Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మారుతున్న ఉపాధి సంబంధాలు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

మారుతున్న ఉపాధి సంబంధాలు

            సంపద సృష్టికర్తలు కార్మికులు కాదు, పెట్టుబడుదారులే అంటూ స్వయానా ప్రధానమంత్రి లాంటి వ్యక్తులే ప్రకటిస్తుంటే, కార్మికుల పాత్రను నామమాత్రం చేస్తూ సమాజం ఒక విపరీత ధోరణిని తీసుకుంటున్నది. ఈ రకమైన ప్రకటన ద్వారా కార్మికులను ద్వితీయ శ్రేణికి తోసివేయడమే కాకుండా డబ్బు మాత్రమే సమకూర్చిన పెట్టుబడిదారులకు పెద్దపీట వేయడం జరుగుతుంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం రాజకీయాలను, ప్రభుత్వాల ఏర్పాటును పెట్టుబడిదారులు శాసించగల స్థాయికి చేరుకోవడమే. అయితే ఇలాంటి భావనలకు దారి తీయడానికి మరో కారణమేమంటే ఒకప్పుడు ఉత్పత్తి ఒకేచోట ఒక కర్మాగారంలో లేదా ఒక కాంప్లెక్స్‌లో ఉండే అనేక కర్మా గారాలలో వర్కర్లందరూ కలిసి ఉత్పత్తి చేసేవారు. అందుచేత పిరియాడికల్‌గా బయటకు వస్తున్న ఉత్పత్తి ఎంతో అందరికీ కనిపించేది. మారిన పరిస్థితులలో ఒక వినియోగ వస్తువుకు సంబంధించిన ఉత్పత్తి ఒకేచోట జరగడం లేదు. ఒకే రకమైన నైపుణ్యం గల వ్యక్తుల ద్వారా కాకుండా వివిధ నైపుణ్యం గల వ్యక్తుల ద్వారా, వివిధ ప్రదేశాలలో వివిధ రకాల విడిభాగాలన్నీ వేరువేరుగా ఉత్పత్తి చేయబడి, అంతిమ వినియోగ వస్తువు మరోచోట తయారవుతుంది. దీని ద్వారా జరిగిన మార్పు ఏమంటే, ఒక ఇండిస్టీకి సంబంధించిన వర్కర్లు ఒకే చోట, ఒకే సమయానికి, ఒకే సారూప్యతతో పని చేసే అవకాశం లేకపోవడం వల్ల ఎవ్వరూ ఐక్యతగా ఏర్పడి యాజమాన్యాన్ని నిలదీసే పరిస్థితి లేకుండా పోయింది. అనగా ఉపాధిదారులు క్రమం తప్పకుండా ఒకే చోట పని చేసే అవకాశం లేకపోవడం వల్ల సంఘటిత పడే అవకాశాన్ని కోల్పోయి యాజమాన్యాలతో సంబంధాలు తెగిపోయాయి.
ఇక మరో రకమైన మార్పు ఏమంటే వర్క్‌ ఫ్రం హౌం అనే కాన్సెప్ట్‌ మొదలైన తర్వాత ఉద్యోగులు ఎవరూ ఆఫీసులకు వెళ్లవలసిన అవసరం లేకుండా పోయి, కేవలం కంప్యూటర్ల ద్వారా కమ్యూనికేషన్లు తీసుకొని, నెట్‌ బ్యాంకుల ద్వారా జీతభత్యాలు స్వీకరించి, తమకు కేటాయించిన పనిని పూర్తి చేయడం వలన ఉద్యోగికి యజమానికి సంబంధాలలో విపరీతమైన మార్పులు వచ్చాయి. అనేక సందర్భాలలో నెలలు సంవత్సరాలు ఒక కంపెనీకి సేవలు అందించిన ఉద్యోగులు చాలామంది, యజమాని పేరు తప్ప భౌతికంగా వారిని చూసిన పరిస్థితులే లేవు. అనేక మంది ఉద్యోగులు తమకు నష్టం జరగనంతవరకు యాజమాన్యాన్ని తెలుసుకోవాలన్న ఊసే ఎత్తడం లేదు. ఒక దేశంలో ఉన్న వ్యక్తి వేరొక దేశంలోని కంపెనీకి సేవలు అందించడం, పారితోషికాన్ని తీసుకోవడం చక చక జరిగిపోతున్నాయి. దీనివల్ల నైపుణ్యానికి తగిన ప్రతిఫలం వస్తుందని సదరు ఉద్యోగి భావిస్తూ ఉండవచ్చు. కానీ అటువంటి పనికి విపరీతమైన పోటీ ఉద్యోగికి కనిపించకుండానే సృష్టించి, ఎక్కువ నైపుణ్యం గల వారికి తక్కువ చెల్లిస్తూ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ఎంతోమంది పెట్టుబడిదారులు మోసం చేస్తున్న సంగతి గుర్తించే అవకాశమే లేకుండా ఉన్నది. ఇలాంటి పని విధానంలో మహిళలని ఎక్కువగా వినియోగించు కుంటారు. వర్క్‌ ఫ్రం హౌం కొంతమేర మహిళలకు అనుకూలంగా ఉండడం వలన, సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉండటం వలన మహిళలు ఏమాత్రం నైపుణ్యానికి తగిన ప్రతిఫలం కోసం బేరమాడకుండా ఇలాంటి ఉపాధికి ఒకరకంగా బలవుతున్నారు. అందుచేత మారుతున్న పని పద్ధతులలో మహిళలు సమిధలవుతున్నారు. ఉపాధి కాంట్రాక్టీకరణ నుండి జాబు కాంట్రాక్టీకరణ అనే పద్ధతులకు పరిస్థితి ఇప్పుడు మారింది. అనగా ఒక ఉద్యోగిని నిర్ణీత పనికి కాంట్రాక్టు పద్ధతిన నియమించుకునే వ్యవస్థను నూతన ఆర్థిక విధానాల మొదలైన తర్వాత చూసాం. ఇప్పుడు ఉద్యోగిని నియమించుకోకుండా అలాంటి వ్యక్తులకు పనిలో కొంత భాగాన్ని కాంట్రాక్టుకు ఇచ్చి పని చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుచేతనే శ్రమకు, శ్రామికుడికి గతంలో ఉన్నంత విలువ గుర్తింపు ఇప్పుడు లేవు. సెమీ సంఘటిత రంగంగా భావింపబడుతున్న నైపుణ్యాలతో పని జరిగే చోట కూడా శ్రామికునికి ప్రాధాన్యత కరువైంది. నూతన ఆర్థిక విధానాల అనంతరం శ్రమ దోపిడీ ఎక్కువ అవుతది, శ్రామికులు కూడా వస్తువులుగా వాడబడతారు అన్న వాదనను చాలా మంది నమ్మలేదు. అంతే కాకుండా అవకాశాలు మెరుగవుతాయని వాదించి, ప్రపంచీకరణలో భాగంగా విస్తరించిన అవకాశాలను చూపించి ఎద్దేవా కూడా చేశారు. కానీ ముప్పై ఏండ్ల తర్వాత దాని విషపూరిత ఫలితాలు ఇప్పుడు అనుభవంలోకొస్తున్నాయి.
అసంఘటిత రంగంలో మొదటి నుంచీ మహిళలకు ద్వితీయ శ్రేణి గుర్తింపే. ఎందుకంటే భౌతిక శక్తి తక్కువగా ఉండటం వల్ల తక్కువ ప్రాధాన్యతనిస్తూ తక్కువ చెల్లిస్తారు. ఈ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. అయితే సంఘటితమై పోరాడిన చోట ఫలితాలు మెరుగైన మాట కూడా వాస్తవమే. అయితే వలస కార్మికుల తాకిడి పెరిగిన తరువాత స్థానిక మహిళా కార్మికులకు ఉపాధి కరువైన మాట వాస్తవం. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు, తాలూకా మండల స్థాయిల్లోని నూనె, రైస్‌, నూలు వంటి ఇండిస్టీలలో ఈ ఇతర రాష్ట్ర వలస కార్మికులను కుటుంబాలతో సహా తెచ్చుకుని పెట్టుకోవడం వల్ల తక్కువ పారితోషికానికి పని గంటలతో నిమిత్తం లేకుండా ఎక్కువ పని చేయించుకుని దోపిడీ చేస్తున్నారు. కుటుంబం మొత్తాన్ని పనిలో పెట్టుకోవడం వల్ల మహిళల శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వటం లేదు. అయితే ఈ నియామకాలు కూడా ఒక సబ్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిన యజమానికి వర్కరుకు మధ్యన ఒక దళారీ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. ఏ రకమైన రాతపూర్వక ఒప్పందాలూ ఉండవు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో సహా కుటుంబ యజమాని దాష్టీకానికి అబలలు బలవుతున్నారు. అంతే కాకుండా స్థానికులైతే సంఘటితమవుతారని, ప్రమాదాలకు నష్టపరిహార మడుగుతారనీ, సంఘాలు-రాజకీయాలు కలుగజేసు కుంటాయని కూడా ఈ యాజమాన్యాలు భావిస్తున్నాయి. గత్యంతరంలేని కారణంగా స్థానికులు మరో ప్రాంతానికి వెళ్ళి ఇదే రకమైన దోపిడీకి గురవుతున్నారు. సిఐటియు అగ్రనాయకులు ఎస్‌. వీరయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌ చుట్టుపక్కల గల పారిశ్రామికవాడల్లో జరిపిన పాదయాత్ర సందర్భంగా ఈ వాస్తవాలు అనేకం బయటపడ్డాయి. వలస కార్మికులపై సమగ్ర విధానం ప్రభుత్వాలు పాటించకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురిస్తుంది.
ఇక సంఘటిత రంగంలోని మహిళలు, ముఖ్యంగా కుటుంబ భారం పైబడిన వారిని టార్గెట్‌గా చేసుకుని కంపెనీల సతాయింపు లుంటున్నవి. ప్రస్తుత మాంద్య పరిస్థితుల్లో అత్యధిక పారితోషికాన్ని పొందుతున్న వారిని మొదటగా తొలగించి వారి స్థానాల్లో అవసరం మేరకే కొత్తవారిని నియమించు కుంటున్నారు. సహజంగా కొత్తవారు తక్కువ జీతానికి అందుబాటులో ఉంటారుగా! గత ఆరు నెలల కాలంలో ప్రయివేటు ఉపాధి కోల్పోయిన కారణంగా ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఎన్‌.సి.ఆర్‌.బి తెలిపింది. రిపబ్లిక్‌ డే ఉపన్యాసంలో గవర్నర్‌ తమిళిసై తెలంగాణ సర్కారుపై అక్కసుతోనే చెప్పినప్పటికీ ఆత్మహత్యల్లో పెరుగుదల ఉండటానికి కారణం అసంబద్దమైన తొలగింపులే. అయితే బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక, మహారాష్ట్రల్లోనూ మరింత ఎక్కువగా ఈ ఆత్మహత్యలుండటం పాలనతో పాటు వైపరీత్యపు పెట్టుబాడిదారి వ్యవస్థ లోపాలకు అద్దం పడుతుంది. ఎక్కువెక్కువ ప్యాకేజీలతో, విపరీత పోటీతత్వంతో ఈ అనిశ్చితితో(ప్రికేరియస్‌) కూడిన వ్యవస్థను బలపరుస్తున్నది కూడా నైపుణ్యంగల యువతనే. అయితే కొంత కాలం గడిచాక, బాధ్యతలు పెరిగాక గాని దీనిలో లోపాలనూ, సంఘటిత ఐక్యతనూ వారు గుర్తించటం లేదు. కాంట్రాక్టు వ్యవస్థలో 27 రకాలున్నాయంటే దోపిడీ కోసం దాని తీవ్రత చూడండి. వ్యక్తిని నియమించుకోకుండా పని(జాబ్‌)లోని కొంత భాగానికి మాత్రమే అంగీకారానికి రావడంతో వివిధ రకాల విడిభాగాల పనికి దళారీ వ్యవస్థ పెరిగి ఉద్యోగికీ యజమానికీ సంబంధాలు ఏర్పడే అవసరమేలేదు. ఉదాహరణకు మొబైల్‌కు సంబంధించిన విడిభాగాల ఉత్పత్తిలో ఈ పద్ధతి కళ్ళకు కట్టిన సత్యం. పది పదేహేను దేశాల్లో ఉత్పత్తవుతున్న విడిభాగాలన్నీ కలిపితే ఒక సెల్‌ఫోన్‌ తయారవుతుంది. అలాంటప్పుడు ఆప్పిల్‌, వన్‌ఫస్‌ వంటి కంపేనీల ఉద్యోగులను ప్రత్యేకంగా గుర్తించే అవకాశమే లేదు. నియామకాలు తొలగింపుల్లో పాటించవలసిన ప్రభుత్వాల నిబంధనలను తప్పించు కునేందుకు దళారీ వ్యవస్థ కంపెనీలకు బాగా ఉపకరిస్తుంది. గత్యంతరంలేక నిరుద్యోగులు వారిని ఆశ్రయించాల్సి రావడం, దళారీల కమిషన్‌ పోగా మిగిలిందే తీసుకోవాల్సి రావడం తప్పని పరిస్థితిగా ఏర్పడింది. వెరసి- కాంట్రాక్టీకరణ, ఔట్సోర్సింగ్‌, ప్యాకేజీ వర్క్‌... వంటి పని విధానాలతో ఉద్యోగీ యజమానీ మధ్య ఉపాధి సంబంధాలు కనీస స్థాయిలో కూడా ఉండటం లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీకి ఇవి మరింత దోహద పడుతున్నవి. ప్రపంచీకరణను ఎదుర్కునేందుకు పోరాటాలనూ ప్రపంచీకరించి నట్లుగానే కార్మికుల ఐక్యతకు ప్రత్యామ్నాయ మార్గా లను వెతుక్కోవాల్సిందే.

- జి. తిరుపతయ్య

  సెల్‌:9951300016

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'
విప్లవ యోధ కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం
కాలిగిట్టెల శబ్దం
ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!
కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
హేతువాద కవిత్వం రాసిన సంప్రదాయ కవి
భూమి, భుక్తి, విముక్తి ధీరుడు కామ్రేడ్‌ ఠానునాయక్‌
ఛాందసం
హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
వలస శవం
'పరీక్షా' కాలం!

తాజా వార్తలు

09:40 PM

టీ20 క్రికెట్లో వరల్డ్ రికార్డ్ ఛేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా

09:26 PM

భారత్ కు నాలుగో స్వర్ణం…

09:23 PM

ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ 'రేగులపల్లి'..

09:15 PM

నిఖత్‌ జరీన్‌ను అభినందించిన సీఎం కేసీఆర్‌

08:45 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

08:40 PM

ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్

08:36 PM

ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్‌

08:32 PM

జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల

08:25 PM

నీళ్ల ట్యాంకర్ బోల్తా డ్రైవర్ శ్రీశైలంకు తీవ్ర గాయాలు

08:21 PM

ఇస్సీ వాంగ్ సంచలన బౌలింగ్...

08:08 PM

భీమిలిలో రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచన ఉంది: తమన్

07:59 PM

దేశంలో త్వరలో రైతుల తుపాను రాబోతోంది : సీఎం కేసీఆర్

07:56 PM

నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌..రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌

07:53 PM

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషిని అభినందించిన చంద్రబాబు

06:42 PM

గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...

06:27 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : జానారెడ్డి

06:23 PM

టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని నన్ను కోరారు: రాపాక వరప్రసాద్

05:52 PM

చిన్న‌స్వామి స్టేడియంలో పూర్తి స్క్వాడ్‌తో ఆర్సీబీ ప్రాక్టీస్

05:37 PM

జిఎస్‌ఎల్‌వి మార్క్3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

05:19 PM

కరీంనగర్‌లో 156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

05:07 PM

స్విస్ ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన సాత్విక్ - చిరాగ్

04:53 PM

ఐపీఎల్ కామెంటేటర్ గా బాలకృష్ణ

04:45 PM

థ్యాంక్యూ గాడ్..పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సముద్ర ఖని

04:32 PM

మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ : సీఎం కేసీఆర్

04:15 PM

రాహుల్‌ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: ఎంపీ కోమటిరెడ్డి

04:07 PM

తెలంగాణలో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

03:33 PM

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

03:28 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య

03:01 PM

పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తాం: రేవంత్‌

02:36 PM

షాకింగ్..బోరు బావి నుంచి బంగారం..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.