Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రమాదం అంచున భూగోళం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 23,2022

ప్రమాదం అంచున భూగోళం

నేడు ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ప్రతి దేశం ఏదో ఒక విపత్తును ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభాలు, పర్యావరణ సంక్షోభాలు, రకరకాల వైరస్‌, బ్యాక్టీరియాలతో కూడిన వ్యాధులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో విపత్తులు వచ్చి పడతాయో అన్న భయం నేడు నెలకొంది. రుతువులు గతి తప్పుతున్నాయి. మంచు పర్యాతాలు కరగటం, ఓజోన్‌ పొరకు రంధ్రాలు పడటం, అనేక జీవులు అంతరించిపోవటం, మొత్తం జీవవైవిధ్యానికే ముప్పు ఏర్పడింది. వాతావరణంలో విపరీత మార్పులు, రకరకాల ప్రకృతి విపత్తులు ఇవన్నీ పర్యావరణంలో సమతూకం దెబ్బతినడం వల్లనే జరుగుతున్నాయి. మానవాళితో పాటు సమస్త జీవరాశులకు మృత్యుఘంటికలు నేడు మోగుతున్నాయి. భూమి మీద పర్యావరణం కాపాడుకోకపోతే జీవ మనుగడ కష్టమని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే పర్యావరణ విధ్వంసంలో ధనిక దేశాలదే ప్రధాన పాత్ర. ఈ దేశాలు కర్బన ఉద్గారాలను యదేచ్ఛగా వదులుతూ పర్యావరణాన్ని శతాబ్దాలుగా పాడుచేస్తున్నాయి.
పారిశ్రామిక విప్లవం(16 శతాబ్దం) ఎప్పుడైతే మొదలైందో పర్యావరణం, జీవజాతులకు ప్రమాదం కూడా అప్పుడే ప్రారంభమైంది. ప్రపంచ పెట్టుబడికి, భూగోళ పర్యావరణానికి మధ్య విధ్వంసక ఘర్షణ ముందుకు వచ్చింది. ప్రకృతిని పెట్టుబడి (సొంత ఆస్తి)గా మలుచుకొనే దురాశే ప్రకృతి విధ్వంసానికి కారణం. పర్యవసానంగా భూగోళం మీద జీవమే అంతరించి పోయే పరిస్థితికి దాపురిస్తున్నది. ప్రకృతిలో మనిషి తాను ఒక్కడినే ప్రాణిని అనుకుంటే మిగలడు. కనుమరుగైపోతాడు. మనిషి కూడా సమస్త జీవరాశిలో భాగమే. ఎక్కువ కాదు, తక్కువ కాదు. మానవ జీవనానికి, మనుగడకు పర్యావరణమే పునాది అనే వాస్తవాన్ని గుర్తించక పోవటం వలన సంభవిస్తున్న అనర్థాలను ప్రపంచవ్యాప్తంగా మానవాళి నేడు అనుభవిస్తున్నది. మానవజాతి చరిత్రలో సాంకేతిక అభివద్ధితో ఎంతో సంపదను మనిషి సృష్టించాడు. చివరకు గ్రహంతర యాత్ర కూడా సాగించాడు. మానవ జాతి సాధించిన ప్రగతిని వర్ణించటానికి మాటలు చాలవు. అయితే ఇదంతా పర్యావరణ విధ్వంసం మీద సాధించిన ప్రగతి అనే విషయాన్ని మనం మరవకూడదు. దీని ఫలితంగా పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయని కోట్లాది మూగ జీవరాశులు కూడా మూల్యం చెల్లిస్తున్నాయి. ఇప్పటికే సమయం మించి పోయింది. రాగల ప్రమాదాలను, పొంచి ఉన్న ముప్పును గుర్తించి, మానవాళి సమిష్టిగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. లేకుంటే రాబోయే ప్రళయం ఊహించనంత నష్టాన్ని మిగిలిస్తుంది. ఆ నష్టం పూడ్చు కోవటానికి కూడా అవకాశం మిగలదు.
ఇటువంటి పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి తొలిసారి 1992లో ధరిత్రి సదస్సు నిర్వహించింది. అప్పటి నుండి క్యాప్‌ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సం నవంబర్‌ 6నుంచి 18 వరకు 12 రోజుల పాటు ఈజిప్టు దేశంలో 27వ పర్యావరణ పరిరక్షణ సదస్సు ఏర్పాటు చేశారు. 195 సభ్య దేశాలతో పాటు వ్యాపారవేత్తలు, శాస్త్రజ్ఞులు, పర్యావరణ ఉద్యమ కారులు పాల్గొన్నారు. కానీ, 1992 నుండి జరుగుతున్న సదస్సులలో పర్యావరణ పరిరక్షణకు కొన్ని ఒప్పందాలు, లక్ష్యాలు నిర్ధేశించుకోవటం, వాటిని గాలికి వదిలివేయడం ఒక తంతుగా మారింది. ప్రస్తుత సదస్సు నిర్వహణ బాధ్యతలను ప్రముఖ బహుళజాతి కంపెనీ కోకోకోలా తీసుకోవడం ఇందుకు మరో ఉదాహరణ. ఈ సంస్థ ప్లాస్టిక్‌ కాలుష్య కారిణిగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఈ సంస్థ 200 పైగా దేశాలలో తన వ్యాపారాన్ని విస్తరించుకుంది. డ్రింక్స్‌ తాగిన తర్వతా పారేసే ప్లాస్టిక్‌ బాటిళ్లను బిలియన్ల కొద్ది ఉత్పత్తి చేస్తున్నది. విచ్చలవిడిగా భూగర్భజలాలను వాడుకుంటున్నది. పర్యావరణానికి తీరని హాని చేస్తున్నది. ఇలాంటి కార్పోరేట్‌ కంపెనీల కనుసన్నల్లో జరిగే పర్యావరణ సదస్సుల వలన ప్రయోజనం ఏమిటన్నది అంతుచిక్కని ప్రశ్న.
భారత దేశంలో కూడా పర్యవరణ హననం యదేచ్ఛగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు ఊపరితిత్తులైన నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలు, విశాఖ పరిసరాల్లో బాక్సెడ్‌ తవ్వకాలు జరిగే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇవి జరిగితే తెలుగు ప్రజలకు పీల్చుకోవటానికి మంచి గాలి కూడా దొరకదు. ఇప్పటికే దేశంలో జీవవైవిద్యం నశించి జీవ, వృక్ష జాతులు అనేకం కనుమరుగై పోతున్నాయి. వర్షాలు గతి తప్పి మహానగరాలు ముంపునకు గురవుతున్నాయి. వాగులు, వంకలు పొర్లి పొంగుతున్నాయి. రవాణా, పరిశ్రమల వ్యర్థాలు గాలి నాణ్యతను దెబ్బతిస్తున్నాయి. వాయు కాలుష్యం దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ప్రపంచంలోని 50 అతి కాలుష్య నగరాలలో 25 మన దేశంలోనే ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ తీరు సూచికలో 180 దేశాలలో భారతదేశం 177వ స్థానంలో ఉంది. గాలి నాణ్యతలో 178వ స్థానంలో ఉంది. ప్రజారోగ్యంలో 180వ స్థానంలో ఉంది. ఈ స్థితికి కారణం పెట్టుబడిదారి, సామ్రాజ్యవాద విధానాలు అమలు చేసే ప్రభుత్వాలే. కాబట్టి ఈ భూగోళం మీద మునుముందు జీవం మిగిలి ఉండాలంటే పెట్టుబడిదారి, సామ్రాజ్యవాద వ్యవస్థలను సమాధి చేసి సమసమజాన్ని నిర్మించుకోవాలి.

- షేక్‌ కరిముల్లా
   9705450705

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.