Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎదగాలీ... ఎగరాలీ... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 18,2022

ఎదగాలీ... ఎగరాలీ...

ప్రపంచ జనాభాలో మూడో వంతు బాలికలే. బాలికల రక్షణ, ఎదుగుదల, ఆరోగ్యం, విద్య, సదుపాయాలన్నింటిలో అత్యంత శ్రద్ధ అవసరం. ఆరోగ్యంగా, సమాజం పట్ల అవగాహన, సమదృష్టి పరిస్థితులలో ఎదిగినపుడే వారు నేటి సమాజానికి అవసరమైన పౌరులుగా రూపొందుతారు.
కానీ, ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విషాదకర పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. సమాజ అభివృద్ధికి విద్య చాలా కీలకమైనదని విదితమే. కొన్ని అంశాలలో గతం కంటె కొంత పురోభివృద్ధి ఉన్నప్పటికీ నేటి సమాజంలో సరికొత్త సమస్యలు, బాలారిష్టాలు కొనసాగుతున్నాయి. ప్రపంచీకరణ సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాల అమలు వలన బాలికా విద్య సజావుగా జరిగే పరిస్థితులు లేవని చెప్పవచ్చు. గడిచిన రెండేండ్లలో కోవిడ్‌ ప్రభావం ఒకవైపు ఉండగా ఈ రెండేండ్లలో విద్యారంగ సంస్కరణల పేరుతో క్లష్టరైజేషన్‌ పేరుతో పాఠశాలల మూత కారణంగా బాలికలు విద్యకు దూరం కానున్నారు. భారత్‌ వంటి దేశంలో బేటీ బచావో బేటీ పఢావో లక్ష్యం పూర్తిగా నీరు కారుతుంది. బాలికా శిశువులకు రక్షణ కల్పించి వారికి చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పే ఈ పథకం నూతన విద్యా విధానం-2020 అమలుతో నిర్వీర్యం కానుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12.9 కోట్ల మంది బాలికలు విద్యకు దూరంగా ఉన్నారని యునిసెఫ్‌ ప్రకటించింది. బాలికల విద్యకు అడ్డంకులను తొలగించే బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మీ దేశాలలో అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాలను గురించి మీ చర్యలను, నిబద్ధతను విస్తరించకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని ఐరాస హెచ్చరించింది. బాలికలకు ఉచిత నిర్బంధ విద్య, విద్యాహక్కు చట్టాలు సంపూర్ణంగా అమలు చేయాలని అడిగే హక్కు బాలికలకు ఉంది. అందుకే చదువు కోసం వీరోచితంగా పోరాడిన మలాలా బాలికల ఆలోచన కావాలి.
వివక్ష అనేక రూపాలలో కనిపిస్తుంది. 2030 నాటికి ప్రపంచంలో 15.8శాతం బాలికలు పేదరికంలోకి చేరుకుంటారని ఐరాస దక్షిణాసియా ప్రాంతాల ప్రభుత్వాలకు ముందుగానే తెలియచేస్తున్నది. ప్రస్తుతం ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంలో జీవిస్తున్నారు. కరోనా తరువాత పురుషుల కన్నా మహిళల ఉపాధి 19శాతం అధికంగా ప్రమాదంలో పడిందని యు.ఎన్‌ విమెన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాంబో అన్నారు. ఇదే బాలికా విద్యకు విఘాతం కానుంది. నీరు, పరిశుభ్రతలలో కూడా లింగ వివక్షత కొనసాగుతున్నది. సంక్షోభాలు, సంఘర్షణలు బాలికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 33,000మంది బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఐరాస ఆయా దేశాల పాలకులను హెచ్చరిస్తున్నది.
భారతదేశంలో పద్దెనిమిదేళ్లు రాకముందే వివాహం అవుతున్న ఆడపిల్లల శాతం జాతీయ స్థాయిలో 1.9శాతంగా ఉందని (కేరళలో బాల్య వివాహాలేవీ జరగలేదని) తాజాగా కేంద్ర హౌంశాఖ సర్వేలో వెల్లడైంది. బాల్య వివాహ చట్టాలయితే ఉన్నాయి కాని వాటి అమలులో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు.
రక్షణ కల్పించాల్సిన పాలకులు నేరాలను అదుపు చేయలేక పోతున్నారు. 4.6కోట్ల మంది బాలికలు, మహిళలు మనదేశం నుండి అదృశ్యం అయ్యారని క్రైమ్‌ రికార్స్డు బ్యూరో స్పష్టం చేసింది. 41లక్షల మంది బాలికలు 19 రకాల హింసలకు బలైనారని యుఎన్‌ఎఫ్‌పిఎ నివేదిక తెలియచేస్తున్నది. శరీర భాగాలపై వ్యాఖ్యల నుండి కన్యత్వ పరీక్షల వరకు అన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి.
ఈ మధ్యకాలంలో హత్రాస్‌ ఘటన, హిజాబ్‌ ఘటన, బెనారస్‌ యూనివర్సిటీ ఘటనలు, ఇరాన్‌లో హిజాబ్‌పై జరుగుతున్న పోరాటాలు, ప్రశ్నిస్తే అణచివేయడం వంటివి అమ్మాయిల ఆత్మగౌరవాన్ని, జీవితాలను ఏ విధంగా ఛిద్రం చేస్తున్నాయో తెలుపుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది మందిలో ఒకరు లేదా ఇద్దరు బాలకార్మికులు ప్రమాదకర పనులలో పనిచేస్తున్నారు. ఎక్కువ వేతనం లేని బాల కార్మికులుగా చేస్తున్నారు. 5 నుండి 14సంవత్సరాల మధ్య ఉన్న బాలికలు ఎక్కువ సమయం శ్రమిస్తున్నారు. భారత దేశంలో నేటి పాలకుల పుణ్యమా అని బాల కార్మికులలో బాలికల సంఖ్య పెరగనుంది. నూతన విద్యా విధానంలో వృత్తి విద్యా కోర్సులను చిన్న తరగతులలో ప్రవేశ పెట్టడంతో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లేకుండా పోతున్నది. బాలికలను వెట్టిచాకిరీ నుండి విముక్తి చేయాలనే చట్టాలను విస్మరిస్తున్నాయి. మీకు చదువు అవసరం లేదు. పనిలోకి వెళ్లండి. డబ్బులు సంపాదించండి... అని చెప్పడమంటే ఆర్థిక సంస్కరణల అమలు ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా అధిక దేశాలలో విద్యకు, వైద్యానికి, సంక్షేమానికి నిధులు పూర్తిగా తగ్గించడం. లాభాపేక్ష, వ్యాపారాలకు మాత్రమే ప్రోత్సహించడం. ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు బాలికల సమస్యలకు, సంక్షోభాలకు కారణాలుగా ఉన్నాయి. అటువంటి విధానాలకు వ్యతిరేకంగా బాలికలు, మహిళలను చైతన్యవంతులను చేయాలి. బాలికలు, మహిళల వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి.
చిన్నారుల సంక్షేమంలో మన దేశంలో కేరళ ప్రథమ స్థానంలో ఉంది. చిన్నారుల మనుగడ, పోషకాహారం, తాగు నీరు, శానిటేషన్‌, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో 24 సూచికలతో నిర్వహించిన సర్వేలో కేరళ నెంబర్‌1గా ఉంది. ఈ స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలు, దేశాలు పని చెయ్యవచ్చు. కానీ అవి సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. చివరికి ఆడపిల్లలు వాడుకునే శానిటరీ నాప్కిన్లను కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేక పోతున్నాయి. నాప్కిన్లపై జీఎస్టీలను వేయడంతో వారికి అవి మరింత భారం అవుతున్నాయి. సాధికారిత పొందిన బాలికలు సాధికారిత పొందిన మహిళలుగా ఎదుగుతారు. అందుకే వారి హక్కులు, విద్య, ఆరోగ్యం యొక్క సమానత్వాన్ని డిమాండ్‌ చేయడానికి అవసరమైన వేదికలను నిర్మించాలి. వారిని బలపరుస్తూ సమానత్వ సాధనకు ఉద్యమిద్దాం.

- కె. విజయగౌరి, సెల్‌ :8985383255

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.