లీలో ఉగ్రవాద నిరోధక చర్యల్లో నాకా బందీ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
అమర జవాన్లకు ప్రధాని నివాళి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఇండియా గేట్‌ సమీపంలోని జాతీయ యుద్ధ
స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేసిన అమర జవాన్లకు ప్రధాని మోడీ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోడీ సంతకం చేశారు.
ఆలస్యంగా ప్రారంభమైన పరేడ్‌
సాధారణంగా ప్రతి ఏటా ఉదయం 10 గంటలకు పరేడ్‌ ను ప్రారంభిస్తారు. అయితే ఈసారి ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల దష్ట్యా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. కరోనా థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. 2,500 మందిని రాజ్‌పథ్‌లో పరేడ్‌ చూసేందుకు అనుమతించారు. 15 ఏళ్లలోపు వారికి అనుమతి లేదు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు. దేశవ్యాప్త పోటీల నుంచి ఎంపిక చేసిన 480 బందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. రాజ్‌పథ్‌ మార్గంలో అటూ ఇటూ అయిదేసి చొప్పున పది భారీ ఎల్‌ఈడి తెరలను ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకల విశేషాలు, సాయుధ దళాలపై చిత్రీకరించిన లఘు చిత్రాలు కవాత ప్రారంభానికి ముందు ఎల్‌ఈడి తెరలపై ప్రదర్శించారు.
ఆయుధ సంపత్తిని చాటిన వాయుసేన
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. భారతీయ వాయుసేన 75 యుద్ధ విమానాలతో గ్రాండ్‌ ప్లైపాస్ట్‌ నిర్వహించింది. పాత విమానాలతో పాటు ఆధునిక ఎయిర్‌ క్రాఫ్ట్లు, రాఫెల్‌, సుఖోరు, జాగ్వర్‌, అపాచీ వంటి ఫైటర్‌ జెట్స్‌ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. గగనతంలో చేసిన ఈ విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాలుగు ఎంఐ-17 ఎయిర్‌ క్రాఫ్ట్లు 'ధ్వజ్‌' ఆకతిలో చేరి ఈ విన్యాసాలను ప్రారంభించాయి. ఆ తరువాత అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు 'రుద్ర', 'రహత్‌' ఆకృతులను ప్రదర్శించాయి. ఇక 17 జాగ్వర్‌ యుద్ధ విమనాలు 'అమృత్‌' (75 సంఖ్య ఆకృతి ) రూపంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వాయుసేనలో ఇటీవలే చేరిన రాఫెల్‌ విమానాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. తొలిసారిగా భారత వాయుసేన కాక్పిట్‌ నుంచి వీక్షణను అందించింది. వాయుసేన విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా.. కాక్పిట్‌ నుంచి చిత్రీకరించిన వీడియోలను ప్రదర్శించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి కోటి వేతనం
యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం
హిందుస్థాన్‌ జింక్‌ పూర్తిగా ప్రయివేటీకరణ
కాంగ్రెస్‌కు మరో షాక్‌?
ఇండిగోకు ఇంధన ధరల దెబ్బ
బీహార్‌లో కుల గణన!
టార్గెట్‌ @ 2024
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
కఠిన చర్యలు తప్పవు
పంజాబ్‌ మంత్రి అరెస్టు
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత
30న ధర్నాలను జయప్రదం చేయండి
అలుపెరగని పోరాట యోధుడు
ముస్లిం ప్రార్థనా మందిరాలే టార్గెట్‌
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత
పర్యాటకంలోనూ భారత్‌ వెనుకబాటు
మీ సేవలు అద్భుతం..
అంతర్జాతీయ పురస్కారం ఎంతో గర్వకారణం..
జడ్జీలను లక్ష్యంగా చేసుకోవడం 'ఫ్యాషన్‌'గా మారింది
సీపీఎస్‌ను రద్దు చేయండి
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌
ప్రపంచ ఆకలి తీవ్రం
వైద్యం తీరు మారాలి
ఢిల్లీలో గాలి దుమారం
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా వినయ్ కుమార్‌ సక్సేనా..
హిట్లర్‌, ముస్సోలిని కన్నా బిజెపి పాలన దారణం : మమతా
27 మందికి కరోనా
సీనియర్‌ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించండి..
జ్ఞాన్‌వాపీ మసీదు కేసు
రేషన్‌ బియ్యం మాఫియాపై సిఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.