Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధనవంతులదేనా భారతం..! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

ధనవంతులదేనా భారతం..!

స్విట్జర్లాండ్‌ దేశపు దావోస్‌ నగరంలో జరుగుతున్న 'వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం-2023' అనబడే ప్రపంచ సంపన్నుల సదస్సు వేదికగా తొలిరోజు విడుదల చేసిన 'సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌ - ది ఇండియా సప్లిమెంట్‌' అనబడే నివేదిక పలు ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది. అత్యంత సంపన్నులు, కడుపేదల మధ్య పెరుగుతున్న అగాధాలతో ప్రపంచ జనాభాలో అధికశాతం ఆకలి చావుల అంచున నిలబడ్డారని తేల్చింది. 2021లో భారత దేశంలోని ఒకశాతం సంపన్నుల వద్ద 40.5శాతం సంపద మూలుగుతుండగా, 50శాతం పేదల వద్ద 3శాతం సంపద మాత్రమే ఉందని తెలుస్తున్నది. కరోనా మహావిపత్తు ప్రారంభం నుంచి (మార్చి -2020) నవంబర్‌ 2022 వరకు బిలియనీర్ల సంపద 121శాతం పెరిగినట్లు (రోజుకు 3608 కోట్లు నిమిషానికి 2.5 కోట్లు) విశ్లేషించారు.
దేశంలోని 10శాతం అత్యధిక ధనవంతుల నుంచి జీయస్‌టీ పన్ను కేవలం 3శాతం వసూలవుతుండగా, 50శాతం దిగువ వర్గాల బడుగుల నుంచి 64శాతం వసూలు అవుతునట్లు వివరించారు. బిలియనీర్ల నుంచి 20శాతం పన్నులు వసూలు చేయగలిగితే ఆ డబ్బుతో 50లక్షల పాఠశాల ఉపాద్యాయులకు ఒక ఏడాది వేతనాలు ఇవ్వవచ్చని అంచనా వేశారు. 2020-22 మధ్య భారత బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 166కు పెరగగా, నిరుపేదల సంఖ్య మాత్రం 19కోట్ల నుండి 35కోట్లకు పెరిగినట్లు తేల్చారు. దేశంలోని 100మంది అత్యంత ధనవంతుల వద్ద 54.12లక్షల కోట్ల సంపద పోగు అయ్యిందని, ఈ సంపదతో కేంద్ర ప్రభుత్వం 18మాసాలు దేశాభివృద్ధికి కావలసిన నిధులు విడుదల చేయవచ్చని పేర్కొనబ డింది. బిలియనీర్లకు నందనవనంగా నిలిచిన భారతదేశం, పేదలకు మాత్రం ఆకలి రాజ్యంగా మారినట్లు ఆక్స్‌ఫామ్‌ వ్యాఖ్యానించడాన్ని ఓ హెచ్చరికగా తీసుకోవాలి.
బిలియనీర్లు అంతులేని లాభాలతో దూసుకుపోతున్న వేళ పేదలు కనీస అవసరాలకే నానా తంటాలు పడుతున్నారు. 2018లో 190 మిలియన్ల పేదలు ఉండగా, 2022లో వారి సంఖ్య 350మిలియన్లకు ఎగబాకడం గమనార్హం. 2022లో ఐదేండ్ల లోపు పిల్లల మరణాల్లో 65శాతం ఆకలి చావులేనని తేల్చారు. ధనవంతులకే దేశ ఫలాలు అందుతున్నట్లు, పేదలు పట్టెడన్నానికి పరితపిస్తున్నట్లు విశ్లేషించారు. 2020 నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక శాతం జనాభా 66శాతం నూతన సంపదను చేజిక్కించుకున్నారని, 90శాతం దిగువ తరగతి జనాభా అతి తక్కువ (ఆరు రెట్లు తక్కువ) సంపద పొందారని వర్ణించబడింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆసియా, ఆఫ్రికా, యూరోప్‌, అమెరికా దేశాల్లో ధనవంతులపై పన్నులు తగ్గించడంతో పాటు పేదల వద్ద సరుకుల కొనుగోలు రూపంలో పన్నులు అధికంగా పొందినట్లు వివరించారు. భారత్‌లో కూడా పేదలపై పన్నుల పోటు పెంచడం, ధనికులపై పన్నులు తగ్గించడం అనాదిగా జరుగుతోంది. 2019లో కేంద్రప్రభుత్వం కార్పొరేట్‌ పన్నులను 30శాతం నుంచి 22శాతానికి తగ్గించగా, నూతన కంపెనీలకు 15శాతం పన్నులు మాత్రమే వేశారు. కార్పొరేట్లకు తగ్గించిన పన్నుల మొత్తం దాదాపు ఒక లక్ష కోట్లుగా అంచనా వేయగా, ఈ మొత్తంతో 1.4ఏండ్లు పనికి ఆహారం పథకాన్ని నిర్వహించవచ్చని అంచనా వేశారు.
ధనికుల కన్న పేదలు కట్టే పన్నుల రేటు అధికంగా ఉండడం ఆక్షేపణీయం. నేటి ప్రభుత్వాలు కుబేరుల నుంచి అధిక సంపద పన్నులు, వారసత్వ పన్నులు వేస్తూ రాబడి పెంచకపోవడం వల్ల అసమానతలు, లింగ భేదాలను తగ్గించే ప్రయత్నాలు సఫలం కావడం లేదు. కరోనా విపత్తు కాలంలో లాభాలార్జించిన సంపన్నుల నుంచి కనీసం 30శాతానికి పైగా పన్నులు వసూలు చేయాలని 80శాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కుబేరుల నుంచి కనీసం 5శాతం అధికంగా పన్నులు వసూలు చేసినా ఆ నిధులతో 200కోట్ల ప్రపంచ మానవాళిని పేదరిక ఊబీలోంచి బయటకు లాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సూపర్‌ రిచ్‌ వర్గం నుంచి అధిక పన్నులు వసూలు చేయడం, పేదలపై పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ప్రభుత్వాలు కృషి చేయాలని సూచనలు కూడా ఇవ్వడం ఈ నివేదిక ప్రత్యేకతని చెప్పాలి. సంపద కూడబెట్టడానికి కాదని, అర్హులకు పంచడానికని ప్రభుత్వాలు తెలుసుకోవాలి.
- డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి - 9949700037

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'
విప్లవ యోధ కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం
కాలిగిట్టెల శబ్దం
ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!
కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
హేతువాద కవిత్వం రాసిన సంప్రదాయ కవి
భూమి, భుక్తి, విముక్తి ధీరుడు కామ్రేడ్‌ ఠానునాయక్‌
ఛాందసం
హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
వలస శవం
'పరీక్షా' కాలం!

తాజా వార్తలు

01:58 PM

కాందార్ లోహా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

01:57 PM

ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

10:47 AM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

06:20 AM

దారుణం.. క్వారీలో డిటోనేటర్లు పేలి ఇద్దరు మృతి

06:10 AM

నీట్‌కు వ‌య‌స్సు అర్హతపై దాఖలైన పీటీష‌న్ నిరాకరించిన హైకోర్టు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.