Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2023

ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?

        ప్రపంచంలోని పెట్టుబడులలో ఎక్కువ శాతాన్ని దేశంలోకి ఆకర్షిస్తామని, తద్వారా 2025 నాటికి ఐదు లక్షల డాలర్ల ఆర్థికాభివృద్ధిని సాధిస్తామని, దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళతామని, లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని (సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనే మాటను ఎప్పుడో చాపకిందికి నెట్టేశారు) మోడీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తున్నది. ప్రభుత్వరంగం అవసరం లేదని, ప్రయివేటు రంగంతోనే దేశాభివృద్ధిని సాధిస్తామని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయటం, జాతీయ ద్రవ్యీకరణ పథకం ద్వారా లీజుకివ్వటం తదితర విధానాల ద్వారా ఆర్థికవ్యవస్థ మొత్తాన్ని బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థల చేతులలో పెడుతున్నారు. తమ యజమానులైన ద్రవ్య పెట్టుబడిదారుల ప్రయోజనాలను నెరవేర్చటం, హిందూత్వ విధానాలను ముందుకు తీసుకుపోవటమే లక్ష్యంగా ఈ విధానాలను అమలు జరుపుతున్నారు.
బహుళజాతి కంపెనీల్లో భారీ తొలగింపులు
కేవలం లాభాలను పెంచుకోవాలనే లక్ష్యంతో కొన్ని బడాసంస్థలు ఏ విధంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయో చూద్దాం. బడా సంస్థలలో ఒకటైన అమెజాన్‌ 18,000మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగులలో 6శాతం. సాఫ్ట్‌వేర్‌ సంస్థ సేల్స్‌ఫోర్స్‌ 8,000 (10శాతం) మందిని తొలగించింది. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ 1.86లక్షల మంది ఉద్యోగులలో 5.35శాతం మందిని తొలగించింది. ట్విట్టర్‌ 50శాతం మందిని తొలగించింది. తన ఆస్తిలో 90శాతం దానం చేసినట్లు గొప్పగా ప్రచారం చేసుకున్న మార్క్‌ జుకర్‌బర్గ్‌ పోటీ పెరిగి ఆదాయం తగ్గిందనే పేరుతో మెటా (ఫేస్‌బుక్‌) నుండి 11,000మంది (13శాతం) ఉద్యోగులను లే ఆఫ్‌ చేశాడు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలన్‌ మస్క్‌ ఆ సంస్థలోని 3,700మందిని (మొత్తం ఉద్యోగులలో 50శాతం), భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులలో 90శాతం మందిని లే ఆఫ్‌ చేశాడు. ప్రపంచంలో పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఒకటైన మైక్రోసాఫ్ట్‌ 3000మంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవాలన్న పేరుతో అమెరికన్‌ కంపెనీ హెచ్‌పి 2025 నాటికి 6,000 మందిని (మొత్తం ఉద్యోగులలో 10శాతం) తొలగించటానికి పథకం రూపొందించింది. అదే పేరుతో జొమాటో 2022లో 600మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. బెటర్‌ డాట్‌కాం సంస్థ 2021 డిసెంబరు నుండి 4,100 మందిని తొలగించింది. ప్రపంచంలో అతి పురాతనమైన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ 3,800 మందిని లే ఆఫ్‌ చేసింది. ఇదే దారిలో... రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, రాబిన్‌హుడ్‌, నెట్‌ఫ్లిక్స్‌, యూనిలివర్‌, టెస్లా... వంటి అనేక సంస్థలు లే ఆఫ్‌ చేశాయి. దేశంలో విద్యారంగంలోని అతి పెద్ద కంపెనీ అయిన బైజూస్‌ 2500 మంది ఉద్యోగులకు లే ఆఫ్‌ ఇచ్చింది. ఈ సంస్థలన్నీ శత కోటీశ్వరుల చేతులలోనే ఉన్నాయి. లాభాలు సంపాదిస్తున్నాయి. అయినప్పటికీ కేవలం లాభాలను మరింతగా పెంచుకోవటం కోసమే ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఉన్నవారినే తొలగిస్తుంటే కొత్త ఉద్యోగాలు ఎలా?
దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రయివేటీకరిస్తామని మోడీ ప్రకటించారు. ప్రయివేటు సంస్థలు ఉద్యోగులను ఏ విధంగా తొలగిస్తున్నాయో పైన చూశాం. ప్రయివేటీకరణ వలన దేశంలోకి పెట్టుబడులు వస్తాయని, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. కాని బడా పెట్టుబడిదారులు దేశంలో ఏర్పాటు చేస్తున్న కొత్త పరిశ్రమలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు దేశంలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారంటే మా రాష్ట్రంలో పెట్టండి అంటే మా రాష్ట్రంలో పెట్టండి అని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంట పడటం చూస్తున్నాం. ప్రయివేటీకరణ వలన పెట్టుబడులు వస్తాయనటం ఎంత బూటకమో ఇది స్పష్టం చేస్తున్నది. అయినా దేశంలోకి పెట్టుబడులు రావటం వలన కొత్త పరిశ్రమల ఏర్పాటు, కొత్త ఉద్యోగావకాశాల సంగతి కాసేపు పక్కనబెడ్డాం. కాని ఉన్న పరిశ్రమలు ప్రభుత్వం నుండి ప్రయివేటు వారి చేతుల్లోకి పోతే కొత్త ఉద్యోగాలెలా వస్తాయి? ప్రయివేటు సంస్థలు ఉన్న ఉద్యోగులనే తొలగిస్తుంటే కొత్తవారికి ఉద్యోగాలెలా ఇస్తాయి?
నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ-ప్రయివేటు సంస్థల మధ్య వ్యత్యాసం ఏమిటనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. సంక్షోభం పేరుతో ప్రైవేటు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నా ఒక్క ప్రభుత్వరంగ సంస్థ కూడా ఉద్యోగులను తొలగించలేదు. కారణం ప్రభుత్వరంగ సంస్థలు కేవలం లాభాల కోసం మాత్రమే కాక, సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నాయి. అందువలన ప్రయివేటు సంస్థల వలె కార్మికులు, ఉద్యోగులను తొలగించటం లేదు. ఉద్యోగులను తొలగించక పోయినప్పటికీ ఆ సంస్థలు నష్టాలపాలు కావటం లేదు. కేవలం లాభాలు తగ్గటం మాత్రమే జరుగుతుంది. ప్రయివేటు సంస్థలకు ఏ సామాజిక బాధ్యత లేదు కాబట్టే లాభాలు వస్తున్నప్పటికీ ఇష్టం వచ్చినట్లు ఉద్యోగులు, కార్మికులను తొలగిస్తున్నాయి.
కార్పొరేట్‌ సంస్థలతో అభివృద్ధి, ఉద్యోగ కల్పన జరగదు. బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థలకు మన దేశాభివృద్ధి పట్టదు. వారికి లాభాలే ప్రధానం. లాభాలు వస్తాయనుకుంటే అభివృద్ధిని అడ్డుకోవటానికి, దేశాభివృద్ధిని దెబ్బ తీయటానికి కూడా వారేమాత్రం వెనుకాడరు. ఉద్యోగాల కల్పన సంగతి అటుంచి తమకు లాభాలు వస్తున్నప్పటికీ వాటిని ఇంకా పెంచుకోవటం కోసం ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తారు. అటువంటి వారిని నమ్ముకొని దేశాన్ని అభివృద్ధి చేస్తామని, ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పటం అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే.
దేశంలో అభివృద్ధి జరగాలన్నా, నిరుద్యోగం తగ్గాలన్నా పెద్దసంఖ్యలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడాలి. వాటికి ముడి సరుకులు, మార్కెట్‌, రుణాలు తదితరాలలో ప్రభుత్వం సహకారం అందించాలి. బడా సంస్థల నుండి ఎదురయ్యే పోటీ నుండి రక్షణ కల్పించాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంత ఎక్కువగా ఏర్పాటైతే అంత ఎక్కువ మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశాభివృద్ధి జరుగుతుంది. అంతే తప్ప ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ, విదేశీ పెట్టుబడులపై ఆశలు పెంచుకొన్నంత కాలం నిరుద్యోగం తగ్గదు. దేశాభివృద్ధి జరగదు.
- ఎ. కోటిరెడ్డి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'
విప్లవ యోధ కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం
కాలిగిట్టెల శబ్దం
ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!
కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
హేతువాద కవిత్వం రాసిన సంప్రదాయ కవి
భూమి, భుక్తి, విముక్తి ధీరుడు కామ్రేడ్‌ ఠానునాయక్‌
ఛాందసం
హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
వలస శవం
'పరీక్షా' కాలం!

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.