Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
త్యాగం చేద్దాం రారండి.. | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

త్యాగం చేద్దాం రారండి..

        ఈ గణతంత్ర శుభదినాన మనదేశ స్వాతంత్య్రం కోసం పోరాడినవారిని యాది చేసుకోవాలి. వారి జీవితాల్లోని ముఖ్యమైన సంఘటనల్ని గుర్తుచేసుకోవాలి. వారి త్యాగాలను మననం చేసుకోవాలి. మనకో రాజ్యాంగాన్ని రాసిన మహనీయులను, ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణ తంత్ర దినోత్సవాన్నీ సగర్వంగా జరుపు కోవాలి... అలా నాయకుల ఉపన్యాసాలు సాగి సా.... గిపోతూ ఉంటాయి. అలా పాత నాయకులు చేసిన త్యాగాలేమిటి, నేటి నాయకులు చేసిన త్యాగాలేమిటి అని తెలుసుకుందామని మనసు లబలబలబలాడిపోయింది, గుండె డబడబడల కొట్టేసు కుంది...
చేయడం కష్టంగా, చెప్పడం సులభంగా ఉండేది ఏది? ఒక ఉదాహరణ ఇవ్వండి అని అడిగితే టక్కున సలహా ఇవ్వడం అని చెబుతారు చాలామంది. అయితే దానికి తోడు ఇంకోటి కూడా ఉంది. అదే త్యాగం చేయడం. త్యాగం చేయండని చెప్పడం చాలా సులువు. స్వయంగా చేయడం చాలా కష్టం.
మనవి త్యాగం చేయడం ఒక రకమైతే, ఇతరులవి త్యాగం చేయడం మరో రకం. మొదటిదాన్ని తీసుకున్నట్టైతే స్వాతంత్య్ర పోరాట కాలంలో తమ ఇళ్ళను, ఆస్తులను, తాము చేస్తున్న ఉద్యోగాలను కూడా జాతికోసం త్యాగం చేసేసి బ్రిటిషు వారిపై పోరాటం చేసినవారు ఎందరో. గాంధీ సినిమా చూస్తే తమ మెడలోని దండలను, చేతులకుండే గాజులు, ఉంగరాలు ఒకటేమిటి బంగారం కంటే దేశ ప్రజలందరికీ వచ్చే స్వేచ్ఛనే అసలైన బంగారమనుకొన్నవారు కనిపిస్తారు. అంతేనా, ఎందరో కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు కూడ ఓపక్క స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఇంకోపక్క తాము నమ్మిన సిద్ధాంతాల కోసం, పార్టీకోసం సర్వం త్యాగం చేశారు.
ఇక రెండోరకం అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడంటారు కదా! ఆ టైపు. నేను పదో తరగతి పాసైతే నీ తలవెంట్రుక లిస్తానని దేవుడి దగ్గర ప్రమాణం చేశాను అన్నట్టే ఉంటుంది. నీతల, నీ తలనీలాలు నీ ఇష్టం. అందులోనూ నీ పరీక్ష కాబట్టి నీ వెంట్రుకలు ఇవ్వడం న్యాయం, ధర్మం కూడా. అలాకాదని నీ పరీక్ష నీవు పాసై, పై తరగతికి నీవు ఏ మంచి కాలేజీకో అంతకంటే మంచి క్రాపుతో పోయి నన్ను గుండుతో ఉండమనడం అన్యాయం కదా! అంటే అందరూ అవును నిజమేనంటారు. అన్యాయమే నంటారు. కానీ ఎన్నుకున్న నాయకుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు దేశానికి, ప్రజలకు చెందిన ఆస్తులను, ప్రభుత్వ సంస్థలను చవకగా అమ్మేస్తుంటే అన్యాయాన్ని అన్యాయంగా చూడరు. అందుకే ప్రజలకు ఇన్ని కష్టాలు.
ఒక సినిమాలో బాబూమోహన్‌ భలే మంచి చౌకబేరమూ అంటూ అసెంబ్లీ భననాన్ని అమ్ముతూ ఉంటాడు. త్వరగా కోనుక్కోండయ్యా ఇంకా సాలార్జంగ్‌ మ్యూజియం, గోల్కొండ, జూ అలా ఇంకెన్నో అమ్మాలి అంటుంటే ఏదో తమాషాకు అనుకున్నాం. అది నిజమని తెలుస్తోందిప్పుడు. అలా ప్రభుత్వ అంటే ప్రజల సొమ్ములను అమ్ముతూ ఉన్నారు అని అపోహ పడకుండా వాటిని తొంభైతొమ్మిదేళ్ళు తక్కువ బాడుగకు లీజుకివ్వడం, అలా లీజుకు తీసుకున్నవాళ్ళు దాన్ని బాగా డెవెలప్‌ చేస్తారని చెప్పడం చూస్తే అబ్బో మన నాయకులు హాస్యం కూడా బాగా పండిస్తారని తెలిసిపోతుంది మనకు. హాస్యం పరమౌషదం కాబట్టే ఆ ఔషదాన్ని కరోనా సమయంలో గంటలు కొట్టించి ఉచితంగా సేవ చేయలేదూ!! దేనికైనా మన ప్రజలు ఎంతో విశాల హృదయులు కాబట్టి ఓపికా ఎక్కువే, తట్టుకునే శక్తీ ఎక్కువే అదంతా కూడా త్యాగమే అనుకోవాలి.
ఉద్యోగుల సొమ్ములైన పెన్షన్‌ నిధులు, పి.ఎఫ్‌ ఖాతాలోని సొమ్ములను కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలే త్యాగం చేస్తున్నాయని వార్తలు బయట కొస్తున్నాయి. కూతురు పెళ్ళి ఉంది నాసొమ్ము నేనే డ్రా చేసుకుంటానంటే కూడా దయతలచడంలేదు. ఆ మాత్రం ప్రభుత్వంకోసం త్యాగం చేయలేవా, నీకామాత్రం త్యాగ గుణం లేదా అని ఎదురు మాట్లాడే అవకాశమూ ఉంది.
త్యాగయ్య అంటే ఓ సంగీత విద్వాంసుడని ఎవరైనా చెబుతారు. కానీ కాలం, దేశం, ప్రపంచం, మనుషులూ మారిపోయి అపర త్యాగయ్యలు, త్యాగమ్మలూ తయారయ్యారు. ఇక ఎన్నికలొస్తే చాలు నోరులేని నాలుక ద్వారా సంగీత ప్రపంచాన్ని, గాయకులను తలదన్నేలా తమ నోటితో హామీల మీద హామీలు కుమ్మరించి తడాఖా చూపిస్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకంతో ఇహ చూస్కో అని షురూ చేసినట్టు కనిపిస్తుంది. చెప్పినవాటిల్లో చేసేది అదే మొదటిది, చివరిదీ. ఎన్నికలముందు ఇచ్చిన మ్యానిఫెస్టోలోని మిగతా అంశాలు మరుసటి ఎన్నికలకు త్యాగం చేసేస్తారు.
రెండు రోజుల్లో ఎల్‌.ఐ.సి సొమ్ము పద్దెనిమిది వేల కోట్లు అమాంతం గాలిలో కలిసిపోయింది. ఇది ఒక మిత్రుడికోసం చేసిన త్యాగమని తెలుసుకోవాలి. స్నేహ బంధం ముందు అన్నీ దిగదుడుపే. ఈ త్యాగాన్ని ప్రజలు భరించాలి. ఊరికే దేశభక్తి అంటూ సినిమా హాల్లో జాతీయ గీతం వచ్చేటప్పుడు నిలబడితే సరిపోదు. ఇలాంటి త్యాగాలే అసలైన భక్తికింద లెక్క. అప్పుడే మీరు దేశ పౌరుల లిస్టులో ఉంటారు. కాబట్టి త్యాగధనుల లిస్టులో ఉంటేనే మంచిదని కొందరి ప్రయత్నం.
ఎమ్మెల్యే లేదా ఎంపీ అయితే ఐదు సంవత్సరాలు ఉండొచ్చు. ఒక్కోసారి ముందస్తు ఎన్నికలంటూ తమవారి నందరినీ రాజీనామా చేయమంటారు. నాకోసం మీరంతా త్యాగం చేసి తీరాలంటారు. మళ్ళీ సీటు గ్యారెంటీనో కాదో చెప్పరు.
అందుకే త్యాగధనుల దేశంలో ప్రజలు తమ బతుకుల్ని త్యాగం చేసినా దేనికోసం చేస్తున్నామో తెలిసి చేయాలి. అంతే తప్ప అపాత్రదానం చేసినట్టు దేశానికి చేటు తెచ్చే త్యాగాలను చేయరాదు. చేయనివ్వ రాదు.

- జె. రఘుబాబు
  సెల్‌:9849753298

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'
విప్లవ యోధ కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం
కాలిగిట్టెల శబ్దం
ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!
కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
హేతువాద కవిత్వం రాసిన సంప్రదాయ కవి
భూమి, భుక్తి, విముక్తి ధీరుడు కామ్రేడ్‌ ఠానునాయక్‌
ఛాందసం
హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
వలస శవం
'పరీక్షా' కాలం!

తాజా వార్తలు

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

01:58 PM

కాందార్ లోహా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీఆర్

01:57 PM

ఇఫ్తార్‌లో విందులో ఫుడ్ పాయిజ‌న్.. 100 మందికిపైగా అస్వ‌స్ధ‌త‌

01:20 PM

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు

01:10 PM

28న హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం

01:06 PM

కాంగ్రెస్‌లో చేరిన డీ.శ్రీనివాస్.. సొంత ఇంటికి వచ్చినట్లు

12:57 PM

రాహుల్ గాంధీ ఏం నేరం చేశారు : ప్రియాంక గాంధీ

12:41 PM

డేటా చోరీ కేసులో రంగంలోదిగిన ఆర్మీ..

12:29 PM

భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్...

12:29 PM

ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ నిరసన దీక్ష..

12:21 PM

పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి..

12:19 PM

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే తీగల వంతెన...

12:10 PM

ఇస్రో బృందానికి అభినందన‌లు తెలిపిన సీఎం జగన్‌

11:51 AM

సిట్ విచారణకు హజరుకాలేను : బండి సంజయ్‌

11:29 AM

రాహుల్‌కు మద్దతుగా దేశ వ్యాప్తంగా దీక్షలు..నిర‌స‌నలు

11:00 AM

నేను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సజ్జల ఎలా తెలిసింది : రామనారాయణ రెడ్డి

02:36 PM

విజయవంతమైన ఇస్రో రాకెట్ ప్రయోగం..

10:26 AM

పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి..

10:13 AM

దారుణం వదినను రోకలిబండతో కొట్టి చంపిన మరిది..

10:00 AM

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 నౌక ..

09:30 AM

అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

09:11 AM

జూపార్కులో గుండెపోటుతో చీతా మృతి..

08:49 AM

ఏపీ మంత్రి సురేష్‌కి తప్పిన పెను పమ్రాదం..

08:35 AM

గాంధీ డిగ్రీపై వ్యాఖ్యపై స్పందించిన గాంధీ మునిమనవడు..

08:21 AM

నేడు డబ్ల్యూపీఎల్ ఢిల్లీ, ముంబై తుది పోరు..

07:58 AM

రాజస్థాన్‌లో స్వ‌ల్ప భూకంపం..

07:35 AM

జైలు నుంచి పెరోల్‌పై వచ్చి వివాహం చేసుకున్న యువకుడు..

07:09 AM

నేడు సిట్ ముందుకు బండి సంజయ్..!

10:48 AM

సీసీఎల్‌-2023 టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు వారియర్స్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.