Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు

          రాష్ట్రంలో రవాణా కార్మికుల సంఘర్ష యాత్రకు అనూహ్యమైన స్పందన వచ్చింది. విలువైన అనుభవాలు ఇచ్చింది. సమస్యలతో సతమతమవుతున్న రవాణా కార్మికులలో విశ్వాసం నింపింది. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలన్న స్ఫూర్తి నింపింది. కార్మికుల సమస్యలు తెలుసుకోవటం, వారిని సంఘటితం చేయటం, పోరాట చైతన్యం నింపటం ఈ యాత్ర లక్ష్యం.
'ఇల్లు చూసి నన్ను చూడు' అన్నట్టున్నది రవాణా కార్మికుల బతుకు చిత్రం. యాత్ర బృందం రవాణా కార్మికులిండ్లలోనే బస చేసింది. వారి ఇండ్లలోనే భోజనాలు చేసింది. దీనివల్ల వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం దొరికింది. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, సమస్యలు సన్నిహితంగా పరిశీలించేందుకు ఉపయోగపడింది. కుటుంబాలతో మమేకం కావడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆప్యాయత ప్రదర్శించారు. నాయకులు తమ ఇంటికి రావటం, వారు పెట్టింది తినటం, అగ్గిపెట్టెల్లాంటి తమ ఇండ్లలో, మురికి కూపాల పరిసరాలలో, వారితో పాటు బస చేయటం వారికి ఆశ్చర్యం కలిగింది. అందుకే హృదయపూర్వకంగా ఆదరించారు. ఇరుకు గదులు... ఒకరు పడుకుంటే మరొకరు నిలబడేందుకు కూడా చోటులేని ఇండ్లు కూడా ఉన్నాయి. ఇలాంటి ఇండ్లలో కుటుంబాలు బతుకుతున్నాయంటేనే వారి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఇండ్లలో నాయకులు కూడా వారితో పాటు నేలపైన చాప పరుచుకుని నిద్రించటం వారిలో విశ్వాసం పెంచింది. ఈ కుటుంబాలలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వారు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఉన్నారు.
హైదరాబాద్‌ నడిబొడ్డున, చెత్త సేకరించే వాహనాల డ్రైవర్‌ ఇంట్లో భోజనం చేసాం. రెండు ఇండ్ల మధ్య ఇద్దరు మనుషులు ఎదురైతే నడవటం కష్టం. ఒక ఆటో డ్రైవర్‌ ఇంట్లో బస చేయడానికి పోయాం. బృందం పడుకుంటే ఆ కుటుంబ సభ్యులకు స్థలం లేదని అర్థమైంది. ఒక్కరం అక్కడ ఉండి, మిగిలిన నాయకులు మరో ఇంటికి వెళ్ళారు. కారు డ్రైవర్‌ ఇంట్లో భోజనానికి పోయాం. చెత్త కుప్పలో విసిరేసినట్టున్న ఆ ఇంటికి నాయకులు రావటం, భోజనం చేయటం వారు ఊహించలేదు. మిధాని డిపో పక్కన, ఫుట్‌పాత్‌ మీద గూడు కట్టుకున్న గిరిజన ఆటో డ్రైవర్‌ ఇంట్లో టిఫిన్‌ చేయటం ఆ ఇంటి ఇల్లాలుకు ఎంతో సంతోషం కలిగించింది. చెత్త డంపింగ్‌ యార్డ్‌ కార్మికుడి ఇంట్లో భోజనం చేసి, మరో కార్మికుడి రాజీవ్‌ గృహకల్ప ఇంట్లో బసచేసాం. వీరూ గిరిజనులే. ఒక ఆటో డ్రైవర్‌ ఇంట్లో గదికీ, వంటగదికీ మధ్య తలుపులు లేవు. ఫ్రిజ్‌ తలుపు సరిగా పడలేదని సర్దబోయాను. తలుపు ఊడిపడింది. అది పనిచేయదండీ అని అప్పుడు చెప్పాడు ఆ డ్రైవర్‌. ఇద్దరు డ్రైవర్ల ఇండ్లలో నిద్రించే సమయానికి కుటుంబ సభ్యులు లేరు. స్థలం లేక, పక్కింటిలో సర్దుకున్నారు. కిరాణా దుకాణంతో నష్టపోయి కారు డ్రైవరుగా మారిన చిరు వ్యాపారి, శవాల ఫ్రీజర్‌ కూడా నిర్వహించటం గమనార్హం. ఒక పూట వారి ఆతిథ్యం స్వీకరించాం. మరో గూడ్స్‌ ఆటో డ్రైవర్‌ మా బసకు ఏర్పాటు చేసిన గదిలో మంచి పరుపూ, మంచం, సోఫా, నిలువుటద్దం ఉన్నాయి. తీరా వారు నివసించే ఇట్లో చూస్తే గాలీ, వెలుతురు ప్రసరించని రేకుల కొట్టం. తమ బతుకు చిత్రం కనిపించకుండా, అతిథులకు మర్యాద చేసి పంపే ప్రయత్నమని అర్థమైంది.
యాత్రకు సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎస్‌. వీరయ్య, పి. శ్రీకాంత్‌ సారథ్యం వహించారు. కూరపాటి రమేశ్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనీ, ఆర్టీసీని పరిరక్షించాలని, 'మోటారు వాహనాల సవరణ చట్టం-2019'ని సవరించాలని కోరుతూ ఈ యాత్ర సాగింది. ఈ నెల 3న ఖమ్మంలో ప్రారంభమైన యాత్ర 11న సాయంత్రం సంగారెడ్డిలో ముగిసింది. సంఘర్ష్‌ యాత్ర 24 జిల్లాలలో, 49 కేంద్రాలలో కార్మికులను కలిసింది. 2780 కి.మీ. యాత్ర సాగింది. అన్ని కేంద్రాలలో కార్మికులు యాత్ర బృందానికి ఘనమైన స్వాగతం పలికారు. హైదరాబాద్‌, వరంగల్‌ మహానగరాలలోనూ, సంగారెడ్డి, హనుమకొండ, మహబూబాబాద్‌, మిర్యాలగూడ వంటి పట్టణాలలోనూ వందలాదిగా కదిలిన కార్మికుల స్పందన ప్రత్యేకంగా చెప్పుకోదగింది. నిజామాబాద్‌, సంగారెడ్డి, మిర్యాలగూడ పట్టణాలలో ప్రత్యేకంగా రవాణా కార్మికులు విరాళాలు ఇచ్చి ఉద్యమనిధిగా యాత్ర బృందానికి అందజేసారు. దీనికి తోడు యాత్ర ఆరంభం నుంచి చివరిదాకా కార్మికులు తమకు తోచిన మేరకు విరాళాలు యాత్ర హుండీలో వేసి సహకరించారు.
          కార్మికులు అడ్డాల సమస్యతో సతమతమవుతున్నారు. వీరిని పోలీసులు ఊరవతలకి, బస్‌స్టాండులూ, మార్కెట్లకూ దూరంగా తరుముతున్నారు. ఆర్టీసీ బస్సు దిగిన ప్రయాణీకులు, మార్కెట్లో సరుకులు కొనుగోలు చేసిన జనం, సినిమాహాల్స్‌ నుంచి బయటకు వచ్చినవారు, దేవస్థానాలు సందర్శించిన భక్తులు బయటకురాగానే ఆటోలు, కార్లూ, మాక్సీ క్యాబ్‌లూ అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అందుకే ఇలాంటి చోట్ల అడ్డాలుంటే ప్రయాణీకులకు సౌకర్యంగా ఉంటుంది. డ్రైవర్లకు ఆదాయం కూడా ఉంటుంది. అధికారులకూ, పోలీసులకూ మాత్రం ఈ సోయిలేదు. పోలీసుల వేధింపులకు అవధులు లేవు. యాదగిరిగుట్టమీదకు బస్సులు, కార్లు అనుమతించారు. ఆటోలను మాత్రం అనుమతించటం లేదు. భక్తుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించటం హర్షించదగిందే. అదే సమయంలో ఖర్చు భరించగలిగే వారికి, తమ ఇంటికి దగ్గర నుంచే కారులో కుటుంబ సమేతంగా బయలుదేరి గుట్టమీదకు వెళ్ళేందుకు అనుమతించారు. కానీ ఆ స్థోమత లేనివారు, ఆటోలలో వెళ్ళడానికి మాత్రం అనుమతించటం లేదు. ఇది పేదల పట్ల, ఆటో డ్రైవర్ల పట్ల వివక్ష. ప్రమాదాలు జరిగినప్పుడు మరణించిన, అంగవికలురైన కార్మికుల కుటుంబాలను, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఆన్‌లైన్‌ కంపెనీల దోపిడీ కూడా చెప్పారు. ఒకే ఆన్‌లైన్‌ పోర్టల్‌తో పనిచేస్తున్న కార్మికులను గ్రూపులుగా విడగొట్టి అనైక్యత సృష్టిస్తున్నారు. లారీ కార్మికులను పెద్ద పెద్ద కంపెనీలు బెంగుళూరు, ముంబై, చెన్నై లాంటి సుదూర ప్రాంతాలలో పనిలేదని వదిలేస్తున్నారని గోడు వినిపించారు. స్వరాష్ట్రానికి రావడానికి ఖర్చులు కూడా ఇవ్వరు. స్థానిక కార్మికులను తొలగించి వలస కార్మికులను నియమిస్తున్నారు. వలస కార్మికులు ప్రశ్నిస్తే స్థానికులను నియమిస్తున్నారు. చెత్త రవాణా చేసే వాహనాల రిపేర్లు, డీజిల్‌ ఖర్చులు కూడా డ్రైవర్లే భరించవల్సి వస్తున్నదని చెప్పారు. ఫైనాన్స్‌ సంస్థల వేధింపులకు హద్దులు లేవు. హ్రైర్‌ బస్సు కార్మికులకు పనిగంటలు లేవు. ఆర్టీసీలో యూనియన్లమీద, కార్మికుల మీద అమలు చేస్తున్న ఆంక్షల పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. రెండు విడతలు వేతన సవరణ జరుగక పోవటం, డీఏ బకాయిలు పెండింగ్‌ పెట్టడం లాంటి సమస్యల గురించి ఆవేదన వ్యక్తం చేసారు. మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన వారికి సులభతరమైన పనులు ఇవ్వనందువల్ల పెట్రోల్‌ పంపులో పనిచేస్తున్న ఘటనలు కూడా మా దృష్టికి వచ్చాయి.
యాత్ర బృందానికి అడ్డాలమీద, ఆర్టీసీ డిపోలలో వివిధ యూనియన్ల నుంచి సంఘీభావం తెలిపారు. వీరిలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, అనేక ఇండిపెండెంట్‌ యూనియన్ల నాయకులున్నారు. ఆర్టీసీ డిపోలలో ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్‌ యూనియన్ల నాయకులు, కార్యకర్తలు కూడా సాదరంగా ఆహ్వానించారు.
          ఈ కార్మికులంతా అనేక కులాలూ, ప్రాంతాలూ, హిందూ, ముస్లిం, క్రైస్తవ కుటుంబాలలో జన్మించినా, వారంతా రవాణా కార్మికులన్న వాస్తవాన్నే గుర్తిస్తున్నారు. మాకు స్వాగతం పలికిన ఒక యూనియన్‌ పేరు జై హనుమాన్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌. దాని అధ్యక్షుడు మన్సూర్‌ పాషా. తనకు పరిచయస్తులైన హిందూ కుటుంబాలు వచ్చినప్పుడు, గుడిలో తనకున్న పలుకుబడితో గర్భగుడిదాకా తీసుకుపోయి దర్శనం కల్పిస్తాడు. మరో యూనియన్‌ పేరు జై శ్రీరామ్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌. దాని ఉపాధ్యక్షుడు రహింతో సహా మా బృందానికి సాదరంగా స్వాగతం పలికారు. ఆది జాంబవ యూనియన్‌, శ్రీలక్ష్మీ నరసింహ యూనియన్‌... ఇట్లా పేరు ఏదైతేనేమి? హిందూ, ముస్లిం, క్రైస్తవులన్న తేడా లేదు. దళితులూ, గిరిజనులూ, బడుగు బలహీన వర్గాలూ, అగ్రవర్ణాలన్న దృష్టిలేదు. అందరూ కలిసే తమ యూనియన్లకు ఐక్యంగా నాయకత్వం వహిస్తున్నారు. కార్మికులంతా సమైక్యంగా నడుస్తున్నారు. అతిథ్యం ఇచ్చిన షాకత్‌అలీ, పాషాల కుటుంబాలైనా, యేసు భక్తుడు బాబు కుటుంబమైనా, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల కుటుంబాలైనా, అగ్రవర్ణ కుటుంబాలకు చెందిన కార్మికులైనా ఈ యాత్ర బృందాన్ని తమ ఆప్తులుగానే ఆదరించారు. కులాలూ, మతాలూ వారికి అడ్డురాలేదు. సహజమైన లింగభేదం కూడా వారికి అడ్డుగోడ కాలేదు. కార్మికులన్న ఒకే ఒక్క లక్షణం వారందరినీ ఒకే విధంగా స్పందించేటట్టు చేసింది. అదే వారి ఐక్యతకు మూలం. ఈ ఐక్యతను దెబ్బకొట్టటం కోసమే మోడీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నది. భావోద్వేగాలను రెచ్చగొడుతున్నది. ఈ కుతంత్రాలను అధిగమించి, ఐక్యంగా పోరాడినప్పుడే రవాణా కార్మికులకు, ఆర్టీసీలకూ ఉరితాడుగా మారిన మోటారు వాహన సవరణ చట్టాన్ని వెనక్కి కొట్టగలం. మోడీ ప్రభుత్వం మెడలు వంచి హక్కులు కాపాడుకోగలం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాడి సంక్షేమ బోర్డులు సాధించుకోగలం.

- ఎస్‌. వీరయ్య

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'
విప్లవ యోధ కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం
కాలిగిట్టెల శబ్దం
ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!
కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
హేతువాద కవిత్వం రాసిన సంప్రదాయ కవి
భూమి, భుక్తి, విముక్తి ధీరుడు కామ్రేడ్‌ ఠానునాయక్‌
ఛాందసం
హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
వలస శవం
'పరీక్షా' కాలం!

తాజా వార్తలు

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.