Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పొంచివున్న ఆర్థిక హింస | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

పొంచివున్న ఆర్థిక హింస

''భారతదేశం సుసంపన్నమైనది... భారతీయులు మాత్రం దరిద్రులు.'' - వలస పాలన కాలంలో వెల్లడైన ఈ అభిప్రాయం అంతకంతకూ రుజువు అవుతూనే ఉన్నది. తిండి, బట్ట, వసతి వంటి కనీస అవసరాలకు నోచుకోనివారు, విద్యావైద్యం అందక ఆకలి దప్పులతో అల్లాడేవారు. మనదేశంలో ముప్ఫై శాతానికి పైగానే ఉన్నారని అంచనా. అంటే దాదాపు 42కోట్ల మంది.
ప్రపంచీకరణ - సరళీకరణ - ప్రయివేటీకరణ విధానాలు గత ముప్ఫైమూడు ఏండ్లుగా ముమ్మరంగా అమలవుతున్న నేపథ్యంలో అన్ని రంగాలూ అతలాకుతలం అవుతున్నాయి. ప్రజల కష్టార్జితమైన ప్రభుత్వ సంస్థలన్నీ బాజాప్తుగా కార్పొరేట్‌ల పరం అయిపో తున్నాయి. అడవులు, గనులు, నదులు, సహజవనరుల ఆక్రమణలకు అంతులేకుండా పోతున్నది. ఆర్థిక అక్రమాల అవినీతి తారాస్థాయికి చేరింది. ఫలితంగా ప్రజలు బికారులై రోడ్డున పడుతున్నారు. రోజు రోజుకు నిరుద్యోగం తీవ్రమవు తున్నది. ఈ ముంచుకొస్తున్న ముప్పును ఆక్స్‌ఫామ్‌ నివేదిక ఆందోళనతో వెల్లడి చేసింది.
నూతన ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చాక శతకోటీశ్వరుల ఆదాయం అంతకంతకూ రెట్టింపు అవుతున్నదే తప్ప ఆగటం లేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా విపత్తు సమయంలో సైతం ఈ కోటీశ్వరుల ఆదాయం మందగించలేదు. సరికదా ఇంకా పెరిగింది. ఈ ఒక్కశాతం ఉన్న కోటీశ్వరుల సంపద ఇరవైరెట్లు పెరిగినట్లు ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది.
కష్టజీవులు అహౌరాత్రులు కష్టపడి సృష్టించే సంపద ఈ పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో కోటీశ్వరులకు ఎగబ్రాకిన కొలదీ విలోమంలో పేదల బతుకులు అగాధంలోకి దిగజారిపోతాయని ప్రత్యేకంగా చెప్పక్కల్లేదు. ఇది ఆర్థిక సూత్రం. ఈ ఫలితంగానే నేడు ఈ నివేదిక ప్రపంచంలో ప్రతినిముషానికి పదకొండుమంది ఆకలితో మరణిస్తున్నట్టు పేర్కొన్నది. ఎంత విషాదం?
కుల, మత, లింగ వివక్షలకన్నా ఈ ఆర్థిక వివక్ష భయంకర రాకాసిలా ప్రపంచాన్ని తరమబోతున్నదని హెచ్చరించింది. అయితే ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. మానవ కల్పిత వైపరీత్యం. కమ్ముకొస్తున్న ఈ ఆర్థిక వైపరీత్యాన్ని నివారించలేక ఎక్కడికక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ చేతు లెత్తేస్తున్నది.
ఈ వైపరీత్యం ఒకే దేశంలో రెండు ప్రపంచాలను సృష్టి స్తున్నది. కేవలం ఆర్థిక సంపాదన కోసం అర్రులు చాచే ప్రపంచం ఒకటైతే, అస్థిత్వాన్ని కాపాడుకుంటూ మనుగడ కోసం పోరాడే ప్రపంచం మరొకటి. ప్రభుత్వాలు సకాలంలో మేల్కొని సరైన చర్యలు గైకొనకపోతే ఈ రెండు ప్రపంచాలు ఎదురెదురుగా నిలిచి ఘర్షణకు సన్నద్దమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. దేశ ప్రజల సమైక్యత బ్రద్దలవుతుంది. ప్రజల మధ్య వైషమ్యాలు చాలా సులువుగా చెలరేగుతాయి.
అమెరికా, చైనాల తర్వాత ఎక్కువ మంది కుబేరులు ఉన్న దేశం మనదే. 2020లో 120 మంది ఉన్న ఈ కుబేరుల సంఖ్య (శతకోటీశ్వరులు) 2021 నాటికి 142కు పెరిగింది. 2022 నాటికి 166కు చేరింది. 40శాతంకు పైగా దేశ ప్రజల సంపద ఈ ఒక్క శాతం కుబేరుల చేతిలో కేంద్రీకృతమైనట్టు నివేదిక వెల్లడించింది.
దేశంలో కేవలం వందమంది కుబేరుల సంపదను లెక్కిస్తే అది 54లక్షల కోట్ల రూపాయిలట. గత ఏడాది (2021-2022) మన భారత బడ్జెట్‌ 39లక్షల కోట్లు కాగా, దానికి మించి 15లక్షల కోట్లకు పైగా సంపద వారి వద్దనే ఉంది. దేశం డొల్లవుతుందనే భయం వెంటాడుతున్నది కదా..!
ఆసియాలో మొదటి కుబేరుడు, ప్రపంచంలో రెండవవాడు అయిన గౌతమ్‌ అదాని సంపద రోజుకు 1612కోట్ల రూపాయలు. మరి మట్టిపనిచేసే రోజువారి సగటు కూలి రూ.150లు. రైతుకు వచ్చే దినసరి సగటు ఆదాయం రూ.340. ఇంత భయంకర వ్యత్యాసాలతో మన 'ప్రజాస్వామ్య' పాలన సాగుతున్నది. అందుకే ఈ పాలనా పద్ధతుల్ని 'దోపిడీ - లూటీ' అన్నా సరితూగుతాయో లేదో... మన భారత కుబేరుల సంపద 2020-22 మధ్య కాలంలో 121శాతం పెరిగినట్టు (రోజుకు 368కోట్లు) నివేదిక పేర్కొన్నది.
ఈ పాలనా క్రమం అనివార్యంగా సంపన్నులను మరింత సంపన్నులుగానూ, దరిద్రులను మరింత దరిద్రులుగానూ మారుస్తుందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ అమితాబ్‌ బెహర్‌ కూడా అభిప్రాయపడటం గమనార్హం.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళల్లో పంచవర్ష ప్రణాళికలతో మనం ప్రభుత్వరంగ సంస్థలకు పెద్దపీట వేశాం. ప్రయివేటు రంగాన్ని నియంత్రించగలిగాం. అలాగే ఆర్థిక అంతరాలు తగ్గించేందుకు పన్నుల వ్యవస్థను క్రమబద్దీకరించాం. ఇప్పుడవేమీ లేవు. సరళీకృత ఆర్థిక విధానాలతో అన్ని గేట్లు ఎత్తేసాం. అన్ని రంగాల్లో ప్రభుత్వ పాత్రను నామకా ఉంచుతూ ప్రయివేటుకు ఎర్రతివాచీ పరుస్తున్నాం. కడకు సంక్షేమ భావన నుండే పాలకులు తప్పుకుంటున్న దశ ఇది. సబ్సిడీలు ఎత్తేసి ప్రజల నుండి బలవంతాన పన్నులు వసూలు చేయడమే ప్రధాన ఆదాయ వనరుగా పాలకులు భావిస్తున్నారు. తత్‌ఫలితమే ఆర్థిక అసమానతల తీవ్రత అని నివేదిక వివరించింది.
2021-22లో వసూలైన 14.83లక్షల కోట్ల జీఎస్‌టీ (వస్తుసేవల పన్ను)లో 62శాతం పేద వర్గాల నుండి వచ్చిందే. సంపన్న వర్గాల నుండి వచ్చింది కేవలం మూడుశాతం మాత్రమే. ఈ పన్నుల పీడనను ప్రధాన మోడీ ఇక దాచలేరు. కాగా, భారత్‌లో పేదలు ఎక్కువ పన్ను చెల్లించడం, సంపన్నులు తక్కువ పన్ను చెల్లించడం ఒక వైపరీత్యంగానే భావించాలి మరి. పేదలకు ఇస్తున్న ఉచితాల వలన (రేషన్‌, విద్య, వైద్యం, వగైరా) సంపన్నులైన పన్ను చెల్లింపుదార్లు తెగబాధపడిపోతున్నట్టు బీజేపీ పాలకులు వాపోవటం ఇటీవల ఒక ప్యాషన్‌ అయిపోయింది. కానీ వాస్తవంగా పన్ను చెల్లింపు దారుల్లో పేదలే ఎక్కువ ఉన్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది.
కరోనా కాలం కూడా కుబేరులకు వరం అయింది. ఆర్థిక వ్యవస్థలు ఒకప్రక్క కుదేలయితే, కుబేరుల ఆస్తులు మాత్రం రెట్టింపు అయ్యాయి. కరోనా రెండేండ్ల సమయాన 84శాతం ప్రజల కుటుంబ ఆదాయం పడిపోయింది. ఆ నిరుద్యోగం కాటు నుండి ప్రజానీకం ఇప్పటికీ విడివడలేదు. కానీ కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో సహా అనేక రాయితీలు కుబేరులకు సాఫీగా దక్కాయి.
ఒక్కటే మార్గం. అపర కుబేరుల సంపదను పన్నుల వసూళ్ళరూపంలో వెనక్కి తీసుకువచ్చి పేదల సంక్షేమానికి వినియోగిస్తే తప్ప ఆర్థిక సమతుల్యతను సాధించలేమని సాక్షాత్తు ఆక్స్‌ఫామ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ గాబ్రియల్‌ బుచర్‌ అభిప్రాయపడుతున్నారు.
భారతదేశంలో అత్యున్నత కుబేరుల సంపదపై ఐదుశాతం పన్నువేసి వసూలు చేస్తే చాలు. ఆ డబ్బుతో (1.37లక్షల కోట్లు) బడికి రాని, బడిమానేసిన బాలలు అందరికీ ఉచిత పాఠశాల విద్యను అందించవచ్చు.
2017-21 ఈ నాలుగేండ్లలో ఆదాని ఆర్జించిన ఆస్తులపై ఐదుశాతం పన్నువేసి వసూలు చేస్తే, ఆ డబ్బుతో (1.79లక్షల కోట్లు) 50లక్షల మంది ఉపాధ్యాయులను నియమించి ఏడాది కాలం జీతాలు ఇవ్వొచ్చట. భారత దేశాన్ని రానున్న కాలంలో అగ్రదేశంగా నిలపాలంటే మౌలిక సదుపాయాల కల్పన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) పెట్టుబడి (ఇన్వెస్టుమెంట్‌) కొత్తగా కనుగొనడం (ఇన్నోవేషన్‌) సమ్మిళతాల (ఇన్‌క్లూజివ్‌)తో పాటు ఆర్థిక అసమానతల తగ్గుదల (ఇన్‌ఈక్వాలటీ రిడక్షన్‌)లపై పాలకులు దృష్టిపెడితే తప్ప నవభారత నిర్మాణం సాధ్యం కాదని ఆ నివేదిక స్పష్టం చేసింది. మరి మనమేం చేయాలీ..?

- కె. శాంతారావు
  సెల్‌:9959745723

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'
విప్లవ యోధ కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం
కాలిగిట్టెల శబ్దం
ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!
కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
హేతువాద కవిత్వం రాసిన సంప్రదాయ కవి
భూమి, భుక్తి, విముక్తి ధీరుడు కామ్రేడ్‌ ఠానునాయక్‌
ఛాందసం
హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
వలస శవం
'పరీక్షా' కాలం!

తాజా వార్తలు

07:24 AM

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..

07:15 AM

నేడు కవిత పిటిషన్‌పై సుప్రీం విచారణ..

06:57 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్ విడుద‌ల‌..

06:39 AM

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌..!

06:12 AM

డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ ..

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.