Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాలల కథల మాంత్రికుడు 'ధర్మపురి' సంగనభట్ల చిన్న రామకిష్టయ్య | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 15,2022

బాలల కథల మాంత్రికుడు 'ధర్మపురి' సంగనభట్ల చిన్న రామకిష్టయ్య

             'భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస' అంటూ మేము శేషప్ప కవి రాసిన పద్యాన్ని చదువుకున్నవాళ్ళం. నేటి తరం కూడా వాటిని చదువుకుంటుంది. గోదావరి తీరంలోని శేషప్ప స్తుతించిన శ్రీ నారసింహ క్షేత్రమైన ధర్మపురి నివాసి సంగన భట్ల చిన్న రామకిష్టయ్య. ఈ విశ్రాంత భాషోపాధ్యాయుని రచనాశక్తి, యుక్తి నాకే కాదు తెలుగు బాలలకు, బాల సాహిత్య కారులకు అంతుచిక్కని రహస్యం. కారణం ఈ కథల మాంత్రికుని మంత్రదండంలోని కథలు ఎంతకూ అయిపోవు. 'వేదంలా ఘోషించే గోదావరి'లా ఈ కథల గోదారి ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకు ఒక్క ఉదాహరణ... 2021 సంవత్సరంలో వీరు రాసిన 215 కథలు అన్ని ప్రముఖ తెలుగు పత్రికల్లో వచ్చాయి.
             ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో రామకిష్టయ్య జన్మించారు. వీరి తల్లిదండ్రులు దామోదర, పాపయ్య శాస్త్రి. ధర్మపురిలోని శ్రీ లక్ష్మి నరసింహా సంస్కృతాంధ్ర కళాశాలలో డిగ్రీ వరకు చదివి, ఆ తర్వాత బి.ఈడి. పూర్తిచేసి 1983లో ఉపాధ్యాయ వృత్తిలో చేరాడు. ఆకాశవాణి కళాకారుడైన సంగనభట్ల రంగస్థల నటులు. గయోపాఖ్యానం, శ్రీ కృష్ణరాయబారం, సతీ సావిత్రి, చాణక్య చంద్రగుప్త వంటి పౌరాణిక, చారిత్రక నాటకాలలో నారదుడు, అక్రూరుడు, కర్ణుడు, యశోవర్మ వంటి పాత్రలు ధరించి ప్రేక్షకుల్ని తన గాన మాధుర్యంతో ముగ్ధులను చేశారు. రేడియోలో గానం చేసిన లలిత,ప్రభాత, దేశభక్తి బృంద గీతాలు కూడా వీరికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.
బాలల కథలంటే ఇష్టపడే రామకిష్టయ్య పాఠశాల స్థాయిలో చదివేటప్పుడు చందమామ, బాలమిత్ర పత్రికల స్ఫూర్తితో కథలు చదివి, ఆ తర్వాత తాను కూడా పిల్లల కొరకు కథలు రాశారు. సంగనభట్ల తొలుత వ్యాసకర్త. మను చరిత్ర వర్ణనా చమత్కారం, ప్రబంధాలలో చంద్రోదయ వర్ణన, తెలుగులో క్షేత్ర మాహాత్మ్య కావ్యాలు మొదలైన అనేక సాహిత్య వ్యాసాలు స్రవంతి మాస పత్రికలో ప్రచురింపబడ్డాయి.
మార్చి, 2002లో తెలుగు విద్యార్థిలో రామకిష్టయ్య మొదటి కథ 'గురుదక్షిణ' ప్రచురింపబడింది. దానితో ప్రోత్సాహం కలిగి పిల్లల కథలు రాయడం ప్రారంభించారు. బాలల పత్రిక బుజ్జాయిలో 2003లో మరో కథ 'గొప్ప పని' ప్రచురింపబడింది. అప్పుడే వచ్చిన మరొక ఆటవిడుపు బాలల పత్రికలో రామకిష్టయ్య కథలు ప్రచురింపబడ్డాయి. వీళ్ళు నిర్వహించిన కథల పోటీలో 'సైగలతో పోటీ' కథకు ప్రత్యేక బహుమతి కూడా వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 20 ఏండ్లకు పైగా 650 వరకు కథలు వ్రాశారు. వీటిలో నాలుగు వందల పైన కథలు 31 ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
వచనం. పద్యం, గేయం, కథ రాసి మెప్పించగలిగిన వీరు 'రామకృష్ణ శతకం' అనే బాలల నీతి శతకం, 'నృహరి శతకం' రాశారు. అచ్చయిన తొలి బాలల కథల సంపుటి 'పక్షిసాక్ష్యం'. అటు తరువాత విజయవాడ నుండి 'బాలల నీతి కథలు 9, 10' భాగాలు ప్రచురించబడ్డాయి. వీరి 'మారిన కాలం' రేడియో నాటిక ఆకాశవాణి, ఆదిలాబాద్‌ కేంద్రం ద్వారా మూడు దశాబ్దాల క్రితమే రావడం విశేషం. ఇప్పటికీ ప్రతిరోజూ ఏదో ఒక పత్రికలో వీరి కథ అచ్చవుతూనే ఉంటుంది.
బాలల్లో మార్పు తీసుకు రావడానికి కథను అత్యంత శక్తివంతమైన సాధనంగా భావిం చిన ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు అందుకు తగినట్టుగా కథలను రాశారు. పిల్లలతో పాటు పెద్దలను కూడా తన కథలతో ఆకట్టు కున్నారు. ఇటీవల వచ్చిన వీరి తాజా కథల సంపుటి 'చేప నవ్వింది' సంగనభట్ల కథన శక్తికి, బాలల మీదున్న ప్రేమకు నిదర్శనం. తాను రాయడమే కాకా పిల్లలతో కథలు, కవితలు రాయించడం ఈ కథల తాతకు బాగా నచ్చిన పని. ఇవేకాక నవ తెలంగాణ వీరి తాజా కథల సంపుటిని అచ్చువేస్తోంది. మరో రెండు సంపుటాలు అచ్చులో ఉన్నాయి. పది సంపుటాలకు సరిపడా కథలు ఈ కథల మాంత్రికుని 'కథల జోలె'లో ఉన్నాయి.
ప్రధానంగా వీరి కథలు జంతువుల నేపథ్యంగా సాగుతాయి. పిల్లలకు ఇష్టమైన రీతిలో రాయడం సంనభట్లకు వెన్నతో పెట్టిన విద్య. వీరి కథలన్నీ వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. వీరి ''కథలతో పిల్లల ఆలోచనా దృక్పథంలో మార్పు వస్తుంది. వీరి కథల ద్వారా పిల్లల్లో పఠనాసక్తి పెరుగుతుంది. చదువుకోవాలనే కోరిక కలుగుతుంది. విద్యార్థులలో సృజనాత్మక పరిజ్ఞానం పెరిగి ఉత్తమ బావి భారత పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది'' అంటాడు కందుకూరి భాస్కర్‌. అక్షరాస్యతా ఉద్యమం, వయోజన విద్య మొదలుకుని అనేక కార్యక్రమాలకు తన గళాన్ని, సాహిత్యాన్ని అందించిన సంగనభట్ల 2019లో రంగినేని ట్రస్ట్‌, సిరిసిల్ల వారి పురస్కార సత్కారం మొదలుకుని నేటి వరకు అనేక సాహిత్య, సాంస్కృతి సంస్థలు,స్వచ్చంధ సంస్థలు వీరిని గౌరవించాయి. 2011లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్‌ను కూడా పొందారు. జయహో! సంగనభట్ల.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

09:58 PM

విద్యార్థి ఆత్మహత్య... విషయం తెలుసుకున్న వార్డెన్ మృతి

09:38 PM

హైదరాబాద్‌లో పేలుడు పదార్థాల కలకలం..

09:17 PM

కుమారుడు కనిపించడం లేదని.. పోలీసులతో వాగ్వాదం

08:59 PM

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పు..

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.