Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పెద్దల చేతుల్లోకి.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2022

పెద్దల చేతుల్లోకి..

- అటవీ హక్కుల చట్టానికి తూట్లు
- కార్పొరేట్లకు అటవీ భూములు
- బీజేపీ రాష్ట్రాలైన బీహార్‌, యూపీ, ఉత్తరాఖండ్‌లు దారుణం
- ఇతర రాష్ట్రాలు బెటర్‌
- ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల చక్కటి ప్రదర్శన
    కార్పొరేట్లు అడిగిందే తడువు.. ప్రాజెక్టులే కాదు. పచ్చని అడవులను అప్పగించటానికి మోడీ సర్కార్‌ సన్నద్ధమైపోతోంది. సంపన్నులు కోరుకున్న విధంగా చట్టాలను చుట్టాలుగా మార్చేయటానికి వెనుకాడటంలేదు. అటవీసంపదపైనే ఆధారపడి బతుకుతున్న గిరిజనం హక్కులకు పాతరేస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. కేంద్రం,ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు అభివృద్ధిని గాలికొదిలేసి, ఓట్లరాజకీయాలకే పరిమితమవుతున్నాయన టానికి తాజా నివేదికలే సాక్ష్యం..
న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం ఏ అంశాన్ని ప్రస్తావించినా దాని వెనుక ఓటు రాజకీయం దాగి ఉంటోంది. ఇటీవల నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రధాని మోడీ ఉపన్యసించారు.వాస్తవానికి ఏడేండ్ల కింద అధికారంలోకి రావటానికి నేతాజీ మిస్టరీ తేల్చుతామ న్నారు. కానీ ఇంతవరకూ అతిగతీలేదు. తాజాగా గిరిజనుల హక్కుల విషయంలోనూ మోడీ అలానే వ్యవహరిస్తున్నారని తాజా నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాల హామీలు మాటలకే పరిమితన్న విషయం మరోసారి స్పష్టమైంది. అయితే, కేంద్రంలోని మోడీ సర్కారు, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు తమ పాలనలో గిరిజనులకు హక్కులు కల్పించలేదన్న విషయం సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచార ఆధారంగా తెలుస్తున్నది.
అటవీ హక్కుల చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)
   షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 అమలులోకి వచ్చి 15 ఏండ్లు అవుతున్నది. సాధారణం గా దీనిని అటవీ హక్కుల చట్టం 2006 (ఎఫ్‌ఆర్‌ఏ) అని కూడా అంటారు. అయినప్పటికీ దేశంలోని అడవులలో, చుట్టుపక్కల నివసించే షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ), ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు (ఓటీఎఫ్‌డీ) ఈ చారిత్రాత్మక చట్టం కింద ఇంకా అర్హతలు పొందలేదు. అయితే, ఎఫ్‌ఆర్‌ఏ కింద ఎస్టీ, ఓటీఎఫ్‌డీలకు వారి హక్కులను అందించే విషయంలో బీజేపీయేతర రాష్ట్రాలు చక్కని ప్రతిభను కనబర్చాయి. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఇది ఆశాజనకంగా లేదు. ఇక జమ్మూకాశ్మీర్‌లో ఎఫ్‌ఆర్‌ఏ చట్టం నత్తతో పోటీ పడుతూ నడుస్తున్నది.
పదిశాతం మంది కూడా ప్రయోజనాలు పొందలేదు
   ఎఫ్‌ఆర్‌ఏ ఉపోద్ఘాతం ప్రకారం అటవీ-నివాస షెడ్యూల్డ్‌ తెగలు (ఎఫ్‌డీఎస్‌టీ) మరియు ఓటీఎఫ్‌డీ లకు అనుకూలంగా అటవీ హక్కులను గుర్తించి వారికి అప్పగించడానికి చట్టం రూపొందించబడింది. వారు తరతరాలుగా అడవులలో నివసిస్తున్నారు. కానీ, వారి హక్కులు మాత్రం నమోదు కాకపోవడం గమనార్హం. 2006, డిసెంబర్‌ 29న రాష్ట్రపతి నుంచి ఎఫ్‌ఆర్‌ఏ ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా ఈ చట్టం ప్రకారం ఉద్దేశించిన లబ్దిదారులలో పది శాతం మంది కూడా తమ ప్రయోజనాలను పొందలేదని వివిధ అధ్యయనాలు తెలుపుతున్నాయి.
   గతనెల 15న ఒడిశాకు చెందిన పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ) బిజూ జనతాదళ్‌ (బీజేడీ) సీనియర్‌ నాయకులు డాక్టర్‌ సస్మిత్‌ పాత్ర, జాతీయ స్థాయిలో ఎఫ్‌ఆర్‌ఏ అమలు గురించి గత మూడేండ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి వివరాలను కోరారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాచారాన్ని అందించారు.
బీహార్‌, యూపీ, ఉత్తరాఖండ్‌లు అధ్వాన్నం
   కేంద్ర మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం.. 20 రాష్ట్రాల జాబితాలో ఒడిశా రాష్ట్రం ఎఫ్‌ఆర్‌ఏ కింద దాదాపు 4.50 లక్షలకు పైగా టైటిల్‌లను పంపిణీ చేసింది. ఇందులో దాదాపు 4,43,686 మంది వ్యక్తులు వ్యక్తిగత అటవీ హక్కులు (ఐఎఫ్‌ఆర్‌), 6649 కమ్యూనిటీ ఫారెస్ట్‌ రైట్స్‌ (సీఎఫ్‌ఆర్‌) క్లెయిమ్‌లను వివిధ సంఘాల ద్వారా స్వీకరించారు. దేశంలో ఒడిశా చక్కటి ప్రతిభను కనబర్చింది.
   అయితే, ఎఫ్‌ఆర్‌ఏ అమలు విషయంలో బీహార్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు అధ్వాన్నంగా ఉన్నాయి. బీహార్‌ తన ప్రజలకు మార్చి 31, 2019 నుంచి ఆగస్టు 31, 2021 వరకు 121 ఐఎఫ్‌ఆర్‌ టైటిళ్లను అందించింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్‌లలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.
   యూపీలో కేవలం 18,910 మంది వ్యక్తులకు ఎఫ్‌ఆర్‌ఏ కింద హక్కులు అందాయి. అయితే, పైన పేర్కొన్న కాలం వ్యవధిలో యూపీలోని 75 జిల్లాల్లో 861 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు మాత్రమే నిర్ణయించబడ్డాయి. ఉత్తరాఖండ్‌లో ఐఎప్‌ఆర్‌ క్లెయిమ్‌లు 157 మాత్రమే ఖరారు అయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో మార్చి 31, 2019 నుంచి ఆగస్టు 31, 2021 వరకు వరుసగా 164 ఐఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు, 65 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు మాత్రమే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడులో గత మూడేండ్లలో ఎఫ్‌ఆర్‌ఏ కింద కేవలం 8144 కుటుంబాలు మాత్రమే లబ్ది పొందాయి. 450 కంటే ఎక్కువ సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు నిర్ణయించబడపోవడం గమనార్హం.
బీజేపీయేతర రాష్ట్రాలు భేష్‌
   ఎఫ్‌ఆర్‌ఏ అమలులో బీజేపీయేత రాష్ట్రాలు చక్కటి పనితీరును కనబర్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం తెలస్తున్నది. ఇందులో ఒడిశా మొదటిస్థానంలో ఉండగా, కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చి 31, 2019 నుంచి ఆగస్టు 31, 2021 మధ్యకాలంలో దాదాపు 4,23,218 ఐఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు, 21,967 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లను నిర్ణయించింది. ఒడిశాలో 4,43,686 మంది వ్యక్తులకు ఎఫ్‌ఆర్‌ఏ కింద హక్కులు అందించబడ్డాయి. 21,967 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు నిర్ణయించబడ్డాయి. మహారాష్ట్ర వరుసగా 1,72,116 ఐఎఫ్‌ఆర్‌, 7084 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లను నిర్ణయించింది. సీఎఫ్‌ఆర్‌ టైటిల్స్‌ ఇవ్వడంలో ఒడిశా కంటే మహారాష్ట్ర ముందున్నది. మమత పాలనలో పశ్చిమ బెంగాల్‌లో ఎఫ్‌ఆర్‌ఏ కింద 45,130 మంది వ్యక్తులకు టైటిల్స్‌ అందగా, 686 కమ్యూనిటీ క్లెయిమ్‌లు మార్చి 31, 2019 నుంచి ఆగస్టు 31, 2021 మధ్య నిర్ణయించబడ్డాయి. గుజరాత్‌లో కేవలం 95,363 మంది వ్యక్తులు మాత్రమే ఎఫ్‌ఆర్‌ఏ కింద హక్కులను పొందారు. 3887 సీఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు నిర్ణయించబడ్డాయి.
జమ్మూకాశ్మీర్‌లో ఎఫ్‌ఆర్‌ఏ అమలు పేలవం
   రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఎఫ్‌ఆర్‌ఏ జమ్మూకాశ్మీర్‌కు విస్తరించబడింది. జమ్మూకాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం.. తక్షణమే అమలులోకి వచ్చేలా చట్టాన్ని రూపొందించడానికి బదులుగా, ఈ చట్టాన్ని గ్రౌండ్‌ లెవెల్‌లో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి ఒక ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టింది. అయితే, కేంద్రం అందించిన సమాచారంలో జమ్మూకాశ్మీర్‌ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం, 2005 (ఆర్టీఐ చట్టం) కింద పొందిన సమాచారం ప్రకారం, ఉదంపూర్‌, బుద్గాం జిల్లాల నుంచి కేవలం 10 కమ్యూనిటీ క్లెయిమ్‌లు (రెండు జిల్లాల్లో ఐదు చొప్పున) మాత్రమే సంబంధిత జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించాయి. మరో 18 జిల్లాల నుంచి రెండు నెలలు గడిచినా సమాచారం అందలేదు. మోడీ సర్కారుకు గిరిజనులపై ప్రేమ వట్టిదేనన్న విషయం ఎఫ్‌ఆర్‌ఏ చట్టం అమలు తీరుతో అర్థమవుతున్నదని గిరిజన సంఘాల నాయకులు ఆరోపించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి కోటి వేతనం
యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం
హిందుస్థాన్‌ జింక్‌ పూర్తిగా ప్రయివేటీకరణ
కాంగ్రెస్‌కు మరో షాక్‌?
ఇండిగోకు ఇంధన ధరల దెబ్బ
బీహార్‌లో కుల గణన!
టార్గెట్‌ @ 2024
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
కఠిన చర్యలు తప్పవు
పంజాబ్‌ మంత్రి అరెస్టు
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత
30న ధర్నాలను జయప్రదం చేయండి
అలుపెరగని పోరాట యోధుడు
ముస్లిం ప్రార్థనా మందిరాలే టార్గెట్‌
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత
పర్యాటకంలోనూ భారత్‌ వెనుకబాటు
మీ సేవలు అద్భుతం..
అంతర్జాతీయ పురస్కారం ఎంతో గర్వకారణం..
జడ్జీలను లక్ష్యంగా చేసుకోవడం 'ఫ్యాషన్‌'గా మారింది
సీపీఎస్‌ను రద్దు చేయండి
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌
ప్రపంచ ఆకలి తీవ్రం
వైద్యం తీరు మారాలి
ఢిల్లీలో గాలి దుమారం
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా వినయ్ కుమార్‌ సక్సేనా..
హిట్లర్‌, ముస్సోలిని కన్నా బిజెపి పాలన దారణం : మమతా
27 మందికి కరోనా
సీనియర్‌ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించండి..
జ్ఞాన్‌వాపీ మసీదు కేసు
రేషన్‌ బియ్యం మాఫియాపై సిఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.