Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లత్కోర్ సాబ్‌ | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 30,2022

లత్కోర్ సాబ్‌

నగరంలో తిరుగుతన్న గణపతికి ఒక చోట ఒక ఎలక కనిపించింది. అది బలిసి ఉంది. అతణ్ని అది గుర్తు పట్టింది. గుర్తు పట్టి సాస్టాంగ దండిపణామం చేసింది.
''ఎలకా! ఎలకా! ఎలా వున్నావ్‌'' అని గణపతి అడిగాడు.
''బాగున్నాను దేవా!''
''ఇతర ఎలకలెలా ఉన్నాయి?''
''అవీ బాగున్నాయి. జెనాలకివ్వకుండా పనికిమాలిన ప్రభుత్వం గోదాముల్లో బియ్యం ఉంచింది. ఆ బియ్యాన్ని తింటూ రాజకీయ నాయకుడిలా మస్తు మీదున్నాయి.''
''మంచిది'' అంటూ వినాయకుడు ముందుకెళ్లాడు.
అమ్మోనగరంలో తిరిగిన తరువాత వినాయకుడు కైలాసం వైపు వెళుతుండగా వైకుంఠర నుంచి భూలోకం వస్తున్న నారదుడు కలిసాడు.
''గణపతీ! జెనాలు నీకు పూజలు చేస్తున్నారా? ఉండ్రాళ్లు పెడుతున్నారా?
''పూజలూ చేస్తున్నారు. ఉండ్రాళ్లూ పెడుతున్నారు. కానీ ఏం లాభం''
''ఎందుకలా అంటున్నావు'' నారదుడు అడిగాడు.
''తొమ్మిది రోజులు పూజలు చేసి ఏరికోరి మరీ నన్ను నీళ్లల్లో ముంచుతున్నారు''
'ఏడాదికొక్కసారి జెనం నాకు పూజలు అలాగే అయిదేళ్లకొకసారి నాయకులు జెనం దేవుళ్ల చుట్టూ చక్కర్లూ కొడుతున్నారు. బీరు తాగిస్తున్నారు. బిర్యానీ తినిపిస్తున్నారు. ముడుపులిస్తున్నారు. వాగ్దానాల వాన కురిపించి ఆశల విత్తనాలు జల్లుతున్నారు. తొమ్మిది రోజులు పూజ చేసి పదో రోజు నన్ను నీట ముంచుతున్నారు. సరిగ్గా అలాగే ఐదేళ్లకొకసారి నాయకులు జెనం దేవుళ్ళకు పూజలు చేసి వారిని నిలువునా ముంచేస్తున్నారు'' అని నారదుడున్నాడు.
''నేను ఇంటి నుంచి వచ్చి చాలా సేపైంది. వస్తా నారదా!'' అంటూ వినాయకుడు కైలాసం వైపు వెళ్లాడు.
**********
ఈ మధ్య రాష్ట్ర రాజధాని అమ్మో నగరంలో కొత్త దుకాణాలు పుట్టుకొచ్చాయి. వేలం పాటలో పై చెయ్యి ఎవరిదైతుందో వారికే దుకాణం పెట్టే అవకాశం దొరికేది. నాయకుల దన్నుతో ఆ దుకాణాలు నడిచేవి. ఇంతకీ ఏమిటా దుకాణాలు. వాటిలో ఏం అమ్ముతున్నారు. అమ్మిన సరుకుల్ని ఎవరు కొంటున్నారు.
అవి అల్లాటప్పా దుకాణాలు కావు
వాటిలో చిన్న పిల్లలాడుకునే రబ్బరు బొమ్మలూ లేవు
నాణ్యమైన, నాజూకైన పింగాణీ బొమ్మలూ లేవు.
కనువిందు చేస్తూ పలికే కొండపల్లి బొమ్మలూ లేవు
దవళవర్ణపు దంతపు బొమ్మలకూ, అందమైన నిర్మల్‌ బొమ్మలకూ దిక్కులేదు.
ఆ దుకాణాల్లో గడ్డి బొమ్మలున్నాయి.
గడ్డితో చేసిన నాయకుల దిష్టి బొమ్మలున్నాయి.
దీపావళి ముందే టపాకుల దుకాణాలకు గిరాకీ ఉంటుంది. పండుగయ్యాక అవి పత్తా లేకుండా పోతాయి. దిష్టిబొమ్మల దుకాణాలకు మాత్రం రోజూ గిరాకీ ఉంటుంది. ఇంతకు ముందు నాయకుల దిష్టిబొమ్మలను చెంచాగాళ్లే చేసేవారు. అప్పుడు మహామంత్రి దిష్టిబొమ్మా; మంత్రి దిష్టిబొమ్మా; గల్లీ లీడర్‌ దిష్టిబొమ్మా ఒక్కలాగానే ఉండేవి. ఇప్పుడలా కాదు, మహామంత్రి దిష్టిబొమ్మ అచ్చం మహామంత్రిలాగే ఉంటుంది. ఏ నాయకుని దిష్టిబొమ్మ అచ్చం ఆ నాయకుని లాగే ఉంటుంది.
ఈ దిష్టిబొమ్మలు రెండు రకాలు. ఒకటి ఉత్తి దిష్టిబొమ్మ. రెండోది మాట్లాడే దిష్టిబొమ్మ. ఈ బొమ్మ ఖరీదెక్కువ. ఖరీదెక్కువైనా ఎక్కువ మంది ఈ బొమ్మవైపే మొగ్గు చూపేవారు.
''ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోండి'' అని ఒక దిష్టిబొమ్మ అంటుంది.
మాట్లాడే దిష్టిబొమ్మల్లో 'నేను పిచ్చికుక్కను. ..................... ' అని ఇంకొకటి అంటుంది.
'ఆ విధంగా ముందుకు పోతున్నాం' అని ఒక దిష్టిబొమ్మ అంటే 'దద్దమ్మలు, సన్నాసులు, ఇసుంట రమ్మంటె ఇల్లంత నాదంటరు' అని ఇంకొక దిష్టిబొమ్మ అంటుంది.
'మొకం మీద ఊంచుత' అని ఒక దిష్టి బొమ్మ అంటుంది. మాటిమాటికీ 'మహానేత' అని మరో దిష్టిబొమ్మ అంటుంది.
అన్ని దిష్టిబొమ్మలూ అన్ని రోజులూ అమ్ముడు పోవు. ఒక్కో రోజు ఒక్కో నాయకుని దిష్టి బొమ్మకు గిరాకీ ఉంటుంది. సరుకుల డోర్‌ డెలివరీ లాగ దిష్టిబొమ్మల చౌరస్తా డెలివరీ సదుపాయం కూడా ఉంది.
దిష్టిబొమ్మల దుకాణాల్లో నాయకుల పోలిన గడ్డి బొమ్మలే కాకుండా మేకులూ, సూదులూ, పాడెలూ సరసమైన ధరలకు దొరుకుతాయి.
'నేడు నగదు - రేపు ఉద్దెర' అని రాసి ఉన్న చిన్న బోర్డు ఈ దుకాణాల ముందు ఉంటుంది.
ఒక్కోసారి నాయకుని దిష్టిబొమ్మకు మేకులూ, సూదులూ గుచ్చుతారు.
గుడ్చి పాడె మీద ఉంచుతారు.
ఆ పాడెను చౌరస్తా వరకు మోసుకెళతారు.
చౌరస్తాలో పాడె దించి గడ్డిబొమ్మను నేలమీద ఉంచుతారు.
ఆవేశపరులు చెప్పుతో ఆ బొమ్మను కొడతారు.
ఆఖరి ఘట్టంలో దిష్టిబొమ్మకు నిప్పంటిస్తారు.
అరుదుగా పిండిపదానం కూడా చేస్తుంటారు.
ముమ్మూర్తులా తనను పోలిన దిష్టిబొమ్మను నిరసనకారులు తగలబెట్టినందుకు ఏ నాయకుడికీ విచారం లేదు. విచారం మాటలా ఉంచి అధినాయకుని కుర్చీ ఎక్కినంతగా సంబరపడతారు. సంతోష సముద్రంలో మునిగిపోతారు. మబ్బుల విమానంలో తేలిపోతాడు. అంతో ఇంతో పేరున్న నాయకుని దిష్టిబొమ్మనే తగలబెడతారు. చిల్లర నాయకుని దిష్టిబొమ్మను ఎక్కడైనా తగలెడతారా? అని అతగాడు అడుగుతాడు. మానాభిమానాలున్నవాడు రాజకీయ నాయకుడు కాలేడు. సిగ్గుపడేవాడు రాజకీయాలకు పనికిరాడు.
గంజన్నావు, బెంజన్నావు
బస్తీమే సవాల్‌ అంటూ బరిలో దిగావు.
రాజకీయాల్లో రఫ్ఫాడించేస్తానన్నావు
నువ్వేమన్నా; ఎన్ని వేషాలేసినా ఇంతవరకూ ఒక్కడూ నీ దిష్టిబొమ్మ తగలెట్టలేదు. నీకున్న పలుకుబడి ఇదేనా? నువ్వు చెప్పిందంతా కతలేనా! అంటూ ఒక నాయకుని భార్య ఆయనగార్ని సాధించింది.
**********
మహామంత్రి లత్కోర్‌కు తెల్లవారుజామునే లేవడం ఎలా అలవాటో అలానే లేవగానే ఛారు తాగటం కూడా అలవాటే. ఛారు లేకపోతే అతనికి సుద్రాయించదు. చైన్‌ బట్టదు. పిచ్చెక్కినట్లుంటుంది. రోజులాగే ఆ రోజు అతని భార్య ఛారు ఇవ్వలేదు. చూసి చూసి-
''జెర ఛారు ఇస్తావా?'' అని లత్కోర్‌ అడిగాడు.
''ఇవ్వను''
''ఎందుకివ్వవు''
''గృహహింసకు వ్యతిరేకంగా బంద్‌కు మా మహిళా సంఘాలు పిలుపిచ్చాయి''
''ఇవాళ వంట కూడా చెయ్యవా?''
''వంటా గింటా అన్నీ బంద్‌''
''నువ్వు వంట బంద్‌ చేస్తే నేను నిరాహార దీక్ష చెయ్యాలేమో!''
ఈ నడుమ దిక్కుమాలిన రాష్ట్రంలో చీటికీ మాటికీ బంద్‌లు జరుపుతున్నారు. బంద్‌ ఉంటే బస్సులు నడవ్వు. దుకాణాలు బందుంటాయి. బడులు బందుంటాయి. పెట్రోలు బంకులు బందుంటాయి. హోటళ్ళు బందుంటాయి. సినిమా ధియేటర్లూ బందుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ పని అక్కడే నిలిచిపోతుంది. ఎఫ్‌ - 14 తీసెయ్యాలని ఒక ప్రాంతంలో బంద్‌ చేస్తే ఎఫ్‌ - 14 ఉంచాలని మరో ప్రాంతంలో బంద్‌ చేసారు.
బంద్‌ నాడు ప్రభుత్వ దిష్టిబొమ్మనే కాకుండా మహామంత్రి దిష్టిబొమ్మ కూడా తగలెట్టారు. కొంతమంది ప్రభుత్వ దిష్టిబొమ్మను చౌరస్తా వరకూ పాడె మీద మోసుకెళ్లి అక్కడ తగలెట్టారు. గుండు కొట్టించుకొన్నారు. పిండం పెట్టారు. దిక్కుమాలిన రాష్ట్రంలో దిష్టిబొమ్మ తయారీ గృహ పరిశ్రమ అయింది.
''అన్నా దిష్టిబొమ్మల తయారీకి లోన్‌ ఇప్పించే'' అని ఒక చెంచా మహామంత్రినడిగాడు.
''ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే ఇంగలం దొరికిందని ఇంకొకడు మురిసాడట. బంద్‌లతో నేను చస్తూ ఉంటే మధ్య నీ గోలేంది'' అని లత్కోర్‌ విసుక్కొన్నాడు.
ఈ మధ్యన దిక్కుమాలిన రాష్ట్రంలో బందుజన పార్టీ అనే కొత్త పార్టీ పెట్టారు.
బంద్‌లతో జనం సతమతమవుతున్నారు.
ఒక్క తీర్గ తలబాదుకొంటున్నారు.
ముప్పుతిప్పలు పడుతున్నారు.
ఎక్కడికీ వెళ్లలేక ఇళ్లకీ పరిమితమవుతున్నారు. బంద్‌లు లేకుండా చేస్తాం. అందుగ్గాను బంద్‌లకు వ్యతిరేకంగా రెండు రోజులు బంద్‌కు పిలుపునిస్తున్నామని బందుజన పార్టీ నాయకులు ప్రకటించారు.
**********
పూర్వకాలంలో వేగులవారున్నప్పటికీ రాజులు పూర్తిగా వారి మీద ఆధారపడేవారు కాదు. మారువేషంలో రాజ్యంలో తిరిగి ప్రజలు తమ గురించి ఏమంటున్నారో తెలుసుకొనేవారు. వారిలాగే తను కూడా మారు వేషంలో రాష్ట్రమంతా తిరిగి ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని తెల్లవారు జామున ఒకానొక బ్రహ్మీ ముహూర్తంలో లత్కోర్‌ అనుకొన్నాడు. మొదట హోంమంత్రిని కూడా తన వెంట తీసుకొని వెళ్లాలనుకొన్నాడు. పెళ్లికెళుతూ పిల్లిని చంకన బెట్టుకొని వెళ్లడమెందుకని తరువాత ఊరుకొన్నాడు.
మహామంత్రి లత్కోర్‌ ప్యాంటూ, షర్టూ తొడుకొన్నాడు. ఇన్‌షర్ట్‌ వేసుకొన్నాడు. అంతకు ముందే తెప్పించుకొన్న విగ్గు పెట్టుకొ న్నాడు. సిగరెట్టు కాలుస్తూ, రింగురింగులుగా పొగ వదు లుతూ; పిల్లిలా అడుగులో అడు గేస్తూ అప్పుడే అమెరికా నుంచి వచ్చి వాడిలా ఫోజు కొడుతూ వీధిలోకి అడుగెట్టాడు. ఎవరూ అతడిని గుర్తుపట్టలేదు.
లత్కోర్‌ చౌరస్తాలోని ఇరానీ హోటల్‌కు వెళ్లాడు.
''ఏక్‌ కడక్‌ ఛారు లావ్‌'' అన్నాడు.
అతని ముందు ఇద్దరు కూర్చుని 'చెత్త' ముచ్చట పెడుతున్నారు.
''మా వాడకట్టలో ఎక్కడ చూసినా చెత్తే''
''సఫాయోళ్లు చెత్త ఎత్తడం లేదా?''
''ఏ వారం రోజులకో ఎత్తుతున్నారు''
''మీ కార్పొరేటర్‌కు చెప్పకపోయారా''
''కార్పొరేటర్‌కూ; ఎమ్మెల్యేకూ, ఆకరికి మున్సిపల్‌ మంత్రికీ చెప్పినా లాభం లేకపోయింది. ఎంత చెత్త ఉంటే అంత కరెంటు వస్తుందని మహామంత్రి చెబుతున్నాడు''
''చెత్తకూ, కరెంటుకూ సంబంధమేమిటి?''
''చెత్త నుంచి కరెంటు తీస్తారట''
''కరెంటేమో గాని దోమలు కుట్టికుట్టి చంపుతున్నాయి''
''దోమల వల్ల సంగీతం నేర్చుకోవచ్చని లత్కోర్‌ గారంటున్నారు''
ఇలా వాళ్లు మాట్లాడుకొంటున్నారు.
లత్కోర్‌ హోటల్‌ నుంచి బయటకు వచ్చాడు.
పాన్‌ డబ్బా దగ్గరకెళ్లి సిగరెట్టు ముట్టిచ్చుకున్నాడు.
అక్కడ-
''మన బొచ్చె సర్కార్‌ శాన మంచిది. రూపాయికి కిల బియ్యమిస్తున్నది'' అని ఒకడన్నాడు.
''రూపాయికి కిల బియ్యమిస్తే ఫాయిదేమున్నది?'' అని ఇంకొడన్నాడు.
''ఏందే గట్లంటవు''
''రూపాయికి కిల బియ్యం తినొస్తదా?''
''బొచ్చె సర్కార్‌ అన్ని ఫిరీగ ఇస్తున్నది''
''ఎన్కట్కి ఒకరాజు అన్ని గొర్లకు ఉన్ని కోట్లు కుట్టిచ్చిండట. అమ్మా! అమ్మా! మన గొర్లకు ఉన్ని కోట్లు కుట్టిచ్చెతందుకు ఉన్నియాడికెల్లి దెస్తడే అని ఒక గొర్రె పిల్ల అడిగిందట. యాడికెల్లో ఏందో గొర్లకెల్లే అని గా తల్లి గొర్రె చెప్పిందట''
''అంటె లత్కోర్‌ మన పైసలు మనకే ఇస్తున్నడా?''
''అవ్‌. గీనడ్మ పేపర్లల్ల ఒక అడ్వటేజ్‌మెంటొచ్చింది. సూసినవా''
''లే. గదేంది?''
''పది రోజుల నుంచి మా బాబు (నెల జీతం) కనిపించడం లేదు. ఎక్కడైరనా కనిపిస్తే మా బ్యాంకుకు తీసుకెళ్లండి. బాబూ! నువ్వు కనబడక పాలవాడూ, కిరాణా దుకాణాదారుడూ, కూరగాయలవాడూ ఇంటి యజమానీ హైరానా పడుతున్నారు. మీ తమ్ముని (డి.ఏ) జాడ లేదు. మీ మేనమామైతే (పి.ఆర్‌.సి) మమ్మల్ని మరిచిపోయాడు. నువ్వు కూడా మమ్మల్ని వదిలిపోతే ఎలా నాయనా! నువ్వు లేక మేమెలా బతుకుతామయ్యా? నీ కోసం బెంగపెట్టుకొని మీ అమ్మ మంచం పట్టింది. మీ చెల్లెలు స్కూలుకెళ్లకుండా ఇంట్లో కూర్చుంది. ఎక్కడున్నా త్వరగా వచ్చేయి.
నీ కోసం ఎదురు చూస్తున్న
నీ తల్లిదండ్రులు (సర్కారు జీతగాళ్లు)''
లత్కోర్‌ అక్కడ నుంచి ఒక హోటల్‌కెళ్లి రూం తీసుకొన్నాడు. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. తెల్లవారి ఛాయ్‌ తాగి పేపర్‌ చదువుతూ కూర్చున్నాడు.
''నిన్న పొద్దున్నుంచీ మహామంత్రి కనిపించడం లేదు. ఆయన ఎక్కడికెళ్లాడో ఆయనకేమైందో తెలియడం లేదు. పోలీస్‌ జాగిలాలు కూడా ఆయన జాడ కనుక్కోలేకపోయాయి. తీవ్రవాదులు ఆయనను కిడ్నాప్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన జాడ తెలియకపోతే కొత్త మహామంత్రిని నియమించే సూచనలున్నాయి. హోంమంత్రి రాయుడూ, ఆర్థిక మంత్రి అనంతయ్యా మహామంత్రి కుర్చీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది' అనే వార్త మొదటి పేజీలో ఉంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

07:09 AM

భారీ భూకంపం..2600 మంది దుర్మరణం

06:46 AM

నేడు జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ ఫలితాలు విడుదల

06:40 AM

హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: గువ్వల బాలరాజు

09:58 PM

ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌

09:51 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

09:42 PM

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి

09:21 PM

భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..

08:21 PM

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..

07:46 PM

ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యో‌గాల తోల‌గింపు..

07:24 PM

ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

06:56 PM

కత్తితో యువకుడి హల్‌చల్‌.. షూట్‌ చేసిన పోలీసులు

06:24 PM

అభ్యర్దులు అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ పరీక్ష తేదీలు విడుదల..

05:58 PM

తుర్కియేలో మరోసారి భారీ భూకంపం..

05:21 PM

రేపటి నుండి కేంద్రీయ విద్యాయాల ఉద్యోగాలకు పరీక్ష..

05:10 PM

తెలంగాణలో అవసరాన్ని బట్టి గిరిజన విశ్వవిద్యాలయం..

04:43 PM

కుదిపేసిన భూకంపం... 1600 దాటిన మృతులు

04:17 PM

సానియా నా మండే మోటివేషన్‌ : మహీంద్రా

03:36 PM

వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా..

03:12 PM

మూడ‌వ‌సారి గ్రామీ అవార్డు గెలిచిన రిక్కీ కేజ్‌..

02:58 PM

రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

02:45 PM

సుప్రీంకోర్టులో ప్రమాణం చేసిన నూతన న్యాయమూర్తులు..

01:59 PM

బస్సులోంచి దూకేసిన డ్రైవర్..బస్సు బోల్తా

01:50 PM

నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

01:24 PM

ఢిల్లీ మేయ‌ర్ ఎన్నిక..మూడోసారి కూడా వాయిదా

01:03 PM

పేదలకు శుభవార్త..సొంత స్థలం ఉంటే రూ.3లక్షలు

12:41 PM

వరుస భూకంపాలు..300 దాటిన మృతుల సంఖ్య‌

12:24 PM

పార్లమెంటులో ‘అదానీ’ ప్రకంపనలు.. ఉభయ సభలు వాయిదా

12:13 PM

విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్రం వివక్ష : మంత్రి హరీశ్‌

11:46 AM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

04:47 PM

తెలంగాణ బడ్జెట్..ఏ శాఖకు ఎంతంటే..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.