Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహాత్మాఫూలే అందించిన ఎజెండానే నేటి మన మార్గదర్శి! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

మహాత్మాఫూలే అందించిన ఎజెండానే నేటి మన మార్గదర్శి!

తన మేలు కోసం పాటుపడిన సంస్కర్తల పట్ల లోకం కర్కషంగా వ్యవహరిస్తుందని చలం ఒక చోట రాస్తాడు. మహాత్మ జ్యోతిరావు ఫూలే విషయంలోనూ అక్షరాలా అదే జరిగింది. నేటికి 170ఏండ్ల క్రితమే.. మనుషులందరూ సమానులేనని.. దేవుడి బిడ్డల్లో కొందరు అగ్రవర్ణాలు మరికొందరు నిమ్నవర్గాలు ఎలా అవుతారని ప్రశ్నించడంతో పాటు.. ఆ రోజుల్లోనే శ్రామికజన సంక్షేమం కోసం కార్మిక సంఘాలను స్థాపించి... అన్ని అంశాల్లోనూ కాలాని కంటే ఎంతో ముందు చూపుతో ఆలోచించగలిగిన సామాజిక విప్లవ ప్రవక్త జ్యోతిబా ఫూలే పట్ల నేటికీ చారిత్రక అన్యాయం కొనసాగుతున్నది. ప్రజా కవి వేమనను రెండువందల యేండ్లు భూస్థాపితం చేసి కనుమరుగయేట్టు చేయగలిగిన మనువాద వ్యవస్థ... మహాత్మా ఫూలే విషయంలోనూ అదే తరహా ప్రతీకారాన్ని ప్రదర్శించిన కారణంగా... చరిత్రలో ఆయనకు దక్కాల్సిన స్థానం నేటికీ దక్కనేలేదు. మనువు వారసులు ఆ మహాత్మున్ని ద్వేషిస్తుంటే.. కులవ్యవస్ధ పీడితులైన మెజారిటీ వర్గాల ప్రజలు, సామ్యవాద ప్రజాస్వామిక శక్తులు సైతం ఆ మహనీయుడిని స్వంతం చేసుకోలేక పోతున్నారు.
జ్యోతిరావు గోవిందరావు ఫూలే 1827 ఏప్రిల్‌ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖట్గున్‌ గ్రామంలో జన్మించాడు. నాటి పీష్వా రాజుల దగ్గర జ్యోతిరావు కుటుంబం పూలమాలలు కట్టి అమ్మే వృత్తిని కొనసాగించిన కారణంగా ఫూలే అనే పేరు వచ్చింది. వెనుకబడిన 'మాలి' కులానికి చెందిన ఆయన కుల కట్టుబాట్ల కారణంగా చిన్ననాటి నుంచే అవమానాలను ఎదుర్కొన్నాడు. యుక్త వయస్సులో ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్లికి హాజరైన జ్యోతిరావును పెళ్లికొడుకు బంధువులు కులం పేరుతో అవమానించి పెళ్లి ఊరేగింపు నుంచి గెంటివేశారు. ఆ అవమానంతో రగిలిపోయిన ఫూలే కులాధిపత్యాన్ని నిర్మూలించడానికి అవిశ్రాంత పోరాటం కొనసాగించాలని ప్రతినబూనాడు. భారతీయ సమాజాన్ని మానవతా విలువల పునాదులపై పునర్నిర్మించడానికి గతంలో ఎందరో మహనీయులు కృషి చేశారు. బుద్ధుడు, కబీర్‌, గురునానక్‌, రవిదాస్‌, చైతన్య, నాందేవ్‌, వేమన లాంటి వారెందరో కుల వ్యవస్థను పూర్తిగా పెకిలించివేసి ప్రత్యామ్నాయ, సమతావాద సంస్కతిని నిర్మించడానికి పాటుపడ్డారు. ఆధునిక యుగంలో ఈ ఒరవడికి మళ్లీ జీవం పోసి ఇంగ్లీషు విద్య వెలుగులో కుల విష వృక్షాన్ని సమూలచ్ఛేదం చేయడానికి మహౌన్నత ఉద్యమం నడిపి మహాత్ముడై నిలిచాడు జ్యోతిబా ఫూలే.
శూద్రులు, అతిశూద్రులపై అగ్రవర్ణాల వారు కొనసాగిస్తున్న దురాగతాలను నిరోధించడానికి ఫూలే 1873 సెప్టెంబరు 24న 'సత్య శోధక్‌ సమాజ్‌' సంస్థను స్థాపించాడు. నిమ్నవర్గాల ప్రజలను కులదోపిడీ నుంచి విముక్తి చేయడంతో పాటు రైతులు, కూలీలను హక్కులకోసం సంఘటిత పరిచేందుకు ఈ సంస్థ ద్వారా ఫూలే విశేషంగా కృషి చేశాడు. విద్యాజ్ఞానాలను అందుకోవడం ద్వారానే శూద్ర, అతిశూద్రులు తమ హక్కులను నిలబెట్టుకోగలరని గుర్తించి వారిలో విద్యావ్యాప్తి కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచాడు. దళిత వర్గాల స్త్రీలకు సైతం విద్య అందాలనే ఉద్దేశంతో వారి కోసం ప్రత్యేక పాఠశాలల నేర్పరిచాడు. దళిత స్త్రీలకు చదువు చెప్పడానికి అగ్రవర్ణాల స్త్రీలు ముందుకు రాని పరిస్థితుల్లో తన భార్య సావిత్రీబాయికి తాను చదువు నేర్పి, ఉపాధ్యాయినిగా తీర్చిదిద్ది ఆమె చేత దళిత స్త్రీలకు చదువు చెప్పించాడు.
విగ్రహారాధనను, కుల వ్యవస్థను, వేదాల పవిత్రతను ప్రశ్నించాలని ఫూలే ప్రజలకు ఉద్బోధించేవాడు. మూఢాచారాలను ఖండిస్తూ ప్రజల్లో హేతువాద ధోరణులను పెంపొందింపజేయడానికి సత్య శోధక్‌ సమాజ్‌ సభ్యులు పాటుపడ్డారు. భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధాన కర్తగా పురోహితవర్గం ఉండాల్సిన అవసరమేలేదని ఫూలే వాదించేవాడు. పురాణాలు, వేదాలు దైవదత్తమైనవి కావని, మనుషులు రాసినవేనని, నేటి కాలానికి అనుగుణంగా వాటిల్లో మార్పులు కూడా చేసుకోవచ్చని వాదించేవాడు. కొందరు స్వార్థపరుల వికృత ఆలోచనల్లోంచే కుల వ్యవస్థ ఆవిర్భవించింది తప్ప భగవంతుడు సృష్టించింది కానేకాదని ఆయన తన సభల్లో వివరించేవాడు. పక్షుల్లో, జంతువుల్లో లేని కుల భేదాలు మానవుల్లో ఎందుకున్నాయని అగ్రవర్ణాల పండితులను ఆయన నిలదీసేవాడు.
బొంబాయితో పాటు మహారాష్ట్రలోని ముఖ్య పట్టణాల్లో తన సంస్థ శాఖలను స్థాపించి ఉద్యమాన్ని విస్తృతపరిచాడు. కరపత్రాలు, సభలు, చిన్న పుస్తకాల ద్వారా సామాన్య ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషిచేశాడు. తన భావాల వ్యాప్తి కోసం ఫూలే ఎన్నో పుస్తకాలను రాశాడు. గులాంగిరీ, షేట్కార్యాచ ఆసుద్‌, సత్యార్‌, ఇషారా, సార్వజనిక్‌ సత్య ధర్మపుస్తక్‌ అందులో ప్రముఖమైనవి. గులాంగిరీ పుస్తకంలో అమెరికాలోని బానిస వ్యవస్థకు, భారతదేశంలోని కుల వ్యవస్థకు గల పోలికలను విశదీకరించాడు. ప్రపంచంలోని పీడితులంతా ఒకే జాతివారని, ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తిని పొందుతూ ఉద్యమించాలని తెలియజెప్పాడు. బావులు, చెరువులు కూడా కులాల వారీగా చీలిపోయిన ఆ రోజుల్లో ఫూలే ఇంటి బావి నీటిని దళితవర్గాల వారు సైతం తోడుకెళుతుండేవారు. కుల వివక్షను నిరాటంకంగా కొనసాగించడానికి అగ్రవర్ణ దురహంకారులు సృష్టించిన నిచ్చెనమెట్ల వ్యవస్థను కూలదోసి వర్ణ వ్యవస్థ బాధితులందరినీ ఐక్యం చేసి ముందుకు నడిపించిన మానవతావాది మహాత్మా ఫూలే.
కులం కుళ్లును ఈ గడ్డపై నుంచి పూర్తిగా తుడిచివేసి, భారత జాతిని సమతా శిఖరాల ఉన్నత స్థితికి చేర్చడానికి అవిశ్రాంతంగా కొనసాగించిన పోరాటం 1890 నవంబర్‌ 28న ఆయన తనువు చాలించడంతో ఆగిపోలేదు. ఫూలే రగిలించిన సాంఘిక విప్లవ జ్వాలను ఆ తర్వాత వచ్చిన అంబేద్కర్‌ అందిపుచ్చుకుని కుల వివక్ష నిర్మూలనా పోరాటాన్ని దేశవ్యాప్త విస్తత ఉద్యమంగా మలిచాడు. తనలో ఉద్యమ జ్వాలను రగిలించిన గురుత్రయంగా బుద్దుడు, కబీర్‌, ఫూలేలను పేర్కొంటూ బాబా సాహెబ్‌ వారిని గౌరవించేవాడు. దక్షిణాదిన పెరియార్‌ రామస్వామి నాయికర్‌ ఫూలే చూపిన బాటలో అగ్రవర్ణ దురహంకారుల ఆగడాలనెదిరిస్తూ ఆత్మగౌరవ ఉద్యమాన్ని కొనసాగించి ఎన్నో విజయాలను సాధించాడు. ఆంగ్లేయుల దాస్యం నుంచి మనం స్వేచ్ఛను పొంది డెబ్భైఐదేండ్లు గడిచాయి. కుల వ్యవస్థ దాస్యపు సంకెళ్ల నుంచి మాత్రం ఈ జాతికి ఇంకా పూర్తి విముక్తి లభించలేదు. సరికొత్త రూపాల్లో మరింత వికృతంగా ఈ నాలుగు పడగల విషసర్పం ఇంకా బుసలు కొడుతూనే ఉన్నది. మనువాద శక్తులు నేడు మరింత బలాన్ని సంతరించుకుని రాజ్యాంగాన్నే సవాల్‌ చేస్తున్నారు. ఈ అమానవీయ మను సంస్కృతిని సమూలంగా నిర్మూలిస్తేనే ఈ దేశానికి పట్టిన పీడ విరగడై మన దేశం ప్రపంచ దేశాల సరసన సగర్వంగా, సమున్నతంగా తలెత్తుకుని నిలబడగలదు. అందుకే నేటి కాలానికి జ్యోతిబా ఫూలే జీవన సందేశం, ఆయన బోధనల ఆవశ్యకత గతంలో కంటే మరింత ఎక్కువగా ఉన్నది!

(నవంబర్‌ 28 - జ్యోతిబా ఫూలే 132వ వర్థంతి)

- ఆర్‌. రాజేశమ్‌, సెల్‌: 9440443183

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

05:21 PM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.