Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధిలో 25 శాతం కోత | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

ఉపాధిలో 25 శాతం కోత

- పేదల చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్‌
- మతం పేరుతో జనాల మధ్య విభజన కుట్ర
- ధనికుల కొమ్మూకాస్తూ పేదలపై దాడి
- వ్యకాస 29వ రాష్ట్ర మహాసభ బహిరంగ సభలో బృందా కరత్‌
ఏలూరు : గత బడ్జెట్‌లో పేదలకు సంబంధించిన ఉపాధి హామీ చట్టానికి కేటాయించిన నిధుల్లో 25 శాతం కోత విధించి మోడీ సర్కార్‌ కష్టజీవుల పొట్టకొట్టిందని, అదే సమయంలో ధనవంతులకు లక్షల కోట్లు రాయితీల రూపంలో కట్టబెడుతోందని గిరిజనోద్యమ జాతీయ నేత బృందాకరత్‌ అన్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఎపి వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా తొలుత మార్కెట్‌ యార్డు నుంచి బస్టాండ్‌ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలోని కుంజా బొజ్జి, సున్నం రాజయ్య స్మారక ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి బృందాకరత్‌ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కళ్లద్దాలకు ధనికులు మాత్రమే కన్పిస్తున్నారని, పేదలు కన్పించడం లేదని విమర్శించారు. అదానీ రోజుకు పది వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే, పేదలు నెలంతా కష్టపడినా పది వేల రూపాయలు కూడా రావడం లేదని, మోడీ దుర్మార్గపు పాలనకు ఇది నిదర్శనమని తెలిపారు. 75 ఏళ్లుగా పాలిస్తున్న ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఆహార భద్రతలో సంపూర్ణత సాధించామంటే వ్యవసాయ కార్మికుల శ్రమ ఫలితమేనని తెలిపారు. ఏయేటికాయేడు ఉపాధి పనులు తగ్గిపోతున్నాయని అన్నారు. ఏడాదికి 50 రోజులు కూడా పని కల్పించడం లేదని, ఈ ఏడాది 43 రోజు కూడా పని కల్పించలేదని తెలిపారు. పెట్టుబడిదారుల కోసం మోడీ ప్రభుత్వం గిరిజన చట్టాలను మార్చేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో గిరిజనులను తరిమేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోనిర్వహించిన పోరాటాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో వందలాది గ్రామాల్లో భూముల కోసం పోరాటాలు సాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా 12,300 మంది వ్యవసాయ కార్మికులపై జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, 125 మందిని జైలుకు పంపిందని అన్నారు. 'ఈ వేదిక నుంచి జగన్‌ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాం. నీవేం చేసుకుంటావో చేసుకో. ఈ పోరాటాలు ఆగవు' అని పేర్కొన్నారు. నవరత్నాల గురించి తెలుసని, ముఖ్యమైన రత్నమైన భూమిని పంచాలని, కూలి పెంచాలని అన్నారు. ఎపిలో ఉపాధి వేతనం రోజుకు కనీస వేతనం రూ.257 మాత్రమే ఇస్తున్నారని, ఎపి వెబ్‌సైట్‌ చూస్తే అది కూడా అమలు చేయడం లేదని, రూ.228 ఇస్తున్నట్లు తెలుస్తోందని తెలిపారు. కనీస వేతనం ఇవ్వకపోగా పనిభారం పెంచుతున్నారన్నారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2006లో అటవీ హక్కుల సంరక్షణ చట్టం సాధించామన్నారు. లక్షా 57 వేల పట్టాలు సాధించగా ఇప్పుడు మళ్లీ ఆ భూములను లాగేసుకుంటున్న పరిస్థితి ఉందని తెలిపారు. కేరళలో ఎర్రజెండా ప్రభుత్వం నిత్యావసరాలను సరసమైన ధరలకు పేదలకు అందిస్తోందని, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఎందుకు అందించడం లేదో చెప్పాలని అన్నారు. అనంతరం జంగారెడ్డిగూడెం ప్రాంత ముస్లిం నేతలు, ముస్లిం మహిళలు దుశ్శాలువాతో బృందాకరత్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్ద ముస్తఫా మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ముస్లిం, క్రిస్టియన్లను బతకనివ్వడం లేదని, ఎర్ర జెండా తమను కాపాడుతోందని తెలిపారు.
చంద్రబాబు, జగన్‌ పేదల భూములు గురించి మాట్లాడరు : విజయ రాఘవన్‌
            చంద్రబాబు అమరావతి అని, జగన్‌ మూడు రాజధానులు అని అనడం తప్ప, పేదల భూముల గురించి వీరిద్దరూ మాట్లాడరని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు విజయరాఘవన్‌ విమర్శించారు. కేరళలో 96 శాతం ప్రజలకు ఇళ్లు, భూములున్నాయని, ఎపిలో మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు. దేశంలో 60 శాతం జనాభాకు భూమి లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి భూమిచ్చేందుకు సహకరించడం లేదని తెలిపారు. కరోనా సమయంలో కేరళలో పేదలకు నిత్యావసరాలు ఇచ్చి ఆదుకోగా, ఎపిలో అటువంటి సహకారం లేదని అన్నారు. రైతులు, కార్మికులు అంతా కలిసి పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.
బిజెపి పాలన కొనసాగితే
మత, ప్రాంతీయ యుద్దాలే : బి.వెంకట్‌
            కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మైనార్టీల, గిరిజనుల, దళితుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశప్రజలపై హిందూత్వం రుద్దేందుకు ప్రయత్నిస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. ఈ పాలన కొనసాగితే రానున్న కాలంలో మత, ప్రాంతీయ యుద్ధాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ఆదేశిస్తే జగన్‌ చేస్తున్నారని, కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి అన్నీ అదానికి కట్టబెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 250 కేంద్రాల్లో భూపోరాటాలు సాగుతున్నాయన్నారు. ఆదివాసీల 1/70 చట్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ సభలో కేరళ వ్యవసాయ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్‌ చంద్రన్‌, పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, పూర్వపు రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.రవి, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, గిరిజన సంఘం, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి
కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...
బాల్య వివాహాల కేసుల్లో అసోం సర్కార్‌ దూకుడు
9న బ్లాక్‌ డే
యూపీ పోలీసులు వేధించారు..
రక్షణ దిగుమతులు రూ.2లక్షల కోట్లు
పొట్ట చుట్టూ 51 సార్లు వాతలు..
నైకా నుంచి 'జెంటిల్‌మెన్స్‌ క్రూ' ఉత్పత్తులు
కేంద్రం అందరితో ఎందుకు పోరాడుతుంది?

తాజా వార్తలు

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

11:16 AM

తెలంగాణ బడ్జెట్..రైతులకు శుభవార్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.