Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడ్జెట్‌ ఎవరి కోసం? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2023

బడ్జెట్‌ ఎవరి కోసం?

భారతదేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో ఫిబ్రవరి 1వ తేదీన 2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక పరిస్థితి గురించి మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటు న్నప్పటికీ... కోవిడ్‌ మహమ్మారి వల్ల, భారత ప్రభుత్వం దాన్ని ఎదుర్కొన్న వినాశకరమైన తీరుతో తలెత్తిన దారుణమైన ప్రభావాల నుండి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోవాల్సి ఉంది.
గత బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుండి, ఉక్రెయిన్‌లో సైనిక ఘర్షణ తలెత్తడం, పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి. అయినా, తాత్కాలికంగా ఏర్పడిన ప్రపంచ మాంద్యాన్ని ఎదుర్కొనడానికి భారత్‌ సన్నద్ధం కావాల్సి ఉంది. పైగా, తాత్కాలికంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యాన్నే కాకుండా ప్రపంచీకరణ సిద్ధాంతంలో ఉన్న వైరుధ్యాల ఫలితంగా దీర్ఘకాలం కొనసాగే పెట్టుబడిదారీ సంక్షోభాన్ని కూడా భారత్‌ ఎదుర్కొనాల్సి ఉంది. వ్యవసాయ సంక్షోభం, వేతనాల స్తంభన, వీటికి తోడు అధిక వృద్ధి దశలతో పాటు పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, ఉపాధి పొందిన కార్మికవర్గాన్ని కూడా తీవ్రంగా దోచుకోవడానికి దారి తీయడం, అసమానతల్లో తీవ్రమైన పెరుగుదల వంటి వైరుధ్యాలను భారతదేశ ఆర్థికాభివృద్ధి కూడా ప్రతిబింబిస్తోంది. ఈ పరిస్థితులపై ఆధారపడిన పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమం, ఈ పరిస్థితులు కల్పించిన డిమాండ్‌ సమస్యల కారణంగానే దాని ఊపును, ఉత్తేజాన్ని కోల్పోతూ వస్తోంది. కోవిడ్‌ మహమ్మారి తలెత్తడానికి ముందు కూడా ఈ పరిస్థితి నెలకొనడం కనిపిస్తోంది. తొలుత వేసిన ముందస్తు అంచనాల ప్రకారం, 2022-23లో భారతదేశ వాస్తవిక తలసరి జాతీయాదాయం కరోనా మహమ్మారికి ముందు 2019-2020 స్థాయి కన్నా కేవలం 2.4శాతమే అధికంగా ఉంటుండగా, సంవత్సరానికి కేవలం ఒకశాతం అంతర్లీన వృద్ధి రేటు ధోరణి కన్నా తక్కువగానే ఉండనుంది. ఇదే కాలంలో ద్రవ్యోల్బణ రేట్లలో తీవ్రమైన పెరుగుదల కూడా కనబడుతోంది. 2019-20, 2022-23 మధ్య మూడు త్రైమాసికాల్లో నామమాత్రపు జీడీపీ పెరుగుదల అనేది వాస్తవిక ఉత్పత్తి కన్నా ధరల్లో పెరుగుదల కారణంగా నమోదైంది. పారిశ్రామిక రంగంలో ఈ సంక్షోభం అత్యంత తీవ్రమైన రీతిలో ప్రతిబింబించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2022-23లో తయారీ రంగం కేవలం 1.6శాతమే వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. రికవరీ అనేది తీవ్రమైన అసమానంగా ఉంటుందని మోడీ ప్రభుత్వం అనుసరించిన వర్గ పక్షపాత దృక్పథం వల్ల తెలుస్తోంది. 2019-20, 2022-23 మధ్య కాలంలో నామమాత్రపు జీడీపీలో పెరుగుదల కన్నా ఎక్కువగా కార్పొరేట్‌, ఆదాయ పన్నుల ఆదాయాలు పెరగడమన్నది ఇందుకు రుజువుగా ఉంది. పన్నుల రేట్లు పెరగని పరిస్థితుల్లో ఇది జరిగిందంటే ఇందుకు గల ఏకైక మార్గం మొత్తం జాతీయాదాయాల్లో కార్పొరేట్‌ లాభాలు, అధిక ఆదాయాల వాటా పెరగడమే. ఫలితంగా, ఆదాయాల్లో మొత్తంగా ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితుల్లో భారతదేశ కార్మికవర్గం తీవ్రంగా నష్టపోయింది. పెరిగిన నిరుద్యోగం, తక్కువ వేతనాల కారణంగా ఈనాటి వారి ఆదాయాలు 2019-20లోని ఆదాయాలతో పోలిస్తే సగటు కన్నా తక్కువగానే ఉన్నాయి.
ఎలాంటి ముందస్తు ఆలోచన, ప్రణాళిక లేకుండా విధించిన లాక్‌డౌన్‌ లక్షలాదిమంది భారతీయులు కోవిడ్‌ కారణంగా మరణించకుండా నివారించలేకపోయింది. దీనికితోడు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అనుసరించిన విధానం కూడా ఈ సంక్షోభానికి దోహదపడింది. 2022 నవంబరు వరకు ఆదాయాలు, ఖర్చుల్లో ధోరణులు చూస్తే, 2022-23లో జీడీపీలో కేంద్ర పన్నుల వాటా (శాతం) 2019-20లో కన్నా అధికంగా ఉండా లని సూచిస్తోంది. పైగా, వీటిల్లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా గణనీయంగా అధికంగానే ఉండాలి. కేంద్ర పన్నుల ఆదాయాల్లో రాష్ట్రాల వాటా తగ్గడమే ఇందుకు కారణంగా వుంటుంది. మిగిలిన ఆర్థిక సంవత్సరానికీ ప్రస్తుత ధోరణే కొనసాగినట్లైతే, జీడీపీలో కేంద్ర ప్రభుత్వ వ్యయం కూడా 2019-20లో కన్నా తక్కువగా ఉండాలి. అదీకాకుండా, ప్రత్యక్ష పన్నుల ద్వారా అదనపు ఆదాయం లభిస్తున్నప్పటికీ, గతంలో పెంచిన చమురు ధరల పెంపులను ఇంకా పూర్తిగా తగ్గించలేదు. ఆ రకంగా, అసమానతల పెంపు ధోరణికి విరుగుడు చర్యలు తీసుకోవడానికి బదులుగా మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలు అసమానతలను మరింత తీవ్రం చేశాయి. డిమాండ్‌ తగ్గినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచ డంలో ప్రభుత్వం విఫలమైంది. ఆర్థిక వాస్తవికతలను పట్టించుకోని వైనం గతంలో కూడా స్పష్టంగా కనబడింది. కానీ, కరోనా మహమ్మారి, దాని పర్యవసాన ఆర్థిక ప్రభావాలకు సంబంధించి పెను మానవ విషాదాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఆ విధానాన్నే కొనసాగిం చేందుకు పట్టుబట్టడం ఇందుకు సంబంధించి క్రూరమైన కారణంగా ఉంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించే పేరుతో - ప్రభుత్వ ఆస్తులను మరింతగా ప్రయివేటీకరించడం, జాతీయాస్తుల మానిటైజేషన్‌ కార్యక్రమం, కొత్త వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టేందుకు విఫల యత్నం, రక్షణ, బీమా వంటి రంగాల్లో మరింత విదేశీ పెట్టుబడులను అనుమతించడం వంటి ఇతర చర్యలు దీనికి తోడయ్యాయి. ఇవన్నీ కూడా కొద్దిమంది బడా పెట్టుబడిదారుల వద్దనే సంపద పోగుపడడమనేది బాగా పెరిగేందుకు మోడీ ప్రభుత్వం గుడ్డిగా నమ్మి అనుసరించిన నిబద్ధత లక్షణాలు. దానికి మత త త్వ రాజకీయాలను ముసుగుగా వాడుకుంటోంది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సుదీర్ఘమైన ఈ అంతరాయాలు, ఆటంకాలతో... భారత ఆర్థిక భవితవ్యమనేది నిజాయితీగల ఆత్మనిర్భరతపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడేందుకు, కార్మిక వర్గాన్ని శాశ్వత దారిద్య్రానికి నెట్టడం ద్వారా లాభాలను పిండేందుకు ప్రయత్నించడానికి బదులుగా... విస్తృతమైన దేశీయ మార్కెట్‌ను అందించడానికి కార్మిక వర్గ సామర్ధ్యాన్ని మరింత స్వయం ప్రతిపత్తితో కూడిన అభివృద్ధి పంథా కోసం ఉపయోగించుకోవాల్సి ఉంది. ఇందుకోసం, వారికి అనుకూలంగా పంపిణీని మార్చడానికి, రైతుల ఆదాయాలను మెరుగుపరచడానికి, ఉపాధిని సృష్టించగల డిమాండ్‌ విస్తరణను పెంచడానికి పన్నులను విధించడాన్ని, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడాన్ని ఉపయోగించుకోవడం అనివార్యం. తద్వారా మెరుగైన ఆరోగ్య, విద్యా ఫలితాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో, ఇటువంటి ప్రాధాన్యత లను ప్రతిబింబించగల కేంద్ర బడ్జెట్‌ కోసం పోరాడేందుకు, వనరుల కొరతతో ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందన్న వాదనను తోసిపుచ్చేం దుకు వామపక్షాలు నిబద్దతతో ఉన్నాయి.
('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'
విప్లవ యోధ కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం
కాలిగిట్టెల శబ్దం
ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!
కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
హేతువాద కవిత్వం రాసిన సంప్రదాయ కవి
భూమి, భుక్తి, విముక్తి ధీరుడు కామ్రేడ్‌ ఠానునాయక్‌
ఛాందసం
హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
వలస శవం
'పరీక్షా' కాలం!

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.