Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్నికల కమిషన్‌ ఎవరి పక్షం? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 23,2022

ఎన్నికల కమిషన్‌ ఎవరి పక్షం?

ఇటీవల కాలంలో భారత ఎన్నికల కమిషన్‌ (ఇ.సి) తీసుకున్న కొన్ని చర్యలు, అనుసరించిన వైఖరులు... స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించే పర్యవేక్షకురాలిగా, నిష్పక్ష పాత మధ్యవర్తిగా తనకు గల పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా ఉన్నాయి. గత కొన్నేళ్ళుగా, ముఖ్యం గా మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అయిష్టంగానైనా సరే ఇ.సి వ్యవహరించడం కనిపిస్తోంది. పైగా గతంలో తాను తీసుకున్న కొన్ని స్వతంత్ర వైఖరుల నుండి కూడా వెనుకంజ వేస్తోంది.
కొన్ని సంఘటనలు ఈ దురదృష్టకరమైన ధోరణిని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలు ఇస్తామంటూ చేసే హామీలు, వాగ్దానాలనేవి తమ పరిధిలోకి రావంటూ ఇ.సి సుప్రీం కోర్టులో గతంలో తన వైఖరి స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా కూడా తమ అధికారాలను ఉల్లంఘించి వ్యవహరించడమే అవుతుందని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల కమిషన్‌ ఎలాంటి మినహాయింపులు లేని రీతిలో తీసుకున్న ఈ వైఖరిని - జులైలో ప్రధాని మోడీ 'రేవడి' సంస్కృతిపై తీవ్రంగా ధ్వజమెత్తి, ప్రజలకు ఉచితాలు ఇస్తున్నారంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన వెంటనే మార్చుకుంది. ఎన్నికల నిబంధనావళిని సవరించాలని ఆలోచిస్తున్నామని, రాజకీయ పార్టీలు చేసే ఎన్నికల వాగ్దానాలు, వాటి ఆర్థిక పర్యవసానాల వివరాలను వెల్లడించే ప్రొఫార్మాను ప్రవేశపెట్టాలను కుంటున్నామంటూ రాజకీయ పార్టీలకు ఇ.సి అక్టోబర్‌లో తెలియచేసింది. పైగా, రాజకీయ పార్టీలు తాము ఇచ్చే హామీలను నెరవేర్చేందుకు అవసరమయ్యే అదనపు వనరులను ఎలా సమీకరిస్తారో కూడా తెలియచేయాల్సి వుంటుందని పేర్కొంది. ఈ రీతిలో ప్రజలకు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల విషయంలో జోక్యం చేసుకోవడమనేది... విజ్ఞతతో కూడిన ఆర్థిక సుస్థిరత పరిధిలో రాజకీయ పార్టీ విధానాన్ని నియంత్రించే ప్రయత్నమే. ఇటువంటి ఎన్నికల వాగ్దానాలను సమీక్షించాల్సిన పని ఇ.సి.కి లేదు. కానీ, ఇటువంటి చర్య తీసుకోవడం ద్వారా, కొద్ది మాసాల క్రితం సుప్రీం కోర్టులో తాను తీసుకున్న వైఖరికి పూర్తి భిన్నంగా, ప్రధాని ఆదేశాలను నెరవేరుస్తున్నారన్న ఆరోపణలను మూటగట్టుకునే రీతిలో ఇ.సి వ్యవహరించింది.
ప్రభుత్వం మొదటిసారిగా ప్రతిపాదించిన ఎన్నికల బాండ్ల పథకానికి వ్యతిరేకంగా ఇ.సి నిర్ద్వంద్వంగా తన వైఖరిని తెలియచేసింది. ఎలాంటి పారదర్శకత లేని ఈ వ్యవస్థ గురించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఇటువంటి అజ్ఞాత నిధులు, విరాళాలు స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికల నిర్వహణను ఎలా దెబ్బతీస్తాయో తెలియచేసింది. ఇది 2018లోనే చెప్పింది. అప్పటి నుండి, ఈ విషయం ఎప్పుడు సుప్రీం కోర్టుకు వచ్చినా, ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా పిటిషన్లను విచారిస్తున్నా ఇ.సి దీనిపై తీవ్రంగా వ్యవహరించలేదు.
ఎన్నికల్లోకి అజ్ఞాతంగా వచ్చిపడే నిధుల ప్రవాహాన్ని ఎలా అడ్డుకోవాలనేది తీవ్రంగా ఆలోచించడానికి బదులుగా, రాజకీయ పార్టీలు అందుకునే చిన్న మొత్తాల విరాళాలను ఎలా కనిపెట్టాలంటూ ఇ.సి మరింతగా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం, రూ.20 వేలకు పైబడిన విరాళాలకు రాజకీయ పార్టీలు మూలం ప్రకటించాలని చట్టం పేర్కొంటోంది. అయితే, రూ.2 వేలకు పైబడిన విరాళాలు వచ్చినా వాటిని కూడా ప్రకటించేలా ఈ చట్టాన్ని సవరించాలని సెప్టెంబర్‌లో న్యాయశాఖా మంత్రికి ఇ.సి లేఖ రాసింది. రూ.2 వేల కన్నా తక్కువ మొత్తంలో అజ్ఞాతంగా వచ్చిన విరాళాలపైనా ఆంక్షలు విధించాలని ఇ.సి భావిస్తోంది. కానీ, ఎన్నికల బాండ్ల ద్వారా అజ్ఞాతంగా వచ్చే కోట్లాది రూపాయల విరాళాలపైన ఎన్నికల కమిషన్‌ అస్సలు ఆందోళన చెందకపోవడం విచారకరం. ఈ అక్టోబర్‌లో 22వ విడత ఎన్నికల బాండ్లను జారీ చేసిన తర్వాత మొత్తంగా రూ.10,791 కోట్లు ఈ అజ్ఞాత మార్గం ద్వారా వచ్చిపడ్డాయి. ఇందులో పెద్ద వాటా పాలక పార్టీదే.
ఏడాదిలో నాలుగుసార్లు జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబరుల్లో 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఎన్నికల బాండ్లు జారీ చేస్తారు. అయితే ఈ ఏడాది అక్టోబరులో చివరి విడత తర్వాత మోడీ ప్రభుత్వం నిబంధనలను సవరించింది. నవంబరు 8న అదనంగా మరోసారి ఎన్నికల బాండ్లు జారీ చేసి 15రోజుల పాటు అమలయ్యేలా చూసింది. డిసెంబరు మొదటి వారంలో గుజరాత్‌ ఎన్నికలు జరగనున్నందున వాటిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలకు ఈ సవరణ చేసింది. పాలక పార్టీకి విధేయంగా వుండడానికి సదా సన్నద్ధంగా వుండే కార్పొరేట్లు, చీకటి వ్యాపారుల నుండి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించగలమని సహజంగానే బీజేపీ ఆశతో ఉంది. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయ కుండా... ఎన్నికల కోసం ఉద్దేశించిన లెక్కలోకి రాని నగదు వినియోగంపై ఎలాంటి కట్టడి ఉండదు. అయితే, రూ.2 వేలు వంటి చిన్న మొత్తాలు, అంతకు పైబడిన విరాళాలను జవాబుదారీగా చేయడంతోనే ఇ.సి సంతృప్తి చెందుతోంది.
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో కొత్త ప్రామాణికాలను కూడా ఇ.సి ప్రవేశపెట్టింది. మొదటగా, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత చాలా ఆలస్యంగా గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. గుజరాత్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు, పథకా లను అమలు చేసేందుకు ప్రధాని ఈ అదనపు సమయాన్ని ఎలా ఉపయోగించారో ప్రతి ఒక్కరూ చూశారు.
ఇక రెండో అసాధారణమైన చర్య ఏమిటంటే, తమ సంస్థల్లో పని చేసే కార్మికులు ఎన్నికల్లో పాల్గొనే రీతిని, వారి భాగస్వామ్యాన్ని పర్యవేక్షించేందుకు గుజరాత్‌ లోని వెయ్యికి పైగా కార్పొరేట్‌ సంస్థలతో ఎన్నికల కమిషన్‌ అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఓటు వేయని వారి పేర్లను సంస్థ వెబ్‌సైట్లు లేదా నోటీసు బోర్డుల్లో ప్రచురించడం. అంటే ఇది, బలవంతంగానైనా ఓటింగ్‌లో పాల్గొనేలా చూసే ప్రమాదకరమైన చర్యకు దగ్గరగా ఉంది. దీంతో తమ సంస్థల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు అందరూ తప్పక ఓటు వేసేలా చూసే బాధ్యత ఇప్పుడు ఆయా సంస్థలు, కంపెనీల యాజమాన్యా లపై ఉంది. ఇక ఓటు ఎలా వేయాలో వారికి సలహా ఇవ్వడమే తదుపరి చర్య కాగలదు.
ఎన్నికల కమిషన్‌ అనేది మన ప్రజా స్వామ్యానికి చాలా విలువైన, కీలకమైన సంస్థ. నిరంకుశ ప్రభుత్వం... ఈ సంస్థ స్వేచ్ఛను, సమగ్రతను నిర్మూలించడాన్ని ఎంత మాత్రమూ అనుమతించలేం. ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు తీసుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ముందుగా, ఎన్నికల కమిషనర్ల ఎంపిక ఒక కమిటీ ద్వారా జరగాలి. ఆ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇ.సి కమిషనర్ల ఎంపిక పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే వుంటోంది. ఇక రెండోది, పదవీ విరమణ చేసిన తర్వాత, కమిషనర్‌ ఎలాంటి అధికారిక పదవిని చేపట్టరాదు. పార్లమెంటుకు లేదా అసెంబ్లీకి సభ్యులుగా వీరిని రాజకీయ పార్టీలు నామినేట్‌ చేయరాదు.

- 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.